బాలోత్సవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలోత్సవ్
బాలోత్సవ్
బాలోత్సవ్ 2017 లోగో
స్థితిక్రియాశీలకం
ప్రక్రియపిల్లల పండుగ
తేదీ(లు)నవంబరు రెండవ వారంలో 3,4 రోజులు
(బాలల దినోత్సవం వలె) )
ఫ్రీక్వెన్సీవార్షికం
స్థలంకొత్తగూడెం [a]
VVIT[b]
దేశంభారతదేశం
క్రియాశీల సంవత్సరాలు33
ప్రారంభించినది1991
ఇటీవలి28–30 November 2019
మునుపటి28–30 November 2018
వెబ్‌సైటు
[a]
[b]

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ప్రతి సంవత్సరం నవంబరు నెల రెండవ వారంలో మూడు రోజుల పాటు శుక్ర, శని, ఆది వారాల్లో జరిగే బాలల పండుగ బాలోత్సవ్. పిల్లలలోని సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఒక వేదిక ఈ బాలోత్సవ్.

నేపథ్యం

[మార్చు]

1960 సంవత్సరంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని ఉద్యోగులంతా కలిసి, వారి రిక్రియేషన్ కోసం ఒక క్లబ్‍ను ఏర్పాటు చేసుకున్నారు, వీరి ఆలోచన ఫలితంగానే 1991లో బాలోత్సవ్ రూపొందింది. 1991లో క్లబ్ కార్యవర్గ ఎన్నికలలో గెలుపొందిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్‍బాబు ఈ బాలోత్సవ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ హితవే లక్ష్యంగా ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో మొదటగా నాలుగు అంశాలతో మండల స్థాయిలో పోటీని నిర్వహించారు. చిత్రలేఖనం, వక్తృత్వం, క్విజ్, గీతాలాపన అంశాలతో ప్రారంభించిన ఈ బాలోత్సవ్ పోటీలలో 150 మంది పాల్గొన్నారు, ఈ బాలోత్సవ్ విజయవంతమవటంతో అప్పటి నుంచి ఈ క్లబ్ కార్యవర్గం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించింది. 1995 నాటికి బాలోత్సవ్ జిల్లా స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం కొత్త పోటీ అంశాలను పెంచుకుంటూ నిర్వహిస్తున్న ఈ బాలోత్సవ్ పాటించే ప్రమాణాలు, పారదర్శకత, ప్రతిభను గుర్తించే న్యాయనిర్ణయం కారణంగా రాష్ట్రస్థాయికి ఎదిగింది. 150 మందితో ప్రారంభమయిన ఈ బాలోత్సవ్ పోటీలలో 2012 నాటికి 15 వేల మంది బాలబాలికలు పాల్గొనే వేదికగా మారింది. సుదూర ప్రాంతాలనుండి వచ్చే బాలబాలికలకు భోజన వసతి సౌకర్యాలు క్లబ్ వారె సమకూరుస్తారు. నర్సరీ నుండి 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థినులు మాత్రమే పాల్గొంటారు. అనేక విషయాలలో బాలలో దాగి వున్న బహుముఖ ప్రతిభను వెలికి తీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము. చిత్రలేఖనము, క్విజ్, భరత నాట్యం, కూచిపూడి, చిత్రలేఖనము, జానపద నృత్యం, విచిత్ర వేష ధారణ, వక్తృత్వ పోటీలు, వంటి సుమారు 20 పైగా అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. పతి ఏటా నవంబరు నెలలో ఈ పోటీలు జరుగు తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బామా

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

సాక్షి ఫన్‍డే 2012 నవంబరు 4
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు