Jump to content

బనిహాల్ కనుమ

అక్షాంశ రేఖాంశాలు: 33°31′N 75°16′E / 33.517°N 75.267°E / 33.517; 75.267
వికీపీడియా నుండి
బనిహాల్ కనుమ
బనిహాల్ కనుమ, (ఫొటో: షోయిబ్ తంత్రాయ్)
సముద్ర మట్టం
నుండి ఎత్తు
2,832 m (9,291 ft)
ప్రదేశంభారతదేశం
శ్రేణిపీర్ పంజాల్ శ్రేణి, హిమాలయాలు
Coordinates33°31′N 75°16′E / 33.517°N 75.267°E / 33.517; 75.267

బనిహాల్ కనుమ భారతదేశం లోని పీర్ పంజాల్ శ్రేణిలో సముద్రమట్టం నుండి గరిష్టంగా 2,832 మీ. (9,291 అ.) ఎత్తున ఉన్న పర్వత కనుమ. ఇది జమ్మూ కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయను బయటి హిమాలయాలకు, దక్షిణాన ఉన్న మైదాన ప్రాంతాలకూ కలుపుతుంది. కాశ్మీరీ భాషలో, "బనిహాల్" అంటే మంచు తుఫాను.[1]

జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్లే రహదారి 1956 లో జవహర్ సొరంగాన్ని నిర్మించే వరకు బనిహాల్ కనుమ గుండా వెళ్ళేది. ఈ రహదారి ఇప్పుడు సొరంగం గుండా వెళుతుంది. ప్రస్తుతం బనిహాల్ కనుమ గుండా రోడ్డు రవాణా జరగదు.

బనిహాల్ కనుమ తరువాత అక్కడి ప్రకృతిలో, పర్వతాలలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తుంది. కాశ్మీర్ లోని సహజ పరిసరాలు బనిహాల్, ఝీలం లోయ లోని రోడ్ల ద్వారా కనిపిస్తాయి.

జబాన్ హిమానీనదం బనిహాల్ కనుమ సమీపంలోని సాంగ్లాబ్ లోయలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఈ హిమానీనదం ఖైర్‌కూట్ గ్రామానికి పశ్చిమాన ఉంది. ఈ హిమానీనదం సుండూర్ టాప్ (సముద్ర మట్టానికి 3,660 మీ) ఒడిలో దాదాపు 2 కి.మీ పొడవున ఉంది. జబాన్ గ్లేసియర్ చీనాబ్ నదికి ప్రధాన ఉపనది అయిన బచ్లిరి నల్లాకు జన్మస్థానం కూడా. స్థానిక పర్యాటకులు ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య వరకు ఈ హిమానీనదాన్ని సందర్శిస్తారు. ఈ హిమానీనదం నౌగామ్ నుండి రోడ్డు మార్గంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి అనుసంధానించబడి ఉంది. ఇది నౌగామ్ నుండి దాదాపు 3 కి.మీ, సాంగ్లాబ్ కాలనీ నుండి 2 కి.మీ. ఉంటుంది.

మూలాలు

[మార్చు]
  1. Encyclopædia Britannica Online. "Banihāl Pass". Archived from the original on 4 June 2009. Retrieved 2009-06-17.