Jump to content

బాన్

వికీపీడియా నుండి

బాన్ జర్మనీ రాష్ట్రమైన నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలోని ఫెడరల్ నగరం. ఇది రైన్ నది ఒడ్డున ఉంది. ఇది 3,00,000 పైచిలుకు జనాభాతో, కొలోన్‌కు దక్షిణ-ఆగ్నేయంగా సుమారు 24 కి.మీ. (15 మై.) దూరంలో, బాన్ రైన్-రూర్ ప్రాంతపు దక్షిణ భాగంలో ఉంది. ఇది జర్మనీలో అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. ఈ ప్రాంతంలో 1.1 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇది ఒక విశ్వవిద్యాలయ నగరం, లుడ్విగ్ వాన్ బీథోవెన్ జన్మస్థలం. 1949 నుండి 1990 వరకు పశ్చిమ జర్మనీకి రాజధానిగా ఉంది. బాన్ 1990 నుండి 1999 వరకు తిరిగి ఐక్యమైన జర్మనీకి ప్రభుత్వ స్థానంగా ఉంది.

జర్మనీ పునరేకీకరణ తరువాత రాజకీయపరమైన రాజీలో (బెర్లిన్-బాన్ చట్టం) భాగంగా, జర్మన్ ఫెడరల్ ప్రభుత్వానికి బాన్‌లో గణనీయమైన ఉనికి ఉంటుంది. 2019 నాటికి మొత్తం ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ఉద్యోగాలలో మూడింట ఒక వంతు బాన్‌లో ఉన్నాయి.[1] నగరాన్ని దేశ రెండవ, అనధికారిక, రాజధానిగా పరిగణిస్తారు. [2] ప్రెసిడెంట్, ఛాన్సలర్, బుండెస్రాట్ ల ద్వితీయ స్థానం, ఈ నగరం. ఆరు సమాఖ్య ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఇరవై ఫెడరల్ అథారిటీలకు ఇది ప్రాథమిక స్థానం. ఫెడరల్ సిటీ అనే పేరు జర్మనీలో దాని ప్రముఖ రాజకీయ స్థితిని ప్రతిబింబిస్తుంది. [3]

భౌగోళికం

[మార్చు]
మిడిల్ రైన్ తూర్పు ఒడ్డున ఉన్న కొండ శ్రేణి సీబెంగేబిర్జ్‌తో సహా, స్టాడ్‌థౌస్ నుండి చూసినపుడు సెంట్రల్ బాన్ దృశ్యం

స్థలాకృతి

[మార్చు]

బాన్, 1.1 కోట్లకు పైగా జనాభాతో జర్మనీ లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతమైన రైన్-రూర్ ప్రాంతానికి దక్షిణ భాగంలో ఉంది. నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలో రైన్‌ల్యాండ్-పాలటినేట్ సరిహద్దులో ఉంది. 141.2 కి.మీ2 (55 చ. మై.) పైచిలుకు విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రైన్ నదికి ఇరువైపులా విస్తరించిన నగరంలో, దాదాపు మూడు వంతులు నదికి ఎడమ ఒడ్డున ఉంది.

దక్షిణ పశ్చిమాల్లో, బాన్ రైన్‌ల్యాండ్ నేచర్ పార్క్‌ను కలిగి ఉన్న ఈఫిల్ ప్రాంతానికి సరిహద్దుగా ఉంది. ఉత్తరాన, బాన్ కొలోన్ లోలాండ్ సరిహద్దుగా ఉంది. సహజ సరిహద్దులు ఈశాన్యంలో సీగ్ నది, తూర్పున సీబెంగేబిర్జ్ (సెవెన్ హిల్స్ అని కూడా పిలుస్తారు) ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్తర-దక్షిణ పరిమాణాలలో నగరం యొక్క అతిపెద్ద విస్తరణ 15 కి.మీ. (9 మై.), 12.5 కి.మీ. (8 మై.) పశ్చిమ-తూర్పు కొలతలలో. నగర సరిహద్దుల మొత్తం పొడవు 61 కి.మీ. (38 మై.) . బాన్ యొక్క భౌగోళిక కేంద్రం బాన్-గ్రోనౌలోని బుండెస్కంజ్లెర్ప్లాట్జ్ (ఛాన్సలర్ స్క్వేర్) .

వాతావరణం

[మార్చు]

బాన్‌లో సముద్ర వాతావరణాన్ని ఉంటుంది (Cfb). రైన్ లోయలోని కొలోన్ లోతట్టుకు దక్షిణాన బాన్, జర్మనీ లోని అత్యంత వెచ్చని ప్రాంతాలలో ఒకటి.

