ప్రేమ ఎంత మధురం (పాట)
స్వరూపం
ఈ పాట అభినందన చిత్రం కోసం ఆత్రేయ రచించారు. దీనికి సంగీతం ఇళయరాజా అందించారు. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
<poem> ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మథనం, మింగినాను హలాహలం
ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము ఎన్నాళ్ళని ఈ ఎదలో ముళ్ళు, కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ దీపము, నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణం
నేనోర్వలేనూ ఈ తేజము, ఆర్పేయరాదా ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి, నా రేపటిని మరిచేపోయి మానాలి నీ ధ్యానము, కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |