Jump to content

బరాసత్

అక్షాంశ రేఖాంశాలు: 22°43′N 88°29′E / 22.72°N 88.48°E / 22.72; 88.48
వికీపీడియా నుండి
Barasat
City
Streets of Barasat
Streets of Barasat
Barasat is located in West Bengal
Barasat
Barasat
Location in West Bengal, India
Barasat is located in India
Barasat
Barasat
Barasat (India)
Coordinates: 22°43′N 88°29′E / 22.72°N 88.48°E / 22.72; 88.48
Country India
రాష్ట్రంWest Bengal
DistrictNorth 24 parganas
RegionGreater Kolkata
Government
 • TypeMunicipality
 • BodyBarasat Municipality[1]
 • ChairmanAsani Mukhopadhyay
 • MPKakali Ghosh Dastidar
 • MLAChiranjeet Chakraborty
విస్తీర్ణం
 • Total34.06 కి.మీ2 (13.15 చ. మై)
Elevation
11 మీ (36 అ.)
జనాభా
 (2011)
 • Total2,78,435
 • జనసాంద్రత8,200/కి.మీ2 (21,000/చ. మై.)
Languages
 • OfficialBengali, English
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
700124, 700125, 700126, 700127
Telephone code+91 (0) 33
Vehicle registrationWB-25, WB-26
Lok Sabha constituencyBarasat
Vidhan Sabha constituencyBarasat

బరాసత్, బెంగాల్ రాష్ట్రం, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఒక నగరం.ఇది పురపాలక సంఘం. ఇది బరాసత్ సదర్ ఉపవిభాగ ప్రధాన కార్యాలయం.ఇది కోల్‌కతా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని ప్రాంతంలో ఒక భాగం.గంగా డెల్టాలో ఉన్న బరాసత్ రైలు, రోడ్డు జంక్షన్‌ ప్రాంతీయ రవాణా కేంద్రంగా ఉంది. జాతీయ రహదారి 12 (గతంలో ఎన్ఎచ్ 34/ ఉత్తర బెంగాల్ వైపు కృష్ణానగర్ రోడ్), ఎన్ఎచ్ 112 (గతంలో ఎన్ఎచ్ 35/ జెస్సోర్ రోడ్, పెట్రాపోల్ వద్ద బంగ్లాదేశ్ సరిహద్దుకు దారి తీస్తుంది), టాకీ రోడ్, బరాక్‌పూర్-బరాసత్ రోడ్ (రెండూ రాష్ట్ర రహదారి 2 లో భాగం) నగరానికి ప్రధాన అనుసంధానమైన మార్గాలు.

భౌగోళికం

[మార్చు]

బరాసత్ తూర్పు భారతదేశంలోని గంగా డెల్టాలో ఉంది.బరాసత్ నగరం నుండి పెట్రాపోల్ వద్ద బంగ్లాదేశ్ సరిహద్దు 70 లేదా 80 కి.మీ.దూరంలో ఉంది.ఇది ముద్రమట్టానికి 11 మీటర్లు (36 అ.) సగటు ఎత్తులే ఉంది. సమీప నది గంగా నది, పశ్చిమాన దాదాపు 15 కిమీ దూరంలో గంగా మైదానంలో ఉంది.

ప్రాంతం అవలోకనం

[మార్చు]

ఈ ప్రాంతం ఎక్కువగా ఉత్తర బిద్యధారి మైదానంలో భాగం.దిగువ గంగా డెల్టాలో ఉంది.[2] ప్రాంతం చదునుగా ఉంది. ఇది వరద స్థాయి కంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఎత్తైన నేల నది కాలువలకు సరిహద్దుగా ఉంటుంది.[3] జనసాంద్రత కలిగిన ప్రాంతంలోని 54.67% మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో, 45.33% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[4]

చరిత్ర

[మార్చు]

మొఘల్ సామ్రాజ్య కాలంలో, శంకర్ చక్రవర్తి (జమీందార్ ప్రతాపాదిత్య కమాండర్, ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ రాజు) 1600లో కోల్‌కతాలోని బరాసత్‌కు వచ్చి తనను తాను స్థాపించుకున్నాడు.1700లో హజారత్ ఎక్దిల్ షా పట్టణానికి వచ్చి, సంఘ సంస్కర్తగా పేరు పొందాడు. కాజీపరాలోని అతని సమాధి ముస్లిం సమాజానికి ఒక తీర్థయాత్ర. ప్రతాపాదిత్య జెస్సోర్ నుండి కోల్‌కతాకు వెళ్ళాడు.రెండు జాతీయ రహదారులుగా మారిన రహదారిపై సిరాజుదుల్లా ముర్షిదాబాద్ నుంచి బరాసత్ మీదుగా కోల్‌కతా వెళ్లాడు.