శీతోష్ణస్థితి డేటా - Bonn
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 4.7
(40.5)
6.1
(43.0)
9.9
(49.8)
14.1
(57.4)
18.6
(65.5)
21.8
(71.2)
23.2
(73.8)
22.8
(73.0)
19.8
(67.6)
14.7
(58.5)
9.0
(48.2)
5.8
(42.4)
14.2
(57.6)
రోజువారీ సగటు °C (°F) 2.4
(36.3)
2.8
(37.0)
6.3
(43.3)
9.7
(49.5)
14.0
(57.2)
16.7
(62.1)
18.8
(65.8)
18.3
(64.9)
14.6
(58.3)
10.5
(50.9)
6.2
(43.2)
3.1
(37.6)
10.3
(50.5)
సగటు అల్ప °C (°F) −0.6
(30.9)
−0.4
(31.3)
1.6
(34.9)
4.5
(40.1)
8.1
(46.6)
11.3
(52.3)
13.0
(55.4)
12.5
(54.5)
10.0
(50.0)
6.4
(43.5)
3.2
(37.8)
0.6
(33.1)
5.9
(42.5)
సగటు వర్షపాతం mm (inches) 61.0
(2.40)
54.0
(2.13)
64.0
(2.52)
54.0
(2.13)
72.0
(2.83)
86.0
(3.39)
78.0
(3.07)
78.0
(3.07)
72.0
(2.83)
63.0
(2.48)
66.0
(2.60)
68.0
(2.68)
816.0
(32.13)
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 51.0 76.0 110.0 163.0 190.0 195.0 209.0 194.0 141.0 104.0 55.0 41.0 1,529
Source 1: Deutscher Wetterdienst (Bonn-Rohleber, period 1971– 2010)
Source 2: Climate-Data.org, high and low averages (altitude: 64m)[4]

చరిత్ర

[మార్చు]

20 వ శతాబ్దం - "బాన్ రిపబ్లిక్"

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, రైన్ నదిపై దాని వ్యూహాత్మక స్థానం కారణంగా బాన్‌కు సైనిక ప్రాముఖ్యత కలిగింది. పశ్చిమం నుండి జర్మన్ హార్ట్‌ల్యాండ్‌లోకి సులభంగా చొచ్చుకుపోవడానికి సహజమైన అవరోధంగా ఏర్పడింది. జర్మనీలోకి చొచ్చుకొచ్చిన మిత్రరాజ్యాల సైన్యం 1945 మార్చి 7 న బాన్‌ చేరుకుంది. అమెరికా 1వ పదాతిదళ విభాగం 1945 మార్చి 8-9 లో జరిగిన యుద్ధంలో నగరాన్ని స్వాధీనం చేసుకుంది.[5]

జర్మన్ పునరేకీకరణ వరకు పశ్చిమ జర్మనీ రాజధాని బాన్ (1962)లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ డి గాల్

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, బాన్ బ్రిటిషు ఆక్రమణ ప్రాంతంలో ఉండేది. పశ్చిమ జర్మనీ మొదటి ఛాన్సలరైన కొన్రాడ్ అడెనౌర్, మాజీ కొలోన్ మేయరు. ఆ ప్రాంతానికే చెందినవాడు. అధికారికంగా కొత్తగా ఏర్పడిన ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ బాన్ వాస్తవ రాజధానిగా మారింది. "ఫెడరల్ సంస్థల తాత్కాలిక స్థానం"గా నియమించబడింది. అయితే, బాన్ యొక్క బుండెషాస్‌లో కూర్చున్న బుండెస్టాగ్, బెర్లిన్ యొక్క హోదాను జర్మన్ రాజధానిగా నిర్ధారించింది. అప్పటికే ఫ్రాంక్‌ఫర్ట్‌లో రాజధానికి అవసరమైన సౌకర్యాలు చాలానే ఉన్నప్పటికీ, బాన్‌ను ఉపయోగించడం వలన 95 మిలియన్ మార్కుల ఖర్చు ఎక్కువైందని అంచనా వేసారు. అయినప్పటికీ బాన్‌ను తాత్కాలిక రాజధానిగా, ప్రభుత్వ స్థానంగా ఎంపిక చేసారు. అడెనౌర్‌తో పాటు, ఇతర ప్రముఖ రాజకీయ నాయకులు తిరిగి రెండు జర్మనీలు తిరిగి కలిసిపోతే అప్పుడు జర్మనీకి రాజధానిగా మళ్ళీ బెర్లిన్‌ను చేయాలని ఉద్దేశించారు. ఫ్రాంక్‌ఫర్ట్ లేదా హాంబర్గ్ వంటి ప్రధాన నగరంలో రాజధానిని ఏర్పాటు చేస్తే అది శాశ్వత రాజధానిగా మారుతుందని, పశ్చిమ జర్మనీలో పునరేకీకరణకు మద్దతును బలహీనపరుస్తుందని వారు భావించారు. అందుకే బాన్‌ను రాజధానిగా ఎంపిక చేసారు.

