Jump to content

బంగారు చెల్లెలు

వికీపీడియా నుండి
బంగారు చెల్లెలు
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
శ్రీదేవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. అన్నాచెల్లెళ్ళ మధ్య అనుబంధం చిత్రంలోని ప్రధాన అంశం. శోభన్ బాబు శ్రీదేవి అన్నాచెల్లెళ్ళగా నటించారు. జయసుధ శోభన్ బాబుకు జంటగా నటించింది.విప్లవ చిత్ర నటుడు మాదాల రంగారావు ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. నీహార్ రంజన్ గుప్తా వ్రాసిన ఒక బెంగాలీ నవల దీనికి మాతృక.

నటీనటులు

[మార్చు]
  • శోభన్ బాబు
  • జయసుధ
  • మురళీమోహన్
  • శ్రీదేవి
  • జయమాలిని
  • అల్లు రామలింగయ్య
  • మాదాల రంగారావు
  • మాడా వెంకటేశ్వరరావు
  • సారథి
  • కె.వి.చలం
  • పొట్టి ప్రసాద్
  • ప్రభాకరరెడ్డి
  • కాంతారావు
  • రాజనాల
  • ధూళిపాళ
  • గిరిజ
  • ఫటాఫట్ జయలక్ష్మి
  • హరిబాబు
  • బిందుమాధవి
  • అత్తిలి పాప
  • జగ్గారావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత: టి.త్రివిక్రమరావు
  • దర్శకత్వం: బోయిన సుబ్బారావు
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
  • ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.స్వామి
  • కూర్పు:జి.జి.కృష్ణారావు
  • కళ:తోట హేమచందర్
  • నృత్యం:హీరాలాల్

డాక్టర్ రమేష్ తన చిట్టిచెల్లెలు లక్ష్మి పువ్వుల్లోపెట్టి పెంచుకుంటుంటాడు. తాగుబోతు మోహన్ తన ముద్దుల చెల్లాయిని మానభంగం చేయడం చూసిన రమేష్ అతడ్ని పిస్టల్‌తో చంపివేస్తాడు. మతి చలించిన లక్ష్మిని తన స్నేహితుడు డాక్టర్ ఆనంద్‌కి అప్పగించి రమేష్ అడవులపాలవుతాడు. జానకి గొప్పింటి అమ్మాయి. డాక్టర్ రమేష్‌ను ప్రేమిస్తూ ఉంటుంది. అడవుల్లో తిరుగుతున్న రమేష్‌ను జానకి కలుస్తుంది. ఉరికంబానికి ఎక్కబోయే తనను మరచిపొమ్మని రమేష్ జానకిని ఒప్పించాలని ప్రయత్నించి విఫలమౌతాడు. తన మెడలో రమేష్ మూడుముళ్ళు వేస్తుంటే జానకి మురిసిపోతుంది. సరిగ్గా ఆ సమయానికి పోలీసులు రమేష్‌ను బంధించారు. తన చెల్లాయి లక్ష్మిని మోహన్ చెరిచిన విషయం తనతోనే సమసిపోవాలన్న ఉద్దేశంతో డబ్బుకోసం మోహన్‌ను చంపానని కోర్టులో రమేష్ ఒప్పుకునే సరికి జానకి నిలువునా నీరైపోతుంది. ఖూనీ ఎందుకు జరిగిందో లక్ష్మి కోర్టులో చెబితేనే తన మాంగల్యం నిలబడుతుందని జానకి డా.ఆనందు ముందు కన్నీరు కారుస్తుంది. పూర్వస్మృతి కోల్పోయిన లక్ష్మి మామూలు స్థితికి వచ్చి కోర్టులో నిజం చెబుతుందా? కోర్టు లక్ష్మి సాక్ష్యాన్ని నమ్ముతుందా? అనే విషయాలు పతాక సన్నివేశంలో తెలుస్తాయి.[1]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలకు కె.వి.మహదేవన్ స్వరకల్పన చేశాడు[1].

క్ర.సం పాట రచన గాయకులు
1 "ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః" (శ్లోకం) పి.సుశీల
2 "చలిజ్వరం చలిజ్వరం ఇది చెలిజ్వరం" వేటూరి పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 "పసుపు కుంకుమ తెస్తాడు నా బ్రతుకు పచ్చగ చేస్తాడు" ఆత్రేయ పి.సుశీల
4 "విరిసిన సిరిమల్లీ పెరిగే జాబిల్లి" ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 "అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం" ఆత్రేయ పి.సుశీల
6 "ముందూ వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు" వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
7 "లగ్గం పెడితే లగెత్తుకొచ్చా - సైరో జంబైరో" వేటూరి ఎల్.ఆర్.ఈశ్వరి

విశేషాలు

[మార్చు]

ఈ సినిమా మొదట కన్నడభాషలో లోకేష్, ఆరతి, అనంతనాగ్ మొదలైన వారితో దేవర కణ్ణు పేరుతో 1975లో తీయబడింది. 1977లో తమిళ భాషలో శివాజీ గణేశన్, సుజాత జంటగా అన్నన్ ఒరు కోయిల్ పేరుతో నిర్మించబడింది. ఇదే సినిమాను మలయాళంలో 1981లో ప్రేమ్‌నజీర్, శ్రీవిద్య జంటగా ఎల్లామ్‌ నినక్కు వెండి అనే పేరుతో నిర్మించారు. తెలుగులో చెల్లెలు పాత్ర ధరించిన శ్రీదేవి మలయాళ సినిమాలో కూడా అదే పాత్రను పోషించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఈశ్వర్. బంగారు చెల్లెలు పాటలపుస్తకం. p. 8. Retrieved 11 September 2020.

బయటిలింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బంగారు చెల్లెలు