ఫీజు వాపసు పథకం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఫీజు వాపసు పథకం లేక ఫీజు రీఎంబెర్స్మెంట్ను పథకం అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చే నడపబడుతున్న ఒక విద్యార్థి విద్యా ప్రోత్సాహాక కార్యక్రమం. ఈ పథకం రాష్ట్రంలోని నిరుపేద, పేద వర్గాలకు చెందిన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొంటుంది. 2012-13లో దాదాపు ఇంజనీరింగ్ కళాశాలల్లోని 1,50,000 విద్యార్థులతో సహా ప్రొఫెషనల్ కళాశాలల్లోని 6,00,000 పైనే విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందినారు. 2013-14 నుంచి ప్రభుత్వం స్కాలర్షిప్ వినియోగించుకుంటున్న విద్యార్థులకు ఆధార్ సంఖ్య తప్పనిసరి చేసింది.
చరిత్ర
[మార్చు]"ఫీజు వాపసు కార్యక్రమం" అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి హయాంలో 2008 లో ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం 2008-09లో 2,000 కోట్ల రూపాయలు, 2012-13లో 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.
పథకం
[మార్చు]ఈ పథకం ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బి ఎడ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చేసేవారికి వర్తిస్తుంది. ఇంజనీరింగ్లో సంవత్సరానికి రూ 52,000 నిధులు వస్తున్నాయి. కానీ డిగ్రీ కోర్సుకు రూ 10,000 మాత్రమే అందిస్తున్నారు.