1949లో, బాన్‌లోని పార్లమెంటరీ కౌన్సిల్ ప్రస్తుత జర్మన్ రాజ్యాంగం, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి సంబంధించిన ప్రాథమిక చట్టాన్ని రూపొందించి ఆమోదించింది. పశ్చిమ జర్మనీకి రాజకీయ కేంద్రంగా బాన్ ఉండగా, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి ఆరుగురు ఛాన్సలర్లు, ఆరుగురు అధ్యక్షులు ఎన్నికయ్యారు. పశ్చిమ జర్మనీకి బాన్ రాజధానిగా ఉన్న సమయాన్ని సాధారణంగా బాన్ రిపబ్లిక్ అని పిలుస్తారు. 1990లో పునరేకీకరణ జరిగిన తరువాత బెర్లిన్ రిపబ్లిక్‌కు అంటారు.[6]

జాతీయ పునరేకీకరణ తర్వాత

[మార్చు]
1950 - 1994 మధ్య, విల్లా హామర్‌స్చ్‌మిడ్ట్, జర్మనీ అధ్యక్షుడి ప్రాథమిక అధికారిక నివాసం. నేడు ఇది ప్రెసిడెంట్ ద్వితీయ నివాసంగా పనిచేస్తుంది.

1990లో జర్మన్ పునరేకీకరణతో బెర్లిన్‌ జర్మనీకి రాజధాని అయింది. అయితే ఈ నిర్ణయంలో రిపబ్లిక్‌కు చెందిన రాజకీయ సంస్థలను కూడా తరలించాలని లేదు. ప్రభుత్వ స్థానాన్ని బెర్లిన్‌కు తరలించాలని కొందరు వాదించగా, మరికొందరు దానిని బాన్‌లోనే ఉంచాలని వాదించారు. ఈ పరిస్థితి నెదర్లాండ్స్‌తో సమానంగా ఉంటుంది - ఇక్కడ ఆమ్‌స్టర్‌డామ్ రాజధాని అయితే హేగ్ ప్రభుత్వ స్థానం. యునైటెడ్ జర్మనీ రాజధానిగా ఉన్న బెర్లిన్ చరిత్ర, జర్మన్ సామ్రాజ్యం, వీమార్ రిపబ్లిక్ తోను నాజీ జర్మనీ, ప్రష్యాలు రెండింటితోనూ పెనవేసుకుని ఉంది. కొత్తగా శాంతియుతంగా ఐక్యమైన జర్మనీని అటువంటి యుద్ధానికి సంబంధించిన నగరం నుండి పాలించరాదని కొందరు భావించారు. అదనంగా, బాన్ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీకి ప్రధాన కార్యాలయమైన బ్రస్సెల్స్‌కు దగ్గరగా ఉంది. చర్చ సమయంలో పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్, వెస్ట్ బెర్లిన్ మేయర్ విల్లీ బ్రాండ్ట్, విముక్తి తర్వాత ఫ్రాన్స్ ప్రభుత్వ స్థానాన్ని విచీలో ఉంచుకోలేదని చెప్పి, పశ్చిమ మిత్రరాజ్యాలకు ఆగ్రహం కలిగించాడు.[7]

వేడివేడిగా సాగిన ఈ చర్చను బుండెస్టాగ్ (జర్మనీ పార్లమెంట్) 1991 జూన్ 20 న 338–320 ఓటుతో బుండెస్టాగ్ ప్రభుత్వ స్థానాన్ని బెర్లిన్‌కు తరలించడానికి ఓటు వేసి, పరిష్కరించింది.[8] ప్రాంతాలను బట్టి ఓటు చీలిపోయింది. దక్షిణ పశ్చిమ ప్రాంతాల శాసనసభ్యులు బాన్‌కు అనుకూలంగాను, ఉత్తర, తూర్పు శాసనసభ్యులు బెర్లిన్‌కూ ఓటు వేశారు.[9] వయసును బట్టి కూడా వోట్లు చీలాయి; బెర్లిన్ గత వైభవాన్ని జ్ఞాపకం చేసుకున్న పెద్ద వయస్కులైన శాసనసభ్యులు బెర్లిన్‌కు మొగ్గు చూపగా, యువ శాసనసభ్యులు బాన్‌కు మొగ్గు చూపారు. అంతిమంగా, తూర్పు జర్మన్ శాసనసభ్యుల ఓట్లు బెర్లిన్‌కు అనుకూలంగా పడ్డాయి.[10]


1990 నుండి 1999 వరకు, తిరిగి కలిసిన జర్మనీ ప్రభుత్వ స్థానంగా బాన్ పనిచేసింది. జర్మన్ రాజధానిగా దాని పూర్వ స్థితికి గుర్తింపుగా, దీనికి ఫెడరల్ అనే స్థాయి ఉంది. బాన్ ప్రస్తుతం జర్మనీ ప్రభుత్వ స్థానం హోదాను బెర్లిన్‌తో పంచుకుంటోంది. అధ్యక్షుడు, ఛాన్సలర్, అనేక ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు (ఆహారం & వ్యవసాయం, రక్షణ వంటివి) బాన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 18,000 మంది ఫెడరల్ అధికారులలో 8,000 మంది బాన్‌లో ఉన్నారు. [2] మొత్తం 19 ఐక్యరాజ్యసమితి (UN) సంస్థలు బాన్‌లో పనిచేస్తున్నాయి.


