ప్లాస్టిక్ మల్చింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లాస్టిక్ మల్చ్‌తో కప్పబడిన కూరగాయల పడకలు

ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు.

మొక్క చుట్టూ మల్చింగ్ షీటును పరిస్తే భూమిలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. దీని ద్వారా నీటిని 30-70 శాతం వరకూ ఆదా చేయవచ్చు.

మల్చింగ్ షీటు వల్ల కలుపు మొక్కల బెడద 85 శాతం వరకూ తగ్గుతుంది. మల్చింగ్ షీటు మొక్క వేర్ల చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల్ని నియంత్రిస్తుంది. దీనివల్ల వేర్లు ఆరోగ్యంగా, దృఢంగా పెరుగుతాయి.

వర్షపు నీరు నేరుగా భూమి పైన పడి మట్టి కోతకు గురి కాకుండా మల్చింగ్ షీటు అడ్డుకుంటుంది. తద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు.

సంప్రదాయ పద్ధతితో పోలిస్తే మల్చింగ్ షీటు పరచిన పొలంలో ఎరువుల్ని మొక్కలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాయి.

పారదర్శకమైన మల్చింగ్ షీట్లను పరచిన చేలల్లో సూర్యరశ్మి ధారాళంగా ప్రసరించి భూమిలో దాగి ఉండే క్రిమికీటకాలు, తెగుళ్ల వ్యాప్తికి కారణమైన సూక్ష్మజీవులు నశిస్తాయి.

షీట్లు పరవడానికి తొలుత కూలీలు అవసరమైనప్పటికీ ఆ తర్వాత కలుపుతీత, అంతరకృషి వంటి పనులకు కూలీలపై అయ్యే ఖర్చు ఆదా అవుతుంది.

మల్చింగ్ షీట్లను వాడడం వల్ల టమాటా, మిరప పంటల్లో దిగుబడి 50 శాతం వరకూ పెరిగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

పుచ్చ, క ర్బూజ, కాప్సికమ్ పంటల్లో కూడా మామూలు పద్ధతిలో సాగు చేసిన దాని కంటే అధిక దిగుబడులు వచ్చాయి.

మొదట్లో పెట్టుబడి వ్యయం కొంచెం ఎక్కువే అయినప్పటికీ ఆ తర్వాతి కా లంలో సాగు ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు.

ఎలా పరవాలి

[మార్చు]

సాగు చేసే పంట, మొక్కల మధ్య దూరాన్ని బట్టి మల్చింగ్ షీట్లను పరవాలి.

మిరప, టమాటా, కాప్సికమ్, కర్బూజ, పుచ్చ వంటి పంటలు వేసే వారు ముందుగా 10 సెంటీమీటర్ల వెడల్పు, 15-20 సెంటీమీటర్ల ఎత్తులో బోదెలు తయారు చేసుకోవాలి.

వాటి మధ్య డ్రిప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి. సాధారణంగా కూరగాయ పంటలన్నింటికీ సింగిల్ డ్రిప్‌లైన్ సరిపోతుంది. డ్రిప్‌లైన్ పైన 25 లేదా 50 మైక్రాన్ల మల్చింగ్ షీట్లను పరిచి బోదెల కింది భాగంలో మట్టితో కప్పాలి.

డ్రిప్‌లైన్‌కు ఇరు వైపులా 15 సెంటీమీటర్ల దూరంలో రెండు అంగుళాల వ్యాసంతో రం ధ్రాలు చేయాలి.

వాటి మధ్య విత్తనాలు విత్తుకోవాలి. లేదా నారు మొక్కలు నాటాలి. విత్తనం మొలకెత్తే వరకూ లేదా నారు మొక్కలు నిలదొక్కుకునే వరకూ ప్రతి రోజూ ఎక్కువ మొత్తంలో నీటిని అందించాలి.

ఆ తర్వాత సీజన్‌ను బట్టి ప్రతి రోజూ అవసరమైన మేరకు డ్రిప్ ద్వారా నీటిని వదలాలి. ఎరువుల్ని కూడా డ్రిప్ ద్వారా అందించవచ్చు. వేసే పంట, మొక్కల మధ్య దూరాన్ని బట్టి ఎకరానికి మల్చింగ్ షీట్ల కొనుగోలుకు 10-15 వేల రూపాయలు ఖర్చవుతాయి.

ఉద్యాన శాఖ రాయితీ

[మార్చు]

ఉద్యాన శాఖ వారు మల్చింగ్ షీట్లను రాయితీపై అందిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మల్చింగ్‌

బయటి లింకులు

[మార్చు]