ఫ్రేజర్ ఆల్బమ్
ఫ్రేజర్ ఆల్బమ్ అనేది బ్రిటిష్ ఇండియన్ సివిల్ సర్వెంట్ విలియం ఫ్రేజర్ సంపాదకత్వంలో రూపొందిన పెయింటింగ్స్ ఆల్బమ్.[1] భారతీయ కళలో ఇది గొప్ప కళాఖండంగా పరిగణించబడుతోంది.[2][3] మొఘల్ సామ్రాజ్య ముగింపుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ ఇందులో ఉంది. ఆల్బమ్ లోని చిత్రాలు 1815 నుండి 1819 మధ్యకాలంలో చిత్రించబడ్డాయి.[4] చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ పాలనలో భారత గవర్నర్ జనరల్ గా, ఢిల్లీ భూభాగ కమిషనర్‌కు ఏజెంట్‌గా విలియం ఫ్రేజర్ ఉన్నాడు.
ఆల్బమ్ ప్రత్యేకత
[మార్చు]ఢిల్లీని మొఘల్ కుటుంబీకులు పరిపాలిస్తున్న సమయంలో అప్పటి జీవిత నేపథ్యం గురించి ఈ ఆల్బమ్ లోని చిత్రాలలో ప్రతిబింబిస్తుంది. ఇందులో ఆ కాలపు గ్రామస్తులు, సైనికులు, వివిధ వేషభూషల పురుషులు, నృత్యం చేసే మహిళలు, ఆఫ్ఘన్ గుర్రాల డీలర్లు, సన్యాసులు, రానియా గ్రామం, భారతీయ ప్రభువుల వంటి చిత్రాలు ఉన్నాయి.[5] మొఘల్ చక్రవర్తి నుండి ఆర్థిక సహాయం తగ్గిన తరువాత గులాం అలీ ఖాన్, అతని సోదరుడు ఫైజ్, కుటుంబం వంటి మొఘల్ చిత్రకారులు ఫ్రేజర్ ఆల్బమ్‌లో పనిచేశారు.[6]
విలియం తన పనిని, దృశ్యాలను రికార్డ్ చేయడానికి స్థానిక కళాకారుడిని నియమించాడు. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న జీవన చిత్రాల నేపథ్యంలో నలభై వాటర్ కలర్స్ చిల్రాలు గీసి 1819లో కలకత్తాలోని జేమ్స్‌కు పంపాడు. తరువాత విలియం ఫ్రేజర్ చేత నియమించబడిన ముగ్గురు కళాకారులు (గులాం అలీ ఖాన్, లాల్జీ) ప్రకృతి దృశ్యాలు, వాస్తుశిల్పం, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, ప్రధానంగా హిమాలయాలు, పర్షియా మొదలైన అనేక దృశ్యాలను చిత్రించారు. అవన్నీ స్కాట్లాండ్‌కు తీసుకువెళ్ళబడ్డాయి. 1979లో జేమ్స్ డైరీలు, ఇతర డాక్యుమెంట్లు, చారిత్రక విషయాలతోపాటు కనుగొనబడే వరకు ఫ్రేజర్ కుటుంబంలోనే ఈ చిత్రాలు ఉన్నాయి. విలియం, జేమ్స్ ఫ్రేజర్ సేకరణల నుండి వచ్చిన పెయింటింగ్స్‌లో ఎక్కువ భాగం 1980లో మూడు వేలలలో చెదరగొట్టబడ్డాయి.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Six Recruits, folio from the Fraser Album". Freer Gallery of Art & Arthur M. Sackler Gallery (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-13.
- ↑ Dalrymple, William (16 August 2003). "William Dalrymple on The Dehlie Book". Retrieved 13 August 2021 – via www.theguardian.com.
- ↑ Schwendener, Martha (8 March 2012). "Scenes From a Dying Empire". Retrieved 13 August 2021 – via NYTimes.com.
- ↑ "A Fraser Album Artist, 1815-1819, The Bullock-drawn carriage of Prince Mirza Babur". www.christies.com. Retrieved 13 August 2021.
- ↑ "Bonhams to Sell Images of Delhi From the Fraser Album". outlookindia.com/. Retrieved 2021-08-13.
- ↑ "painting; album | British Museum". The British Museum (in ఇంగ్లీష్). Retrieved 2021-08-13.
- ↑ "Company School, Delhi, c. 1820, Commissioned by William Fraser and James Fraser, Illustration from the Fraser Album: Faqir Gulab Gosain (or Gurkah) of Nagarkot". Andrew Clayton-Payne (in ఇంగ్లీష్). Retrieved 2021-08-13.