బీతొవెన్ జన్మస్థలం మార్కెట్ ప్లేస్ సమీపంలోని బోన్‌గాస్సేలో ఉంది. మార్కెట్ స్థలం పక్కన బవేరియా క్లెమెన్స్ ఆగస్ట్ పాలనలో రొకోకో శైలిలో 1737లో నిర్మించిన ఓల్డ్ సిటీ హాల్ ఉంది. ఇది నగరంలోని అతిథుల రిసెప్షన్ల కోసం, మేయర్ కార్యాలయంగాను ఉపయోగపడుతుంది. కుర్ఫర్స్ట్‌లిచెస్ ష్లోస్ సమీపంలో ఉంది, ఇది ప్రిన్స్-ఎలెక్టర్ నివాసంగా నిర్మించబడింది. ఇప్పుడు ఇది బాన్ విశ్వవిద్యాలయపు ప్రధాన భవనం.

11వ, 13వ శతాబ్దాలలో నిర్మించబడిన, రోమన్ కాథలిక్ మినిస్టర్ ఆఫ్ బాన్ జర్మనీ యొక్క పురాతన చర్చిలలో ఒకటి.


బీథోవెన్ స్మారక చిహ్నం మున్‌స్టర్‌ప్లాట్జ్‌లో, జర్మనీ లోని పురాతన చర్చిలలో ఒకటైన బాన్ మిన్‌స్టర్‌ పక్కనే ఉంది.

నగరంలోని మూడు ఎత్తైన నిర్మాణాలు బాన్-వీనస్‌బర్గ్‌లోని WDR రేడియో మాస్ట్ (180 మీ. or 590 అ.), డ్యూయిష్ పోస్ట్ యొక్క ప్రధాన కార్యాలయం పోస్ట్ టవర్ (162.5 మీ. or 533 అ.), జర్మన్ పార్లమెంట్ సభ్యుల కోసం లాంగర్ యూజెన్ మాజీ భవనం (114.7 మీ. or 376 అ.) ఇప్పుడు UN క్యాంపస్ యొక్క స్థానం.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
ఈ ప్రాంతంలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన డ్యుయిష్ పోస్ట్ DHL ప్రధాన కార్యాలయం బాన్‌లో ఉంది.

డ్యుయిష్ టెలికామ్, దాని అనుబంధ సంస్థ T-మొబైల్, [11] డ్యుయిష్ పోస్ట్, జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్, సోలార్ వరల్డ్ యొక్క ప్రధాన కార్యాలయాలు బాన్‌లో ఉన్నాయి.

బాన్ నగరంలో మూడవ అతిపెద్ద సంస్థ బాన్ విశ్వవిద్యాలయం (యూనివర్శిటీ క్లినిక్‌లతో సహా) [12]

మరోవైపు, బాన్‌లో విలాసవంతమైన ఆహార ఉత్పత్తిదారులు వెర్‌పోర్టెన్, కెస్కో, క్లైస్ ఆర్గాన్ తయారీ, బాన్ ఫ్లాగ్ ఫ్యాక్టరీ వంటి అనేక సాంప్రదాయ, జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి.

ఐరోపాలో అతిపెద్ద మిఠాయి తయారీదారు హరిబో, దాని స్థాపక ప్రధాన కార్యాలయం, ఒక తయారీ ప్రదేశం బాన్‌లో ఉన్నాయి.

వెక్ గ్లాస్‌వెర్కే (ఉత్పత్తి సైట్), ఫెయిర్‌ట్రేడ్, ఈటన్ ఇండస్ట్రీస్ (గతంలో క్లాక్‌నర్ & మోల్లర్), IVG ఇమ్మోబిలియన్, కౌటెక్స్ టెక్స్‌ట్రాన్, సోలార్ వరల్డ్, వాపియానో, SER గ్రూప్ వంటి అగ్రప్రాంత ప్రాముఖ్యత కలిగిన ఇతర కంపెనీలు. [13]

జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
16204,500—    
17206,535+45.2%
17328,015+22.6%
176013,500+68.4%
178412,644−6.3%
17988,837−30.1%
18088,219−7.0%
181710,970+33.5%
184917,688+61.2%
187126,030+47.2%
189039,805+52.9%
191087,978+121.0%
191991,410+3.9%
192590,249−1.3%
193398,659+9.3%
19391,00,788+2.2%
19501,15,394+14.5%
19611,43,850+24.7%
19661,36,252−5.3%
19702,75,722+102.4%
19802,88,148+4.5%
19902,92,234+1.4%
20003,02,247+3.4%
20103,24,899+7.5%
20153,18,809−1.9%
20193,29,673+3.4%
Population size may be affected by changes in administrative divisions. source:మూస:CN

