బచ్చుల అర్జునుడు
బచ్చుల అర్జునుడు | |||
శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
| |||
పదవీ కాలం 2017 మార్చి 30 – 2023 మార్చి 29 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మచిలీపట్టణం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1957 జూలై 4 ||
మరణం | 2023 మార్చి 2 విజయవాడ | (వయసు 65)||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | సుబ్బయ్య, అచ్చమ్మ | ||
జీవిత భాగస్వామి | శివపార్వతి | ||
నివాసం | కృష్ణా జిల్లా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
బచ్చుల అర్జునుడు (1957 జూలై 04 - 2023 మార్చి 02) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2017లో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]బచ్చుల అర్జునుడు 1957 జూలై 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, మచిలీపట్టణంలో సుబ్బయ్య, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బి.ఏ వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బచ్చుల అర్జునుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పి.ఏ.సి.ఎస్) అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. బచ్చుల అర్జునుడు 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడై, 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2020లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]
మరణం
[మార్చు]2023 జనవరి 28న గుండెపోటుకు గురయిన 65 యేళ్ల బచ్చుల అర్జునుడు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 2023 మార్చి 2న తుదిశ్వాస విడిచాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ TeluguOne News (10 March 2017). "ఏకగ్రీవంగా ఏడుగురు ఎమ్మెల్సీల నియామకం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ Sakshi (20 October 2020). "క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గా బచ్చుల అర్జునుడు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ "తెదేపా MLC బచ్చుల అర్జునుడు కన్నుమూత". web.archive.org. 2023-03-02. Archived from the original on 2023-03-02. Retrieved 2023-03-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Sakshi (3 March 2023). "ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.