బందిపోటు భీమన్న
బందిపోటు భీమన్న (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
---|---|
తారాగణం | ఎస్వీ. రంగారావు , కృష్ణ, విజయనిర్మల, అంజలీదేవి, రాజబాబు, చంద్రమోహన్ |
నిర్మాణ సంస్థ | భాస్కర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బందిపోటు భీమన్న 1969 డిసెంబరు 25న విడుదలైన తెలుగు సినిమా. జెమిని గణేశన్, వెన్నిరాడై నిర్మల జంటగా నటించిన తమిళ చిత్రం చక్రం ఈ సినిమాకు మాతృక.
సాంకేతికవర్గం
[మార్చు]- సంభాషణలు: మహారథి
- సంగీతం: టి.వి.రాజు
- ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప
- కూర్పు: పి శ్రీనివాసరావు
- కళ: కుదరవల్లి నాగేశ్వరరావు
- నృత్యం: సుందరం
- పోరాటాలు: ఆర్ రాఘవులు
- దర్శకత్వం: ఎం మల్లిఖార్జునరావు
- నిర్మాత: దోనేపూడి బ్రహ్మయ్య
నటీనటులు
[మార్చు]- కృష్ణ - మోహన్
- విజయనిర్మల - లీల
- ఎస్.వి.రంగారావు - భీమన్న
- అంజలీదేవి - అన్నపూర్ణాదేవి
- చంద్రమోహన్ - రాజా
- మంజుల - లత
- రాజబాబు
- వల్లూరి బాలకృష్ణ
- జగ్గారావు
- నెల్లూరు కాంతారావు
- కె.వి.చలం
- మల్లిక
- జ్యోతిలక్ష్మి
- మీనాకుమారి
- రావి కొండలరావు - ఇన్స్పెక్టర్
- నాగయ్య
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- బొడ్డపాటి
కథ
[మార్చు]బందిపోటు భీమన్న (ఎస్‌వి రంగారావు) పేరుమోసిన గజదొంగ. అతని పేరుచెబితే చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు భయంతో వణికిపోతుంటారు. అతనిని పట్టిచ్చిన వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తుంది. జమీందారిణి అన్నపూర్ణా దేవి (అంజలీదేవి) వద్ద మేనేజర్ మోహన్ (కృష్ణ). ఆమె కుమారుడు రాజా (చంద్రమోహన్) కాలేజీలో చదువుతుంటాడు. పేరుకి జమీందారిణి అయినా, ఆస్తిపాస్తుల కంటె అప్పులు ఎక్కువవుతాయి. దీంతో రాజాకు డబ్బుగల సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటుంది అన్నపూర్ణా దేవి. దాంతో రాజా తన ప్రేమ విషయాన్ని బయటపెడతాడు. కాలేజీ సహాధ్యాయని లత (మంజుల)ను ప్రేమించానని చెబుతాడు. లతతో పెళ్లి జరగాలంటే 50 వేలు కట్నం కావాలని నిర్ణయించుకుని, మోహన్‌కు ఆ విషయాన్ని చెబుతుంది. లత, మోహన్‌కు చెల్లెలు. దాంతో చెల్లి పెళ్లికి కావాల్సిన ధనంకోసం గజదొంగ, బందిపోటు అయిన భీమన్నను పట్టుకోవాలని బయలుదేరతాడు మోహన్. అతనికి సాయంగా ప్రేయసి లీల (విజయనిర్మల), మిత్రుడు రాజ్‌బాబు మరికొందరు వెంటవెళ్తారు. చివరికి తన శక్తియుక్తులు, మంచితనంతో భీమన్న బంధించి తీసుకొస్తాడు. ఇంటికొచ్చిన భీమన్నను చూసి అన్నపూర్ణాదేవి, తన భర్తగా గుర్తిస్తుంది. అతడు పోలీసులకు బందీ అవ్వాలని తెలిసి, అన్నపూర్ణాదేవి విషంతాగి మరణిస్తుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక, పిస్టల్‌తో తనను తాను కాల్చుకొని భీమన్నా ప్రాణాలు విడుస్తాడు. రాజా-లత, మోహన్-లీల జంటలుగా స్థిరపడటంతో సినిమా ముగుస్తుంది[1].
పాటలు
[మార్చు]- అబ్బో అబ్బో అబ్బో ఏదో ఏదో గిరాకున్నది బావా బావా - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: కొసరాజు
- కసిరే వయసు ముసిరే సొగసు ఉందిరోయి మావా చిందేసి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సినారె
- డబ్బు డబ్బు మాయదారి డబ్బు చేతులు మారే డబ్బు - ఘంటసాల - రచన: సినారె
- తడితడి చీర తళుక్‌మంది చలిచలి వేళ చమక్‌మంది - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
- నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా - ఎస్.పి. బాలు, సుశీల - రచన: సినారె
మూలాలు
[మార్చు]- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (14 December 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 బందిపోటు భీమన్న". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 14 June 2020.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)