Jump to content

బస్తర్ ఢోక్రా

వికీపీడియా నుండి

ఢోక్రా అనేది ఫెర్రస్ కాని లోహ వస్తువు. దీనిని వాడేసిన మైనాన్ని తిరిగి ఇంకో ఆకారంలో ఎలా తయారు చేస్తామో అటువంటి పద్ధతిని ఉపయోగించి చేస్తారు. ఈ రకమైన లోహ వస్తువులను భారతదేశంలో 4,000 ఏళ్ళ నుండి వాడుతున్నారు. ఈ లోహంతో తయారు చేసిన మొహంజదారో కాలం నాటి నృత్యం చేస్తున్న బొమ్మ ఇప్పటికి అతి ప్రాచీనమైనదిగా పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా.[1] ఈ ఢోక్రా బొమ్మలకు స్థానికంగానూ, విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. ఈ బొమ్మలు జానపద విశేషాలను తెలియజేస్తుండటం, చూసేందుకు సాధారణంగా, అందంగా ఉండటంతో ప్రజల్లో వీటికి ఆదరణ ఎక్కువ. ఈ ఢోక్రా బొమ్మల రకాల్లో గుర్రాలు, ఏనుగులు, నెమళ్ళు, గుడ్లగూబలు, దేవుని బొమ్మలు, కొలత పాత్రలు, దీపపు స్తంభాల బొమ్మలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.[2] 

తయారీ

[మార్చు]
ఆహార వస్తువులను దంచుతున్న మహిళ
తన అయిదుగురు పిల్లలతో ఓ తల్లి

మైనం పోత తయారీ పద్ధతిలో రెండు రకాలున్నాయి. ఒకటి ఘన పద్ధతి, రెండోది డొల్ల పద్ధతి. దక్షిణ భారతదేశంలో ఘన పద్ధతి ప్రాచుర్యం చెందగా, మధ్య, తూర్పు భారతదేశంలో మాత్రం డొల్ల పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఘన పద్ధతిలో మట్టి బదులు మైనన్ని ఉపయోగించి అచ్చును తయారు చేస్తారు. అయితే డొల్ల పద్ధతిలో సంప్రదాయంగా మట్టినే వాడుతూ వస్తున్నారు.[1]

డొల్ల మైనపు పోత పద్ధతిలో మొదటు అసలు అచ్చు ఎలా ఉంటుందో అలా మట్టి ముద్దను తయారు చేస్తారు. దమరా ఓరియెంటలిస్ అనే చెట్టు నుంచి వచ్చే జిగురు, తేనేతుట్ట నుంచి వచ్చిన మైనం, గింజల నూనెతో తయారు చేసిన మైనాన్ని మట్టి అచ్చుపై పోత పోస్తారు. వెంటనే ఆ మైనం మనం అనుకున్న బొమ్మ ఆకారంలోకి మారుతుంది. ఈ అచ్చుపై మట్టిని పొరలు పొరలుగా అద్దుతారు. ఈ డొల్ల అచ్చులోకి ఆ తరువాత మనకు కావాల్సిన లోహాన్ని కరగదీసి పోస్తే లోహపు బొమ్మ తయారవుతుంది. బస్తర్ ఢోక్రా బొమ్మల తయారీలో ఎక్కువగా ఇత్తడితో తయారు చేస్తారు. ఈ అచ్చులోకి పోసే వేడి లోహ ద్రవాన్ని పోస్తారు. పైన ఉన్న మట్టి పొరలను తీసేసి అసలు లోహపు బొమ్మకు మెరుగు పెట్టి, నగిషీలు చెక్కుతారు. అలా తయారు చేసే ఈ బస్తర్ ఢోక్రా బొమ్మలు చాలా ప్రసిద్ధం.[1][3]

పేరుకు నేపధ్యం

[మార్చు]

పశ్చిమ బెంగాల్ లోని సంప్రదాయ  లోహ తయారీదారులైన  ఢోక్రా దమర్ అనే తెగ పేరుపై వచ్చినదే ఢోక్రా. ఈ తెగలు ఝార్ఖండ్ నుంచి, పశ్చిమ బెంగాల్, ఒరిస్సాఛత్తీస్ గఢ్ వరకు ఉన్నారు. కొన్ని వందల  సంవత్సరాల క్రితం కొందరు ఢోక్రాలు మధ్య, తూర్పు భారతదేశాల  నుంచీ  దక్షిణానికి, అటు ఉత్తరానికి వలస వెళ్ళారు. అందుకే వారి ఉనికి  మనకు కేరళలో, అటు రాజస్థాన్లో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం  ఈ తెగ వారు మొత్తం భారతదేశంలో  కనిపిస్తున్నారు. పశ్చిమ  బెంగాల్ లోని శాంతినికేతన్ ప్రాంతంలో తయారు చేసే బస్తర్ ఢోక్రా బొమ్మలు చాలా ప్రసిద్ధి చెందినవి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Della Cava, Chiara. "Metal Working in India - Lost Wax Casting". Museum of Anthropology, University of Missouri-Columbia. Archived from the original on 2007-09-10. Retrieved 2009-02-08.
  2. "Dokra". Archived from the original on 2009-01-30. Retrieved 2009-02-08.
  3. "Dhokra craft". india9.com. Archived from the original on 2009-10-27. Retrieved 2009-03-12.