ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ | |
---|---|
దర్శకత్వం | వంశీ |
నిర్మాత | మధుర శ్రీధర్ రెడ్డి |
తారాగణం | సుమంత్ అశ్విన్ అనీషా అంబ్రోస్ మానస మనాలి రాథోడ్ |
ఛాయాగ్రహణం | నగేష్ బన్నెల్ |
కూర్పు | బస్వా పైడిరెడ్డి |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | 2 జూన్ 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ 2017లో వచ్చిన తెలుగు సినిమా. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వంశీ[1] దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించాడు. సుమంత్ అశ్విన్, అనీషా అంబ్రోస్, మానస, మనాలి రాథోడ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2017, జూన్ 2న విడుదల అయ్యింది.[2][3]
కథ
[మార్చు]గోదావరి జిల్లాల్లోని పాలకొల్లు అనే ఊరిలో ఒకప్పుడు బాగా ఫెమస్ అయిన లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాళం (సుమంత్ అశ్విన్) తన తండ్రి వృత్తినే కొనసాగిస్తూ సొంతంగా బట్టల కొట్టు పెట్టి ఎప్పటికైనా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కలలు కంటుంటాడు. ఇంతలో కోట్ల మందిలో ఒక్కడికి ఉండే మన్మథ రేఖ తన అరచేతిలో ఉందని తెలుసుకున్న గోపాళం దాన్ని ఉపయోగించుకుని తన కలల్ని నెరవేర్చుకోవాలని అదే ఊరిలో ఉండే ముగ్గురమ్మాయిల్ని వలలో వేసుకుంటాడు. అలా ఆ ముగ్గురి జీవితాల్లోకి ప్రవేశించిన గోపాళం ఏం చేశాడు ? వారి వలన అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? చివరికి ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- సుమంత్ అశ్విన్ - గోపాలం
- అనీషా ఆంబ్రోస్ - మహాలక్ష్మి
- మనాలి రాథోడ్ - అమ్ములు
- మానస హిమవర్ష - రాణి
- కృష్ణుడు - శ్యామల్ రావు
- కృష్ణ భగవాన్ - పాపారావు
- రాఘవేంద్ర రాజ్ - పండు
- శివ - సత్తిగాడు
- డా.కోయ కిషోర్ - మలయాళ డాక్టర్
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: కళ్యాణ్ రాఘవ పసపుల
- మూలా కథ: మధుర శ్రీధర్ రెడ్డి
- రచన సహకారం సుమన్ కృష్ణ, అశ్విన్ బుదిరాజు
- కోరియోగ్రఫీ: స్వర్ణ
- పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీవల్లి, శ్రీమణి
- సంగీతం: మణిశర్మ
- ఫైట్ మాస్టర్: డ్రాగన్ ప్రకాష్
- ఆర్ట్: డి.వై.సత్యనారాయణ
- నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
- దర్శకత్వం: వంశీ
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (5 March 2017). "ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్!". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
- ↑ Sakshi (23 May 2017). "`ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్` ప్రీ రిలీజ్ ఈవెంట్". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
- ↑ Social News XYZ (5 May 2017). "Vamsy's 'Fashion Designer s/o Ladies Tailor' releasing on June 2". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
- ↑ Mana Telangana (5 May 2017). "కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.