2011 నాటికి బాన్ జనాభా 3,27,913. దాదాపు 70% జనాభా పూర్తిగా జర్మన్ మూలానికి చెందినవారు, అయితే దాదాపు 1,00,000 మంది, కనీసం పాక్షికంగా కాని జర్మన్ మూలానికి చెందినవారు. ఈ నగరం జర్మనీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మునిసిపాలిటీలలో ఒకటి, దేశంలో అత్యధిక జనాభా కలిగిన 18 వ నగరం. 2030 లోపు, బాన్ జనాభా వుప్పర్టాల్, బోచుమ్ జనాభాను అధిగమిస్తుందని అంచనా వేసారు.[14]

బాన్‌లో "వలస నేపథ్యం" కలిగిన మైనారిటీల మూలాల సమూహాలను కింది పట్టికలో చూడవచ్చు. [15]

ర్యాంక్ వలస నేపథ్యం జనాభా (31 డిసెంబర్ 2022)
1  Syria  Syria 9,428
2  Turkey  Turkey 8,254
3  Poland  Poland 6,879
4  Morocco  Morocco 5,921
5  Italy  Italy 3,976
6  Russia  Russia 3,933
7  Iran  Iran 3,341
8  Spain  Spain 3,282
9  Iraq  Iraq 2,744
10  Romania  Romania 2,429
11  India  India 2,216
12  France  France 2,198
13  Afghanistan  Afghanistan 2,043
14  Ukraine  Ukraine 1,918
15  United States  United States 1,823
16  Bulgaria  Bulgaria 1,781
17  China  China 1,764
18  Tunisia  Tunisia 1,736
19  Greece  Greece 1,657
20  Kosovo  Kosovo 1,635
21  Kazakhstan  Kazakhstan 1,579
22  United Kingdom  United Kingdom 1,343
23  Netherlands  Netherlands 1,260
24  Croatia  Croatia 1,220

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
లుడ్విగ్ వాన్ బీథోవెన్
అలెగ్జాండర్ కోనిగ్
  • జోహన్ పీటర్ సాలోమన్ (1745-1815), సంగీతకారుడు
  • ఫ్రాంజ్ ఆంటోన్ రైస్ (1755–1846), వయోలిన్ వాద్యకారుడు, వయోలిన్ ఉపాధ్యాయుడు
  • లుడ్విగ్ వాన్ బీథోవెన్ (1770–1827), స్వరకర్త
  • సాలమన్ ఒపెన్‌హీమ్, జూనియర్ (1772–1828), బ్యాంకర్
  • పీటర్ జోసెఫ్ లెన్నె (1789–1866), తోటమాలి, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్
  • ఫ్రెడరిక్ వాన్ గెరోల్ట్ (1797–1879), దౌత్యవేత్త
  • కార్ల్ జోసెఫ్ సిమ్రాక్ (1802-1876), జర్మన్ రచయిత, నిపుణుడు
  • విల్హెల్మ్ న్యూలాండ్ (1806-1889), స్వరకర్త, కండక్టర్
  • జోహన్నా కింకెల్ (1810-1858), స్వరకర్త, రచయిత
  • మోసెస్ హెస్ (1812-1875), తత్వవేత్త, రచయిత
  • జోహన్ గాట్‌ఫ్రైడ్ కింకెల్ (1815–1882), వేదాంతవేత్త, రచయిత, రాజకీయవేత్త
  • అలెగ్జాండర్ కౌఫ్మాన్ (1817-1893), రచయిత, ఆర్కైవిస్ట్
  • లియోపోల్డ్ కౌఫ్మాన్ (1821–1898), మేయర్
  • జూలియస్ వాన్ హాస్ట్ (1822–1887), న్యూజిలాండ్, జియాలజీ ప్రొఫెసర్
  • డైట్రిచ్ బ్రాండిస్ (1824–1907), వృక్షశాస్త్రజ్ఞుడు
  • Balduin Möllhausen (1825-1905), యాత్రికుడు, రచయిత
  • మౌరస్ వోల్టర్ (1825–1890), బెనెడిక్టైన్, అబ్బే ఆఫ్ బ్యూరాన్, బ్యూరోనీస్ కాంగ్రెగేషన్ వ్యవస్థాపకుడు, మొదటి మఠాధిపతి
  • ఆగస్ట్ రీఫెర్‌షీడ్ (1835–1887), భాషా శాస్త్రవేత్త
  • ఆంటోనియస్ మరియా బోడెవిగ్ (1839-1915), జెస్యూట్ మిషనరీ, వ్యవస్థాపకుడు
  • నాథన్ జుంట్జ్ (1847–1920), వైద్యుడు
  • అలెగ్జాండర్ కోయినిగ్ (1858-1940), జంతు శాస్త్రవేత్త, బాన్‌లోని మ్యూజియం కోనిగ్ వ్యవస్థాపకుడు
  • ఆల్ఫ్రెడ్ ఫిలిప్సన్ (1864–1953), భౌగోళిక శాస్త్రవేత్త
  • జోహన్నా ఎల్బర్స్కిర్చెన్ (1864-1943), రచయిత, కార్యకర్త
  • మాక్స్ అల్స్‌బర్గ్ (1877–1933), న్యాయవాది
  • కర్ట్ వోల్ఫ్ (1887–1963), ప్రచురణకర్త
  • హన్స్ రీగెల్ సీనియర్ (1893–1945), వ్యవస్థాపకుడు
  • ఎడ్వర్డ్ క్రెబ్స్‌బాచ్ (1894–1947), నాజీ మౌతౌసేన్ నిర్బంధ శిబిరంలో SS వైద్యుడు, యుద్ధ నేరాల కోసం ఉరితీయబడ్డాడు
  • పాల్ కెంప్ (1896–1953), నటుడు

