బాలెంత
స్వరూపం
స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన తరువాత 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెను బాలింత లేదా బాలెంతగా వ్యవహరిస్తారు.
బాలింత జ్వరం
[మార్చు]ప్రసవం అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది.
సాధారణ చికిత్స
[మార్చు]బాలింతలలో వాతం, ఒంటి నొప్పులు సాధారణంగా సంభవిస్తూంటాయి. వీటికి సింధువార (వావిలి) ఆకు చికిత్సగా పనిచేస్తుంది.
ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకంగా ఇది వాడుకలో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్థం.
కారణాలు
[మార్చు]- జననాంగాల్లో ఇన్ఫెక్షన్
- మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్
- రొమ్ములో ఇన్ఫెక్షన్
- సిజేరియన్ ఆపరేషన్ చేసిన పొట్టమీది కుట్లు చీము పట్టడం.
- రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం
- మలేరియా, క్షయ మొదలైన వ్యాధులు
- ఇతర బాక్టీరియా లేదా వైరస్ వ్యాధులు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