Jump to content

బండ్లమ్మ తల్లి దేవాలయం (చందోలు)

వికీపీడియా నుండి

బండ్లమ్మ తల్లి దేవాలయం బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ఉంది. ఈ ఆలయం లోని అమ్మవారిని బగళాముఖి అని కూడా పిలుస్తారు.

ఆలయ చరిత్ర

[మార్చు]
బాపట్ల జిల్లా, చందోలు లోని బండ్లమ్మ తల్లి (బగళాముఖి) దేవాలయం

ఈ దేవాలయం పురాతనమైనది. చందోలు గ్రామంలో ఉన్న మరో పురాతన ఆలయం చెన్నకేశవస్వామి దేవాలయం ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకేసారి జరిగినట్లుగా తెలుస్తోంది.చెన్నకేశవ స్వామిని మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణాలకు రాళ్ళను తెస్తున్న రెండెడ్ల బండ్లు సరిగ్గా నేడు బండ్లమ్మ ఆలయం వున్న చోటకి వచ్చేసరికి ఆగిపోయాయి. ఎంత తోలినా ఎడ్లు అక్కడ ముందుకి కదలలేదు. దానితో అనుమానం వచ్చి గ్రామస్తులంతా అక్కడ త్రవ్వకాలు ప్రారంభించారు. త్రవ్వకాలలో అమ్మవారి విగ్రహం దొరికింది. బండికొక రాయిని దించి ఆ రాళ్లతో ఈ గుడిని నిర్మించరని ఆయయ ప్రాంగణం లోని పటంలో రాసారు. అక్కడికి వచ్చిన బండ్లను కదలనివ్వకుండా చేసినందు వల్లనే బండ్లమ్మ అని అమ్మవారికి పేరు వచ్చింది.[1]

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.