Jump to content

ఫ్యాక్స్

వికీపీడియా నుండి

ఫ్యాక్స్ అనునది దూర ప్రాంతాలకు రాత సందేశాలను పంపుటకు ఉపయోగించే యంత్రము. ఈ యంత్రము దూరంగా ఉండే ప్రాంతాలకు కూడా సమాచారాన్ని అప్పటికప్పుడు బట్వాడా చేస్తుంది.

పనితీరు

[మార్చు]

ఇది ఒక అద్భుతమైన యంత్రం. ఒక కాగితంపై రాసిన, టైప్ చేసిన లేక ముద్రించిన సమాచారం ఏదైనా దాన్ని దూరంగా ఉండే ఏ ప్రదేశానికైనా క్షణాల్లో యధాతథంగా బట్వాడా చేసి దాని నకలును అందిస్తుంది. ఇందులో విద్యుత్ కాంతిని ప్రసరించే స్కానర్ ఉంటుంది. అలాగే ప్రసారం చేయాల్సిన సమాచారాన్ని గ్రహించే మ్యాజిక్ ఐ ((Magic Eye) ఉంటుంది. గ్రహించిన సమాచారాన్ని విద్యుత్ స్పందనాలుగా మార్చి ప్రసారం చేస్తుంది. సమాచారం మనం అనుకున్న ప్రాంతానికి చేరాక అక్కడి పరికరం తిరిగి దాన్ని యధాతథంగా కాగితంపై ముద్రిస్తుంది. ఈ రెండు ప్రాంతాల్లోని యంత్రాలు టెలిఫోన్ లైన్ల ద్వారానే అనుసంధానమై ఉంటాయి. మనం ఎక్కడికి సమాచారం పంపాలనుకుంటున్నామో అక్కడి ఫ్యాక్స్ యంత్రానికి ముందుగా ఫోన్ చేసి అది సిద్ధంగా ఉందని తెలుసుకున్నాకే ఇక్కడి యంత్రాన్ని పనిచేయించాల్సి ఉంటుంది.

స్కానర్‌లో ఏం జరుగుతుందో పరిశీలిస్తే.... ఒక డాక్యుమెంటును ఫ్యాక్స్ యంత్రంలో ఉంచాక, స్కానర్ నుంచి వెలువడే కాంతి కిరణాలు దానిపై పడి పరావర్తనం చెంది మరలా యంత్రంలోని దర్పణాలపై పడతాయి. అక్కడి నుంచి అవి ఒక కటకం (lens) ద్వారా సీసీడీ (charge coupled device) అనే భాగంపై కేంద్రీకృతమవుతాయి. సీసీడీలో ఉండే అతి సూక్ష్మమైన కాంతిఘటాలు (Photocells) కాంతి శక్తిని విద్యుత్ స్పందనాలుగా మారుస్తాయి. అక్కడ ఉండే మోడ్ ఎం ( Mode 'M')అనే పరికరం వేర్వేరు వోల్టేజిలలో ఉండే విద్యుత్ స్పందనాలను డిజిటల్ సిగ్నల్స్‌గా మారుస్తుంది. ఈ సిగ్నల్స్ టెలిఫోన్ తీగల ద్వారా ప్రయాణిస్తాయి. అక్కడ ఇవి తిరిగి విద్యుత్ స్పందనాలుగాను, తిరిగి కాంతిశక్తిగాను మారి అక్కడి ఇంకు, ప్రింటర్ సాయంతో కాగితంపై ముద్రితమవుతాయి. ఈ ప్రక్రియలన్నీ క్షణాల్లో మనం టెలిఫోన్‌లో మాట్లాడుకునే విధంగానే జరిగిపోతాయి.

బయటి లంకెలు

[మార్చు]
A fax machine from the late 1990s
"https://te.wikipedia.org/w/index.php?title=ఫ్యాక్స్&oldid=2987028" నుండి వెలికితీశారు