ఫర్జానా
స్వరూపం
ఫర్జానా | |
---|---|
జననం | |
వృత్తి | నటి, నృత్య దర్శకురాలు, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2006–2009 |
ఫర్జానా తెలుగు చలనచిత్ర నటి, నృత్యదర్శకురాలు, ప్రచారకర్త. ఫర్జానా మొదటగా హిందీ చిత్రరంగంలో నృత్య దర్శకురాలు గా పనిచేస్తుండేది. నిధి ప్రసాద్ తీసిన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.[1]
జననం
[మార్చు]ఫర్జానా మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]ఫర్జానా మొదటగా హిందీ సినిమాలలో నృత్యకారిణిగా, నృత్య దర్శకురాలిగా పనిచేసింది. అనేక ఫ్యాషన్ షోలకు, వీడియా ఆల్బమ్ లను నృత్య దర్శకత్వం వహించింది. హీరో హోండా, సన్ సుయ్, గోద్రెజ్ హెయిర్ కేర్, బిగ్ బజార్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా పనిచేసింది. నిధి ప్రసాద్ తీసిన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, అటుతర్వాత కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]చిత్రంపేరు | సంవత్సరం | భాష | పాత్రపేరు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
భాగ్యలక్ష్మి బంపర్ డ్రా | 2006 | తెలుగు | ||
సీమ శాస్త్రి | 2007 | తెలుగు | ||
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ | 2008 | తెలుగు | ||
గజి బిజి | 2008 | తెలుగు | ||
మల్లెపువ్వు | 2008 | తెలుగు | ప్రత్యేక పాట[2] | |
కుబేరులు | 2008 | తెలుగు | ||
1977 | 2009 | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ మీడియా1 వెబ్ దునియా. "సంతోషంలో "ఫర్జానా" ఉక్కిరిబిక్కిరి". media1.webdunia.com. Retrieved 29 May 2017.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఫర్జానా అప్పుడేనా?". telugu.filmibeat.com. Retrieved 29 May 2017.