1900–1949

[మార్చు]
హైడ్ సిమోనిస్
  • హెర్మాన్ జోసెఫ్ అబ్స్ (1901–1994), డ్యుయిష్ బ్యాంక్ బోర్డు సభ్యుడు
  • పాల్ లుడ్విగ్ లాండ్స్‌బర్గ్ (1901-1944), సచ్‌సెన్‌హౌసెన్ కాన్సంట్రేషన్ క్యాంపులో, తత్వవేత్త
  • హెన్రిచ్ లూట్జెలర్ (1902-1988), తత్వవేత్త, కళా చరిత్రకారుడు, సాహిత్య పండితుడు
  • హెల్ముట్ హోర్టెన్ (1909–1987), వ్యవస్థాపకుడు
  • థియోడర్ స్కీఫెర్ (1910–1992), చరిత్రకారుడు, మధ్యయుగవాది
  • ఐరీన్ సాంగర్-బ్రెడ్ (1911-1983), గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త
  • ఎర్నెస్ట్ ఫ్రెడరిక్ షూమేకర్ (1911–1977), ఆర్థికవేత్త
  • క్లాస్ బార్బీ (1913–1991), నాజీ SS, గెస్టపో యుద్ధ నేరస్థుడు, "బచర్ ఆఫ్ లియోన్"
  • కార్ల్-థియోడర్ మోలినారి (1915–1993), జనరల్, జర్మన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అసోసియేషన్ వ్యవస్థాపక చైర్మన్
  • కార్ల్‌రోబర్ట్ క్రీటెన్ (1916–1943), పియానిస్ట్
  • హన్స్ వాల్టర్ జెక్-నెన్ట్విచ్ (జననం 1916), రెండవ పోలిష్ రిపబ్లిక్, SS కావల్రీ సభ్యుడు, యుద్ధ నేరస్థుడు
  • వాల్తేర్ కిల్లీ (1917–1985), జర్మన్ సాహిత్య పండితుడు, డెర్ కిల్లీ
  • హన్జో హస్సే (1921–1983), నటుడు
  • వాల్టర్ గోటెల్ (1924–1997), నటుడు
  • వాల్టర్ ఎస్చ్‌వీలర్ (జననం 1935), ఫుట్‌బాల్ రిఫరీ
  • అలెగ్జాండ్రా కోర్డెస్ (1935-1986), రచయిత
  • జోచిమ్ బిస్మీర్ (జననం 1936), నటుడు
  • రోస్వితా ఎస్సెర్ (జననం 1941), కానోయిస్ట్, 1964, 1968లో ఒలింపిక్ క్రీడలలో బంగారు పతక విజేత, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 1964
  • హీడే సిమోనిస్ (1943-2023), రాజకీయ నాయకుడు (SPD), ష్లెస్విగ్-హోల్‌స్టెయిన్ మాజీ ప్రధాన మంత్రి, 2005 నుండి UNICEF జర్మనీ గౌరవాధ్యక్షుడు
  • పాల్ అల్గర్ (జననం 1943), ఫుట్‌బాల్ ఆటగాడు
  • జోహన్నెస్ మోట్ష్ (జననం 1949), ఆర్కివిస్ట్, చరిత్రకారుడు
  • క్లాస్ లుడ్విగ్ (జననం 1949), రేస్ కార్ డ్రైవర్

