ప్రేమ కానుక
స్వరూపం
ప్రేమ కానుక (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
రచన | వి.సి. గుహనాథన్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, సుజాత, మోహన్ బాబు |
సంగీతం | కె. చక్రవర్తి |
భాష | తెలుగు |
ప్రేమ కానుక 1981,జూన్ 27వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి,సుజాత ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం, కె.రాఘవేంద్రరావు కాగా , సంగీతం కె. చక్రవర్తి అందించారు .
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- శ్రీదేవి
- సుజాత
- మోహన్ బాబు
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- కె.చక్రవర్తి
- ప్రభాకర్ రెడ్డి
- కైకాల సత్యనారాయణ
- మధుమాలిని
- మనోరమ
- పుష్పలత
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: గుహనాథన్
- మాటలు: సత్యానంద్
- పాటలు: ఆత్రేయ
- సంగీతం: చక్రవర్తి
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- కళ: శ్రీనివాసరాజు
- ఛాయాగ్రహణం: కె.ఎస్.ప్రకాష్
- చిత్రానువాదం, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
- నిర్మాతలు: అక్కినేని నాగార్జున & అక్కినేని వెంకట్
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను ఆత్రేయ రచించగా, కె.చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చాడు.[1]
క్ర.సం | పాట | గాయకులు |
---|---|---|
1 | "ఆ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో ఈ యెండ మబ్బుల్లో నీవే" | పి.సుశీల |
2 | "వంట చేసి చూపిస్తా పీటవేసి తినిపిస్తా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ |
3 | "అయ్యారే తుంటరోడు ఒయ్యారం సంతకాడ వియ్యాలు సేయమన్నాడే " | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
4 | "మనసుల ముడి పెదవుల తడి మధువుల జడి ఎద తడబడి " | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
5 | "చెమ్మా చెక్కా సక్కనోడు జిమ్మా దియ్యా సిక్కనోడు" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
6 | "ఓ నవ మదనా రారా నా ప్రియ వదనా రారా " | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
7 | "జంతర్ మంతర్ ఆటలాడాలి జమ్మా లకడి దుమ్మురేగాలి" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ అన్నపూర్ణ. ప్రేమ కానుక పాటల పుస్తకం. p. 12. Retrieved 23 August 2020.