బ్రిటీష్ రాజ్ కింద, కలకత్తా (కోల్‌కతా) నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు బరాసత్‌ను వారాంతపు ప్రయాణ విడిది స్థావరంగా మార్చారు.తోటలతో కూడిన గృహాలను నిర్మించారు.వారెన్ హేస్టింగ్స్ బరాసత్ నడిబొడ్డున తన విల్లాను నిర్మించాడు. బంకిం చంద్ర ఛటర్జీ పట్టణ మొదటి భారతీయ డిప్యూటీ మేజిస్ట్రేటుగా పనిచేసాడు.

నీలిమందు పెంపకం ఒక ప్రధాన పరిశ్రమ. నీలిమందు వ్యాపారులు రైతుల పట్ల అమానవీయ ప్రవర్తనకు ప్రసిద్ధి చెందారు. టిటుమీర్ అనే రైతు బరాసత్‌లో నీలిమందు వ్యాపారులకు వ్యతిరేకంగా విప్లవాన్ని ప్రేరేపించాడు.ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్,ప్యారీ చరణ్ సర్కార్, కాళీకృష్ణ మిత్రలు స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలతో సహా పట్టణంలో సామాజిక సంస్కరణకు ప్రసిద్ధి చెందారు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో, బరాసత్ క్యాడెట్ కళాశాల యూరోప్ నుండి కొత్త రిక్రూట్‌లు, క్యాడెట్‌లకు శిక్షణ ఇచ్చింది. కళాశాల ఇతర కారణాల వలన 1811లో మూసివేయబడింది [5][6]

1834 నుండి 1861 వరకు,బరాసత్ జిల్లా కేంద్రంగాఉంది.ఈ జిల్లా 1861లో ఇరవై నాలుగు పరగణాల జిల్లా ఉపవిభాగంగా మారింది.[5] బరాసత్ ఉత్తర 24 పరగణాల జిల్లాకు ప్రధాన కేంద్రం.[7]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బరాసత్ నగరం మొత్తం 278,435 మంది జనాభాతో ఉంది.అందులో 1,40,822 (51%) మంది పురుషులు కాగా, స్త్రీలు 1,37,613 (49%) మంది ఉన్నారు. నగర జనాభా మొత్తంలో ఆరేళ్లలోపు వారు 22,605 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభాలో 89.62 శాతం (2,29,279 మంది) ఉంది.[8][9] 2001లో నున్న పట్టణ జనాభా 2,31,521 నుండి 2011 నాటికి 278,435 మంది జనాభాకు పెరిగింది [10] 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం అక్షరాస్యత రేటు 76 శాతం, ఇది జాతీయ సగటు 54.5 శాతం కంటే ఎక్కువ.[11] అక్షరాస్యులైన జనాభాలో 52 శాతం మంది పురుషులు కాగా, 48 శాతం స్త్రీలు మంది స్త్రీలు ఉన్నారు.[9][12] బరాసత్ 2011 జనాభా లెక్కల ప్రకారం కోల్‌కతా పట్టణ సముదాయంలో ఒక భాగంగా ఉంది.[13] బరాసత్‌ నగర జనాభాలో 87% మంది హిందువులు, 12% మంది ముస్లింలు, 1% మంది ఇతర మతాలకు చెందినవారు (క్రైస్తవం, సిక్కు మతం, బౌద్ధం, జైనమతం మొదలైనవి.) [8]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

నూలు నేయడం బరాసత్ ప్రధాన పరిశ్రమ. బియ్యం, చిక్కుళ్ళు, చెరకు, బంగాళదుంపలు, కొబ్బరికాయలకు ముఖ్య వాణిజ్య కేంద్రం.[14] ఇప్పుడు ఇది అన్ని ప్రధాన బ్రాండ్లు, మల్టీప్లెక్స్‌లతో సహా వివిధ వాణిజ్య భవనాలతో వాణిజ్య, వ్యాపార లావాదేవీలకు గమ్యస్థానం మారింది.ప్రజలు ప్రతిరోజూ నగరం చుట్టుపక్కల నుండి బరాసత్‌కు ప్రయాణిస్తారు.పట్టణంలోని సీల్దా-బంగావ్ విభాగంలోని 24 స్టేషన్‌ల నుండి యాభై ఎనిమిది రైళ్లు,సీదా-హస్నాబాద్ సెక్షన్‌లోని 30 స్టేషన్‌ల నుండి 32 రైళ్లు ప్రయాణికులను చేరవేస్తాయి.[15]

పరిపాలన

[మార్చు]

బరాసత్ పురపాలక సంఘం 1869ఏప్రిల్ 1 న స్థాపించినప్పటికీ, దీనికి 1882 వరకు స్వతంత్ర ఉనికి లేదు. ఇది ఛైర్మన్ లేకుండా మేజిస్ట్రేట్ కార్యాలయం (దాని మేజిస్ట్రేట్)చే నియంత్రించబడింది.1882లో బరాసత్ పురపాలక సంఘం ఏర్పడి స్థానిక ప్రభుత్వం ఏర్పడింది. బరాసత్ అసోసియేషన్, పౌర సంస్థ, పురపాలక సంఘ భవనాల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చింది.