1950–1999

[మార్చు]
  • గుంటర్ ఒల్లెన్‌ష్లాగర్ (జననం 1951), మెడికల్ అండ్ సైన్స్ జర్నలిస్ట్
  • హన్స్ "హన్నెస్" బొంగార్ట్జ్ (జననం 1951), ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్
  • క్రిస్టా గోట్ష్ (జననం 1952), రాజకీయ నాయకుడు (అలయన్స్ '90 / ది గ్రీన్స్)
  • మైఖేల్ మీర్ట్ (జననం 1953), సినిమా రచయిత, దర్శకుడు
  • థామస్ డి మైజియర్ (జననం 1954), రాజకీయ నాయకుడు (CDU), మాజీ రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి
  • గెర్డ్ ఫాల్టింగ్స్ (జననం 1954), గణిత శాస్త్రజ్ఞుడు, ఫీల్డ్స్ మెడల్ విజేత
  • ఓలాఫ్ మాంథే (జననం 1955), మాజీ టూరింగ్ కార్ రేసింగ్ డ్రైవర్
  • మైఖేల్ కోహ్నెన్ (1955–1991), నియో-నాజీ
  • రోజర్ విల్లెంసెన్ (1955–2016), ప్రచారకర్త, రచయిత, వ్యాసకర్త, సమర్పకుడు
  • నార్మన్ రెంట్రాప్ (జననం 1957), ప్రచురణకర్త, రచయిత, పెట్టుబడిదారు
  • మార్కస్ మరియా ప్రాఫిట్లిచ్ (జననం 1960), హాస్యనటుడు, నటుడు
  • గైడో వెస్టర్వెల్లే (1961–2016), రాజకీయ నాయకుడు (FDP), విదేశాంగ మంత్రి, 2009 నుండి 2011 వరకు జర్మనీ వైస్ ఛాన్సలర్
  • మథియాస్ డోప్ఫ్నర్ (జననం 1963), ఆక్సెల్ స్ప్రింగర్ AG యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
  • నికోలస్ బ్లోమ్ (జననం 1963), జర్నలిస్ట్
  • మాగ్జిమ్ కొంట్సెవిచ్ (జననం 1964), గణిత శాస్త్రజ్ఞుడు, ఫీల్డ్స్ మెడల్ విజేత
  • జోహన్నెస్ బి. కెర్నర్ (జననం 1964), టీవీ వ్యాఖ్యాత, అలోయిసియస్‌కొల్లెగ్‌లో అబితుర్,, బాన్‌లో చదువుకున్నాడు
  • ఆంథోనీ బఫో (జననం 1965), ఫుట్‌బాల్ ప్లేయర్, స్పోర్ట్స్ ప్రెజెంటర్, నటుడు
  • Sonja Zietlow (జననం 1968), TV వ్యాఖ్యాత
  • బుర్ఖార్డ్ గార్వేగ్ (జననం 1968), రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ సభ్యుడు
  • సబ్రియే టెన్బెర్కెన్ (జననం 1970), టిబెటాలజిస్ట్, బ్రెయిలీ వితౌట్ బోర్డర్స్ వ్యవస్థాపకుడు
  • థోర్స్టన్ లిబోట్ (జననం 1972), రచయిత
  • తమరా గ్రాఫిన్ వాన్ నైహౌస్ (జననం 1972), టెలివిజన్ వ్యాఖ్యాత
  • సిల్కే బోడెన్‌బెండర్ (జననం 1974), నటి
  • జూలీ జెహ్ (జననం 1974), రచయిత
  • ఆలివర్ మింట్జ్లాఫ్ (జననం 1975), ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, స్పోర్ట్స్ మేనేజర్, RB లీప్‌జిగ్ CEO
  • మార్కస్ డిక్‌మాన్ (జననం 1976), బీచ్ వాలీబాల్ ఆటగాడు
  • బెర్నాడెట్ హీర్‌వాగన్ (జననం 1977), నటి
  • మెలానీ అమన్ (జననం 1978), జర్నలిస్ట్
  • బుషిడో (జననం 1978), సంగీతకారుడు, రాపర్
  • సెబాస్టియన్ స్టాల్ (జననం 1978), రేస్ కార్ డ్రైవర్
  • సోంజా ఫస్ (జననం 1978), ఫుట్‌బాల్ క్రీడాకారిణి
  • కాస్కాడాకు చెందిన DJ మానియన్ DJ (జననం 1978) జూలాండ్ రికార్డ్స్ యజమాని
  • ఆండ్రియాస్ టోల్జర్ (జననం 1980), జుడోకా
  • జెన్స్ హార్ట్‌విగ్ (జననం 1980), నటుడు
  • నటాలీ హార్లర్ (జననం 1981), డాన్స్ ప్రాజెక్ట్ కాస్కాడా యొక్క ముందు మహిళ
  • మార్సెల్ నడ్జెంగ్ (జననం 1982), ఫుట్‌బాల్ ఆటగాడు
  • మార్క్ జ్విబ్లెర్ (జననం 1984), బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
  • బెంజమిన్ బార్గ్ (జననం 1984), ఫుట్‌బాల్ ఆటగాడు
  • అలెగ్జాండ్రోస్ మార్గరీటిస్ (జననం 1984), రేస్ కార్ డ్రైవర్
  • కెన్ మియావో (జననం 1986), పాప్ గాయకుడు
  • ఫెలిక్స్ రెడా (జననం 1986), రాజకీయ నాయకుడు
  • పీటర్ స్కోల్జ్ (జననం 1987), గణిత శాస్త్రజ్ఞుడు, ఫీల్డ్స్ మెడల్ విజేత
  • Célia Okoyino da Mbabi (జననం 1988), ఫుట్‌బాల్ క్రీడాకారిణి
  • ల్యూక్ మోక్రిడ్జ్ (జననం 1989), హాస్యనటుడు, రచయిత
  • పియస్ హీంజ్ (జననం 1989), పోకర్ ప్లేయర్, 2011 WSOP ప్రధాన ఈవెంట్ ఛాంపియన్
  • జోనాస్ వోల్‌ఫార్త్-బోటర్‌మాన్ (జననం 1990), బాస్కెట్‌బాల్ ఆటగాడు
  • లెవినా (జననం 1991), గాయని
  • బైన్‌వెన్యూ బసాలా-మజానా (జననం 1992), ఫుట్‌బాల్ ఆటగాడు
  • కిమ్ పెట్రాస్ (జననం 1992), పాప్ గాయకుడు, పాటల రచయిత
  • అన్నీకా బెక్ (జననం 1994), టెన్నిస్ క్రీడాకారిణి
  • జేమ్స్ హైండ్‌మాన్ (జననం 1962), రంగస్థల నటుడు
  • కాన్స్టాంజ్ క్లోస్టర్హాల్ఫెన్ (జననం 1997), ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్

