Jump to content

బాలల అకాడమీ

వికీపీడియా నుండి

బాలల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బాలల అకాడమీ స్థాపించింది. పిల్లలకు సంబంధించిన సాహిత్యం, కళ, పఠనాంశాలను అభివృద్ధి పరచి బాలలకు అందుబాటులోకి తెచ్చేందుకు 1976, మార్చి నెలలో ఈ అకాడమీ స్థాపించబడింది. ఇది బాలల సాహిత్యాభివృద్ధికి చాలా కృషి చేసింది.[1][2]

1976లో అప్పటి భారతరాష్ట్రపతి ఫ్రకృద్ధీన్ ఆలీ అహమ్మద్ ప్రారంభోత్సవం చేసారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ విద్యాసాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి మండలి వెంకటకృష్ణారావు దానికి తొలి అధ్యక్షునిగా వ్యవహరించాడు. దీనికి కార్యదర్శిగా రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవ రావు ఉన్నారు.

ఈ అకాడమీ మార్చి 1979 నుండి బాల చంద్రిక అనే బాలల బొమ్మల మాసపత్రికను ప్రచురిస్తున్నారు. ఇందులో బాలల వినోదానికి, విజ్ఞానానికి, వికాసానికి తోడ్పడే కథలు, వ్యాసాలు, గేయాలు ఉంటాయి.

అకాడమీ కార్యకలాపాలు

[మార్చు]
  • పిల్లలలోని సృజనాత్మక శక్తులను ప్రోత్సహించి వాటిని బయల్పరచడం.
  • బాలలలో అంతర్గతంగా ఉన్న తెలివి తేటలను పదును పెట్టే పుస్తకాలను ప్రచురించడం.
  • వారికి అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలు నెలకొల్పడం.

మూలాలు

[మార్చు]
  1. "ఇవిగో బుజ్జి కథలు! అవిగో జేజిమామయ్య పాటలు!". www.teluguvelugu.in. Retrieved 2020-09-29.[permanent dead link]
  2. "పిల్లల పుస్తకం..... | కవర్ స్టోరీ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-09-29.[permanent dead link]