బల్లకట్టు
స్వరూపం
బల్లకట్టు అనేది బల్లలని కాని, చెక్కలని కాని, ఒకదానితో మరొకదానిని తాడుతో కట్టి నీటిలో తేలియాడే విధంగా తయారు చేసిన బల్లపరుపుగా ఉండే ఉపకరణం. పురాతన కాలం నుండి ఇప్పటివరకూ వాడుకలో ఉన్న ఉపకరణాలలో ఇది ఒకటి. దీనితో సమానార్ధాలు కల ఇంగ్లీషు మాటలు: raft, pontoon, flat-bottom boat.
దీని సాధారణ వాడుక కాలవలను చిన్న చిన్న ఏరులను దాటటం. పలుప్రాంతాలలో వంతెనలు లేని చోట్ల దీనినివాడుతుంటరు.
దీనిని పోలిన పురాతన కాలపు మరొక ఉపకరణం పేరు పుట్టి. పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద తేలేటట్లు చేస్తారు. దీనిని ముందుకి నడపటానికి ఈతగాళ్ళు ముందుకి తోసుకు వెళతారు. 'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.