21 వ శతాబ్దం

[మార్చు]
  • అన్నీ ఓగ్రెజియాను (జననం 2001), గాయని, ది వాయిస్ ఆఫ్ జర్మనీ విజేత 2022

మూలాలు

[మార్చు]
  1. tagesschau.de. "Bonn-Berlin-Gesetz: Dieselbe Prozedur wie jedes Jahr". tagesschau.de (in జర్మన్). Retrieved 26 April 2019.
  2. 2.0 2.1 Cowell, Alan (23 June 2011). "In Germany's Capitals, Cold War Memories and Imperial Ghosts". The New York Times. Archived from the original on 2022-01-01.
  3. Bundestag, Deutscher. "Deutscher Bundestag: Berlin-Debatte / Antrag Vollendung der Einheit Deutschlands, Drucksache 12/815". webarchiv.bundestag.de (in జర్మన్). Retrieved 19 February 2017.
  4. "Average Temperature, weather by month, Bonn weather averages". Climate-Data.org. Retrieved 7 February 2019.
  5. Stanton, Shelby L. (2006). World War II Order of Battle: An Encyclopedic Reference to U.S. Army Ground Forces from Battalion through Division, 1939–1946 (Revised ed.). Stackpole Books. p. 76. ISBN 9780811701570.
  6. Caborn, Joannah (2006). Schleichende Wende. Diskurse von Nation und Erinnerung bei der Konstituierung der Berliner Republik (in జర్మన్). Unrast Verlag (de). p. 12. ISBN 9783897717398 – via Google Books.
  7. Barbara Marshall (18 December 1996). Willy Brandt: a Political Biography. Springer. p. 149. ISBN 9780230390096.
  8. "Bonn to Berlin move still controversial". The Local (in ఇంగ్లీష్). 15 June 2011. Retrieved 1 December 2020.
  9. Sebastian Lentz (17 June 2011). "Nationalatlas aktuell". Hauptstadtbeschluss. Archived from the original on 31 March 2013. Retrieved 20 September 2012.
  10. Thompson, Wayne C. (2008). The World Today Series: Nordic, Central and Southeastern Europe 2008. Harpers Ferry, West Virginia: Stryker-Post Publications. ISBN 978-1-887985-95-6.
  11. "Deutsche Telekom facts and figures". T-Mobile. Archived from the original on July 16, 2011. Retrieved 8 November 2009.
  12. "Presentation of the University of Bonn". Archived from the original on 13 June 2013. Retrieved 2 July 2021.
  13. SER Locations
  14. "IHK Bonn/Rhein-Sieg: Bonn wächst weiter". 29 November 2012. Archived from the original on 9 October 2016. Retrieved 20 March 2013.
  15. "Eckzahlen der aktuellen Bevölkerungsstatistik (Stichtag 31.12.2021)" (PDF). www2.bonn.de. Statistikstelle der Bundesstadt Bonn. Archived (PDF) from the original on 2022-10-09. Retrieved 23 May 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=బాన్&oldid=4304854" నుండి వెలికితీశారు