Jump to content

ఫైజర్

వికీపీడియా నుండి
ఫైజర్ వరల్డ్ ప్రధాన కార్యాలయం ప్రధాన మార్గం

ఫైజర్ ( /f aɪ z ər / FY-zər ) ఒక అమెరికన్ బహుళజాతి ఔషధ సంస్థ. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం, మాన్హాటన్, 42 వ వీధిలో ఉంది. దీనికి సహ వ్యవస్థాపకుడైన చార్లెస్ ఫైజర్ పేరు పెట్టారు.

ఫైజర్ ఇమ్యునాలజీ, ఆంకాలజీ, కార్డియాలజీ, ఎండోక్రినాలజీ, న్యూరాలజీలకు సంబంధించిన మందులు ఇంకా వ్యాక్సిన్లను అభివృద్ధి, ఉత్పత్తి చేస్తుంది. కంపెనీకి అనేక బ్లాక్ బస్టర్ మందులు లేదా ఉత్పత్తులు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి 100 కోట్ల అమెరికన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని సమకూరుస్థాయి.

కోవిడ్-19 వ్యాక్సిన్

[మార్చు]

2020 లో, ఫైజర్ కోవిడ్-19కి (mRNA) వ్యాక్సిన్ అభ్యర్థులను అధ్యయనం చేసి అభివృద్ధి చేసేందుకు బయోఎన్‌టెక్‌తో చేతులు కలిపింది. 2020 నవంబరు లో, 43,500 మందిపై పరీక్షించిన బయోఎన్‌టెక్‌ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ 90% ప్రభావవంతంగా ఉందని ఫైజర్ ప్రకటించింది, దీనిని "మైలురాయి"గా అభివర్ణించింది. టీకా తీవ్రమైన దుష్ప్రభావాలు లేకుండా దాదాపు 95% సమర్థత రేటును కలిగి ఉందని పేర్కొంది.[1]

2020 డిసెంబరు 2 న, యునైటెడ్ కింగ్‌డమ్ ఫైజర్-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసింది, "43,000 మంది"తో కూడిన "పెద్ద క్లినికల్ ట్రయల్"లో పరీక్షించబడిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆమోదించి అలా చెసిన మొదటి దేశంగా నిలిచింది.[2] 2020 డిసెంబరు 4 న, అధిక ప్రమాదం ఉన్న సమూహాలకు ఫైజర్-బయోఎన్‌టెక్‌ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగాన్ని ఆమోదించి, రెండవ దేశంగా బహ్రెయిన్ నిలిచింది. తరువాత ఈ వ్యాక్సిన్ ప్రజలకు ఉచితంగా అందించబడుతుందని ప్రకటించింది.[3]

భారత్‌కు త్వరలోనే 5 కోట్ల వ్యాక్సిన్లు పంపించబోతున్నట్టు ఫైజర్ వెల్ల‌డించింది. దీనిపై భార‌త ప్రభుత్వంతో ఉన్నత-స్థాయి చర్చలు జ‌రుగుతున్నాయ‌ని,2021 మూడవ త్రైమాసికం నాటికి ఫార్మా దిగ్గజం తన కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులో 5 కోట్లను భార‌త్‌కు విక్ర‌యించ‌డానికి పూనుకున్న‌ట్టుగా చెబుతున్నారు.[4]

పర్యావరణ రికార్డు

[మార్చు]

2000 నుండి ఫైజర్‌ సంస్థ 4,000 కంటే ఎక్కువ గ్రీన్హౌస్ వాయువు తగ్గింపు ప్రాజెక్టులను అమలు చేసింది.[5]

న్యూజెర్సీలోని బ్రిడ్జ్‌వాటర్ టౌన్‌షిప్‌లోని అమెరికన్ సైనమిడ్ స్థలంలో వైత్ యొక్క బాధ్యతలను ఫైజర్ వారసత్వంగా పొందింది, ఇది అత్యంత విషపూరితమైన ఈ.పి.ఏ (EPA) సూపర్‌ఫండ్ స్థలం. భవిష్యత్తులో లాభాలు, సంభావ్య ప్రజా ఉపయోగాల కోసం ఈ భూమిని శుభ్రపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఫైజర్ అప్పటి నుండి పరిష్కారానికి ప్రయత్నిస్తుంది.[6] సియెర్రా క్లబ్, ఎడిసన్ వెట్ ల్యాండ్స్ అసోసియేషన్ శుభ్రపరిచే ప్రణాళికను వ్యతిరేకించాయి, ఈ ప్రాంతం వరదలకు లోబడి ఉందని, కాలుష్య కారకాలు నీటివనరులలో కలిసే అవకాశం ఉందని వాదించాయి.

2002 జూన్ లో గ్రోటన్ ప్లాంట్ వద్ద జరిగిన రసాయన పేలుడులో ఏడుగురు గాయపడ్డారు, పరిసర ప్రాంతలలోని 100 కి పైగా గృహాలను ఖాళీ చేయవలసి వచ్చింది.[7]

మూలాలు

[మార్చు]
  1. "Covid vaccine: First 'milestone' vaccine offers 90% protection". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-11-09. Retrieved 2021-05-16.
  2. "Coronavirus | In world first, U.K. approves Pfizer-BioNTech COVID-19 vaccine for emergency use". The Hindu (in Indian English). 2020-12-02. ISSN 0971-751X. Retrieved 2021-05-16.
  3. "Bahrain becomes second country to approve Pfizer COVID-19 vaccine". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-16.
  4. "భార‌త్‌కు వ్యాక్సిన్‌.. ఫైజ‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌". NTV-Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-05-15. Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-16.
  5. "Pfizer Implemented More than 4,000 Greenhouse Gas Reduction Projects Since 2000". United States Chamber of Commerce. November 15, 2019.[permanent dead link]
  6. "American Cyanamid Superfund Site Fact Sheet" (PDF). New Jersey. December 2011.
  7. "The tempest". The Washington Post. May 28, 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫైజర్&oldid=4076301" నుండి వెలికితీశారు