బన్న అయిలయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బన్న అయిలయ్య ప్రముఖ సాహితీవేత్త.

బన్న అయిలయ్య
జననంIndia నర్సంపేట
నివాస ప్రాంతంహనుమకొండ, తెలంగాణ
వృత్తిప్రొఫెసర్, సాహితీవేత్త

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

నర్సంపేటలో పేద కుటుంబంలో జన్మించిన అయిలయ్య కూలీపనులకు వెళ్తూ, దుకాణాల్లో పనిచేస్తూనే నర్సంపేటలో ఇంటర్‌ డిగ్రీ, చదువుకొని ఉన్నత విద్యావంతుడయ్యాడు.

ఉద్యోగ జీవితం

[మార్చు]

విద్యార్థి ఉద్యమాలతో మమేకమై విప్లవ రాజకీయాల వైపు మళ్లాడు. ఒక మహావృక్షం తాను మొలకెత్తిన ప్రాంగణానికే నీడనిచ్చినట్టు అయిలయ్య తాను పరిశోధన చేసిన కాకతీయ విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకుడై ఎంతో మంది విద్యార్థులకు భాషాసాహిత్యాలను బోధించారు. ఉత్తమోత్తమ గురువులకు శిష్యుడై, సత్‌ శిష్యకోటికి గురువయ్యాడు.

మూడున్నర దశాబ్దాల పాటు భాషా సాహిత్యాల బోధనలో, పరిశోధనలో నిబద్ధతతో నిమగ్నమయ్యాడు. పరిశోధక విద్యార్థులను ప్రాణమిత్రులుగా భావించి ఆదరించాడు. విశ్వవిద్యాలయ ఆచార్యులకు కొంగుబంగారంగా, అధికారులకు తలలో నాలుకలా విలసిల్లారు. చాలావరకు సంప్రదాయ సాహిత్య పరిశోధనలకు, ఆ విలువలకు ఆలవాలమైన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య కాత్యాయిని విద్మహే ఆధునిక దృష్టిని కలిగించినట్టుగా, అస్తిత్వ ఉద్యమాల సాహిత్య పరిశోధనలకు, తదనుగుణమైన పాఠ్య ప్రణాళికకు అయిలయ్య పెద్దపీట వేశాడు. దళిత, బహుజన, తెలంగాణ ఉద్యమ దృక్పథంతో సాహిత్యాన్ని మూల్యాంకనం చేసే తాజా పరిశోధనా పద్ధతులను విద్యార్థులకు బోధించాడు.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

ప్రజాస్వామ్య బద్ధమైన ఉద్యమాల జాడలో సామాజిక, సాహిత్య కార్యకర్తగా తనవంతు పాత్రను పోషించాడు. ఉత్తమ గురువుగానే కాకుండా ప్రభావశీలమైన కవిగా ఆయన విమర్శకుల మెప్పు పొందాడు.

80వ దశకంలో పెరిగిన నిర్బంధాలను, క్రూరమైన రాజ్య హింసను ధిక్కరించి, ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని శక్తివంతంగా కవిత్వీకరించాడు. ‘ పేర్వారం జగన్నాథం అన్నట్లుగా అయిలయ్య కవిత్వంలో చిత్తశుద్ధితో కూడిన అంతర్మథనం కనిపిస్తుంది. అనతికాలంలోనే ఇలాంటి అధివాస్తవిక ధోరణి నుంచి బయటపడి, దళిత ఆత్మగౌరవ పోరాటపథంలో అయిలయ్య అచ్చమైన దళిత కవిగా రూపాంతరం చెందాడు.


అయిలయ్య రాసిన దీర్ఘ కవిత ‘నిప్పుకణిక’ 1998 లో ప్రచురించబడింది. ‘నిప్పు కణిక’ దళిత దీర్ఘకవితతో వర్తమాన సాహిత్యంలో రవ్వలు రాల్చారు అయిలయ్య. ‘ కవిగా మంచి గుర్తింపు వస్తున్న తరుణంలో అయిలయ్య విమర్శ, పరిశోధన వైపు దృష్టి సారించారు. అనునిత్యం అధ్యయనం, అధ్యాపనాల్లో మునిగిపోవడం వల్ల, వృత్తిగతమైన, విద్యావిషయకమైన అవసరాలకు అనుగుణంగా చాలామంది ఆచార్యుల్లాగే అయిలయ్య కూడా సాహిత్య విమర్శ దిశగా సాగిపోయారు. ‘తెలుగు కవిత అభినవ దృక్పథం’, ‘సవ్వడి’, ‘సాహితీ కిరణాలు’, ‘సాహితీ వాహినీ’ వంటి వైవిధ్యమైన వ్యాస సంకలనాలతో విమర్శకునిగా అయిలయ్య సమకాలినుల మన్ననలు అందుకున్నారు. అనంతరం ‘తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యం’, ‘తెలంగాణ సాహిత్య సంస్థలు’, తెలంగాణ పీఠికలు, ‘తెలంగాణ కథ -పరామర్శ’ లాంటి విమర్శ గ్రంథాలను ఆయన వెలువరించారు.

అయిలయ్య వందకిపైగా పరిశోధనా వ్యాసాలకు సారథ్యం వహించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దారు. పరిశోధకునిగా మాత్రమే కాకుండా సంపాదకుడిగా కూడా అయిలయ్య కృషి చేశారు. విమర్శిని పరిశోధనా పత్రిక, తెలంగాణ కాలరేఖలు మూల్యాంకనం, సత్కృతి, వల్లంపట్ల సేవాదర్శిని, తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల ప్రచురణలకు సంపాదకత్వం వహించారు

పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు తెలంగాణ సోయితో తెలుగు పాఠ్యగ్రంథాలను రూపొందించడంలో ఆయా పుస్తకాలకు సంపాదకుడిగా అయిలయ్య అత్యంత కీలకపాత్ర పోషించాడు. . తెలంగాణలో ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ తెలుగు వాచకాలకు సంపాదత్వం వహించారు. ఇంటర్ ఫస్టియర్ తెలుగు పుస్తకానికి కూడా ఆయన సంపాదకత్వం వహించారు. 

నిర్వహించిన పదవీ బాధ్యతలు

[మార్చు]

వరంగల్ కాకతీయ యూనివర్శిటీ ఆర్ట్సు కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అయిలయ్య తెలుగు శాఖ అధిపతిగానూ వ్యవహరించారు.

పొందిన పురస్కారాలు

[మార్చు]

18 వరకూ పురస్కారాలను పొందారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]