ప్రేమతరంగాలు
1980లో విడుదలైన ప్రేమతరంగాలు యాక్షన్ చిత్రం. ప్రభు చిత్ర నిర్మాణ సంస్థ, ఎస్. పి.చిట్టిబాబు దర్శకత్వంలో, కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత, జయసుధ నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు. హిందీలో వచ్చిన "ముకాద్దర్ కా సికిందర్" చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మాణం ఈ చిత్రం.
ప్రేమతరంగాలు (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎస్.పి.చిట్టిబాబు |
తారాగణం | కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత, జయసుధ |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | ప్రభు చిత్ర |
భాష | తెలుగు |
పరిచయం
[మార్చు]హిందీ లో విజయవంతమైన 'ముకద్దర్ కా సికందర్' కి తెలుగు పునర్నిర్మాణమే ఈ చిత్రం. అమితాబ్ బచ్చన్ పాత్రని కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రని చిరంజీవి, రాఖీ పాత్రని సుజాత పోషించారు.
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు
- చిరంజీవి
- జయసుధ
- సుజాత
- కైకాల సత్యనారాయణ
- సావిత్రి
- కాంతారావు
- కె.వి.చలం
- జె.వి.రమణమూర్తి
- బాలకృష్ణ
- ముక్కామల
- సారథి
- భీమరాజు
- పి.జె.శర్మ
- రవికాంత్
- ఝాన్సీ
- జగ్గారావు
- ఆనంద్ మోహన్
- జి.వి.జి.
- అర్జా జనార్ధనరావు
- చలపతిరావు
- నర్రా వెంకటేశ్వరరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- శ్రీలక్ష్మి
- మాస్టర్ రాజు
- మాస్టర్ రాజేష్
- మాస్టర్ బాబు
- బేబి దేవి
- అంజన్ కుమార్
- చంద్రరాజు
- మోహిని
- తులసి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎస్.పి చిట్టిబాబు
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ, పి సుశీల
స్క్రీన్ ప్లే: ఎస్ పి చిట్టిబాబు
నిర్మాత: ఎం వి.హెచ్.రాయపరాజు
నిర్మాణ సంస్థ: ప్రభు చిత్ర
విడుదల:24:10:1980.
పాటలు
[మార్చు]- కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా (రచన: సి. నారాయణరెడ్డి; గాయకులు: బాలు, సుశీల)
- ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు (రచన: సి. నారాయణరెడ్డి; గాయకులు: బాలు, )
- మనసు ఒక మందారం చెలిమి తన మకరందం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకుడు: బాలు)
- మనసు ఒక మందారం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకురాలు: ఎస్.పి.శైలజ)
- నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకుడు: బాలు)
- నా హృదయం తెల్ల కాగితం (రచన: ఆచార్య ఆత్రేయ; గాయకులు: బాలు, సుశీల)
- ఇదేం పరువం ప్రతీసమయం ఇలా ఆడి ఘల్ ఘల్ ఘాల్(రచన: సి నారాయణ రెడ్డి, గాయకులు: పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం)
ఇవి కూడా చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.