Jump to content

బాలెంత

వికీపీడియా నుండి
(బాలింత నుండి దారిమార్పు చెందింది)
బాలెంతలు - ప్రసవం అయిన తరువాత కొన్ని రోజుల పాటు అనారోగ్య బారిన పడకుండా తప్పించుకొనేందుకు చెవిలో దూది పెట్టుకోవడం, వస్త్రాన్ని చుట్టుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు వహిస్తారు.

స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన తరువాత 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెను బాలింత లేదా బాలెంతగా వ్యవహరిస్తారు.

బాలింత జ్వరం

[మార్చు]

ప్రసవం అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది.

సాధారణ చికిత్స

[మార్చు]

బాలింతలలో వాతం, ఒంటి నొప్పులు సాధారణంగా సంభవిస్తూంటాయి. వీటికి సింధువార (వావిలి) ఆకు చికిత్సగా పనిచేస్తుంది.

ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకంగా ఇది వాడుకలో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్థం.

కారణాలు

[మార్చు]
Streptococcus[permanent dead link] pyogenes (red-stained spheres) is responsible for most cases of severe puerperal fever. It is commonly found in the throat and nasopharynx of otherwise healthy carriers, particularly during winter. Details: A pus specimen, viewed using Pappenheim's stain @ 900x magnification
  • జననాంగాల్లో ఇన్ఫెక్షన్
  • మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్
  • రొమ్ములో ఇన్ఫెక్షన్
  • సిజేరియన్ ఆపరేషన్ చేసిన పొట్టమీది కుట్లు చీము పట్టడం.
  • రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం
  • మలేరియా, క్షయ మొదలైన వ్యాధులు
  • ఇతర బాక్టీరియా లేదా వైరస్ వ్యాధులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాలెంత&oldid=3397274" నుండి వెలికితీశారు