Jump to content

బాబా సెహగల్

వికీపీడియా నుండి
బాబా సెహగల్
జననం
హర్జీత్ సింగ్ సెహగల్

(1965-11-23) 1965 నవంబరు 23 (వయసు 59)
లక్నో, ఉత్తర ప్రదేశ్
వృత్తిర్యాప్ గాయకుడు
జీవిత భాగస్వామిఅంజు
పిల్లలుతన్వీర్

బాబా సెహగల్ ఒక ప్రముఖ భారతీయ ర్యాప్ గాయకుడు.[1]

జీవితం

[మార్చు]

బాబా సెహగల్ నవంబరు 23, 1965 న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో జన్మించాడు. జి. బి. పంత్ విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో హానర్స్ పట్టా పొందాడు.[2]

బాబా సెహగల్ భార్య పేరు అంజు. వీరికి ఒక కుమారుడు తన్వీర్. ఈ దంపతులిద్దరూ 2010 నుంచి కలిసి ఉండటం లేదు. ఆషిమా కల్రా అనే మహిళతో ఆయన సహజీవనం కొనసాగిస్తున్నాడు.[3]

పాటలు

[మార్చు]

అతని మొదటి ఆల్బం దిల్ రూబా 1990 లో విడుదలైంది. రెండో అల్బం 1991 లో ఆలీ బాబా. మూడో అల్బం ఠండా ఠండా పానీ అతనికి దేశమంతటా మంచి పేరు సంపాదించి పెట్టింది. 2000 దశకంలో విదేశాలకు వెళ్ళి అక్కడ అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.

తెలుగు సినిమా

[మార్చు]

చిరంజీవి నటించిన రిక్షావోడు సినిమాలో బాబా సెహగల్ పాడిన రూప్ తేరా మస్తానా అనే పాట మంచి ప్రాచుర్యం పొందింది. తర్వాత దక్షిణ భారత సినిమా పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వచ్చిన అమెరికా, యూకే లో ప్రదర్శనలు ఇస్తుండటం వల్ల వాటిని అంది పుచ్చుకోలేక పోయాడు.[1] 2008 లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాలో బాబా సెహగల్ పాడిన సరిగమ పదనిసా అనే పాట మంచి ప్రాచుర్యం పొందింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 జి. వి, రమణ. "బాబా సెహగల్ ఇంటర్వ్యూ". idlebrain.com. Retrieved 31 October 2017.
  2. Baba Sehgal on Twitter: "this is for all CURIOUS ppl>> I did my https://t.co/CWvv2R52EP from G B Pant University, Pantnagar, Nainital & not from BITS, pilani tks..". Twitter.com (2015-11-17). Retrieved on 2017-05-26.
  3. Lipika, Varma (Aug 15, 2012). "BABA SEHGAL STANDS BY LIVE- IN PARTNER IN DISPUTE WITH WIFE".