Jump to content

ఫుల్ టాస్

వికీపీడియా నుండి

 

పూర్తి టాస్ బాల్ స్కై బ్లూలో చూపబడింది.

ఫుల్ టాస్ అనేది క్రికెట్‌లో బౌలరు వేసే ఒక రకమైన డెలివరీ. ఈ డెలివరీలో బంతి పిచ్‌ని తాకకుండా నేరుగా బ్యాటరును చేరుతుంది.[1]

ఫుల్ టాస్‌ బంతి బ్యాటరు నడుము ఎత్తు కంటే పైగా వస్తే దాన్ని బీమర్ అంటారు. ఇది చట్ట విరుద్ధమైన డెలివరీ. ఆ బంతి నో-బాల్ అవుతుంది.

ఫుల్ టాస్ బంతిని కొట్టడం చాలా సులభం కాబట్టి, ఉద్దేశపూర్వకంగా వేసే ఫుల్ టాస్‌లు అరుదుగా ఉంటాయి. తక్కువ ఎత్తు ఫుల్ టాస్ అనేది సాధారణంగా, బ్యాటరు పాదాల వద్ద నేలపై పడేలా వేసే యార్కర్‌ను వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బంతిపై సరైన నియంత్రణ లేక, పొరపాటున ఫుల్ టాస్‌గా పోతుంది. అప్పుడప్పుడు ఫుల్ టాస్ ఒక బ్యాటరును ఆశ్చర్యపరుస్తుంది. ఆ అలాంటి సమయంలో బ్యాటరు దానిని సరిగ్గా ఆడలేక ఔటయ్యే అవకాశం ఉంటుంది. కానీ బౌలర్లు దీనిపై పెద్దగా ఆధారపడరు.

స్టంప్‌ల బేస్‌లోకి గరిష్ట స్వింగ్‌ను సాధించడానికి కొన్నిసార్లు బౌలరు ఉద్దేశపూర్వకంగా ఫుల్ టాస్ వేసే సందర్భాలు ఉంటాయి. బంతి బాగా స్వింగు అయ్యేలా చేసి నేరుగా స్టంపుల పాదాల వద్దకు దూసుకుపోయేలా చేసే లక్ష్యంతో అలా వేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "Understanding the no-ball law". August 29, 2010 – via news.bbc.co.uk.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫుల్_టాస్&oldid=3995423" నుండి వెలికితీశారు