బరాసత్ 29 వార్టులుగా విభజించబడింది. మొదట్లో నాలుగు వార్డులు ఉండగా, తర్వాత 18కి పెరిగింది. 1995లో చుట్టుపక్కల పంచాయతీలు విలీనం అయిన తర్వాత వార్డుల సంఖ్య 32కి పెరిగింది. 2015లో పురపాలక సంఘ ఎన్నికలకు ముందు వార్డుల సంఖ్య 35కి పెరిగింది [16] బరాసత్ కోల్‌కతా మెట్రోపాలిటన్ ఏరియాలో ఒక భాగం, దీనిపై కెఎండిఎ ప్రణాళిక, అభివృద్ధిపై చట్టబద్ధమైన అధికారం కలిగి ఉంది [17] కెఎండిఎ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్వహిస్తుంది.[18]

జిల్లా కోర్టు స్థానిక, జాతీయ కేసులను నిర్వహిస్తుంది. బరాసత్ పోలీసుల అధికార పరిధి 4.6 చదరపు కిలోమీటర్లు (1.8 చ. మై.) కలిగిఉంది. బరాసత్ పురపాలక సంఘ ప్రాంతంలో 4,17,663 మంది జనాభాకు సేవలు అందిస్తోంది.పట్టణంలో రెండు పోలీసు అవుట్‌పోస్టులు (బరాసత్, బడులో), ఒక మహిళా రక్షకభట నిలయం (కెఎన్‌సి రోడ్‌లో, బరాసత్ ప్రభుత్వ కళాశాల సమీపంలో) ఉన్నాయి.[19]

ప్రముఖ నివాసితులు

[మార్చు]

బంకిం చంద్ర చటోపాధ్యాయ 19వ శతాబ్దంలో 24 పరగణాలకు డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా పనిచేసాడు.

మూలాలు

[మార్చు]
  1. "Barasat Municipality". Archived from the original on 12 May 2020. Retrieved 14 August 2019.
  2. "District Census Handbook North Twenty Four Parganas, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Page 13. Directorate of Census Operations, West Bengal. Retrieved 16 April 2018.
  3. LSS O’Malley (2009). Bengal District Gazetteers: 24 Parganas. ISBN 9788172681937. Retrieved 3 May 2018. {{cite book}}: |work= ignored (help)
  4. "District Statistical Handbook". North 24 Parganas 2013, Tables 2.1, 2.2, 2.4b. Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 2019-01-21. Retrieved 2 May 2018.
  5. 5.0 5.1 Hunter, William Wilson (1885). The Imperial Gazetteer of India. Trübner & co. p. 123.
  6. Wheeler, Mortimer (1935). The Cambridge History of India. Cambridge University Press (CUP). p. 161.
  7. "Barasat" (PDF). jnnurmwestbengal.gov.in. Archived from the original (PDF) on 2 April 2012. Retrieved 5 September 2011.
  8. 8.0 8.1 "2011 Census – Primary Census Abstract Data Tables". West Bengal – District-wise. Registrar General and Census Commissioner, India. Retrieved 29 May 2018.
  9. 9.0 9.1 "Basic Population Figures of India, States, Districts, Sub-District and Town (Without Ward), 2011" (XLSX). Census of India 2011. Retrieved 8 December 2022.
  10. "A-4: Towns and urban agglomerations classified by population size class in 2001 With Variation since 1901 - Class I" (XLS). Census Commission of India. p. 9. Retrieved 8 December 2022.
  11. "C-13 Appendix: Single year age returns by residence, sex and literacy status" (XLS). Census Commission of India. Retrieved 8 December 2022.
  12. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  13. "Provisional Population Totals, Census of India 2011" (PDF). Constituents of Urban Agglomeration Having Population Above 1 Lakh. Census of India 2011. Retrieved 30 May 2018.
  14. "Barasat | India". Encyclopædia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2017-11-23.
  15. Dey, Teesta. "The Suburban Railway Network of Kolkata: A Geographical Apprisal" (PDF). eTraverse, the Indian journal of spatial science, 2012. Archived from the original (PDF) on 18 November 2017. Retrieved 3 June 2018.
  16. "Barasat" (PDF). jnnurmwestbengal.gov.in. Archived from the original (PDF) on 2 April 2012. Retrieved 5 September 2011.
  17. "Kolkata Metropolitan Development Authoity, Annual Report 2010-11". 1/1 Kolkata Metropolitan Area Map. KMDA. Archived from the original on 1 May 2019. Retrieved 4 June 2018.
  18. "Kolkata Metropolitan Development Authority, Annual Report 2010-11". 1 / 2 Role of KMDA. KMDA. Archived from the original on 1 May 2019. Retrieved 4 June 2018.
  19. "North 24 Parganas Dist. Police". Know Your Police Station. District Police. Archived from the original on 7 జూన్ 2018. Retrieved 4 June 2018.

వెలుపలి లంకెలు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=బరాసత్&oldid=4222616" నుండి వెలికితీశారు