ప్రేమకు వేళాయెరా
ప్రేమకు వేళాయెరా | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
రచన | దివాకర్ బాబు (మాటలు), ఎస్. వి. కృష్ణారెడ్డి (చిత్రానువాదం) |
నిర్మాత | తరంగ సుబ్రహ్మణ్యం |
తారాగణం | జె.డి.చక్రవర్తి , సౌందర్య |
ఛాయాగ్రహణం | శరత్ |
కూర్పు | కె. రాంగోపాల్ రెడ్డి |
సంగీతం | ఎస్. వి. కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఆగస్టు 6, 1999 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమకు వేళాయెరా 1999 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో జె. డి. చక్రవర్తి, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మూలం సూర్యదేవర రామమోహనరావు రాసిన నవల.
కథ
[మార్చు]2500 కోట్లకు అధిపతి అయిన వెంకట నారాయణ భారతదేశంలోని అతి పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకడు. అతని ఒక్కగానొక్క కూతురు మాధవి. విదేశాల్లో చదువు ముగించుకుని భారతదేశానికి వస్తుంది. తండ్రి ఆమెను వెంటనే తన బాధ్యతలు స్వీకరించమని కోరతాడు. కానీ మాధవి మాత్రం కొద్ది రోజులు ఆమె ఎవరో ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ సంస్థలో గుమాస్తాగా చేరి పనితీరు గమనించి ఆ తర్వాత బాధ్యతలు చేపడతానని చెబుతుంది. వెంకట నారాయణకు కూడా ఆ ఆలోచన నచ్చి ఆమెను మాలతి అనే పేరుతో ఆఫీసులో పనిచేయమంటాడు.
వెంకట నారాయణకు మేనల్లుడైన మనోహర్ అప్పుడే బీకాం పూర్తి చేసి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు. తల్లి ద్వారా వెంకట నారాయణ స్వయానా తనకు మేనమామ అని తెలుసుకుని అతని కూతురుని మాధవిని పెళ్ళి చేసుకుంటే ఆస్తంతా తనదే అవుతుందనీ అసలు పని చేయకుండా జీవితం గడిపేయచ్చనుకుంటాడు. హైదరాబాదుకు వెళ్ళే దారిలో గర్భవతియైన మాధవి స్నేహితురాలని తన తెలివితేటలనుపయోగించి ఆపద నుండి బయట పడేస్తాడు. మాధవి అతని తెలివితేటలకు అబ్బురపడుతుంది.
హైదరాబాదులో నేరుగా మేనమామ వెంకటనారాయణ దగ్గరికి వెళ్ళి కూతుర్నిచ్చి పెళ్ళి చేసి ఆస్తిని తన చేతిలో పెట్టమంటాడు. వెంకటనారాయణ అతనికి డిస్పాచ్ క్లర్కు ఉద్యోగం ఇచ్చి అదే కంపెనీలో పనిచేయమంటాడు. మనోహర్ స్నేహితుడు రవి సాయంతో ఆఫీసులో పని చేస్తున్న మాలతినే తన మరదలు మాలతి అని తెలుసుకుని కేవలం ఆస్తి కోసమే ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. మాలతి కూడా మనోహర్ ను ప్రేమించడం మొదలు పెడుతుంది. తన తండ్రికి కూడా మనోహర్ ను ప్రేమిస్తున్నట్లు చెబుతుంది. దాంతో వెంకట నారాయణ మనోహర్ ఆమెను కేవలం ఆస్తి కోసమే ప్రేమిస్తున్నాడని అతని నిజస్వరూపం గురించి చెబుతాడు. ఆమె ఆ విషయం నిర్ధారించుకోవడానికి తన తల్లిదండ్రులు చేపలు అమ్ముకునే వారిగా మనోహర్ ను నమ్మిస్తుంది. దాంతో మనోహర్ ఆమెను ప్రేమించడం మానేస్తానని చెబుతాడు. మాధవి మాత్రం తాను బావనే పెళ్ళి చేసుకుంటానని అతనిలో మార్పు తెస్తాననీ అందుకు కొంచెం సమయం ఇవ్వమంటుంది. అందుకు వెంకటనారాయణ కూడా అంగీకరిస్తాడు.
తారాగణం
[మార్చు]- మనోహర్ గా జె. డి. చక్రవర్తి
- మాధవి/మాలతి గా సౌందర్య
- వెంకట నారాయణ గా ప్రకాష్ రాజ్
- రవి గా రవితేజ
- ఆనందం గా బ్రహ్మానందం
- నారాయణ గా ఎం. ఎస్. నారాయణ
- రంగనాథ్
- అప్పారావు గా శ్రీహరి
- సూర్య
- మనోహర్ తల్లిగా అన్నపూర్ణ
- వెంకటనారాయణ భార్యగా వై. విజయ
- మనోహర్ తండ్రి గా సుబ్బరాయ శర్మ
- దుకాణదారు గా గౌతంరాజు
- యూనియన్ నాయకుడిగా నర్రా వెంకటేశ్వర రావు
- బాబు మోహన్
నిర్మాణం
[మార్చు]ఈ సినిమాను తరంగ ఫిలింస్ పతాకంపై తరంగ సుబ్రహ్మణ్యం నిర్మించాడు. జె. డి. చక్రవర్తి, సౌందర్య తొలిసారిగా జంటగా నటించిన చిత్రం ఇది.[2]
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో పాటలు ఎస్. వి. కృష్ణారెడ్డి స్వరపరిచాడు.
- చిన్న గౌను వేసుకున్న , రచన: చంద్రబోస్,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఇంటర్ చదివే రోజుల్లోనే, రచన: చంద్రబోస్, గానం. మనో, చిత్ర
- ఇప్పటికిప్పుడు రెప్పల్లో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఉన్ని కృష్ణన్, కె ఎస్ చిత్ర
- కన్ను కన్ను కలుపుకుని , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. శ్రీనివాస్, కె ఎస్ చిత్ర
- పద పద పదరా పాటు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,అనురాధ శ్రీరామ్
- తళ తళ తారకలాగా , రచన: చంద్రబోస్, గానం. శంకర్ మహదేవన్, హరిణి.
మూలాలు
[మార్చు]- ↑ జి. వి, రమణ (6 August 1999). "Premaku Velayara - A review". idlebrain.com. Retrieved 21 November 2018.
- ↑ Prabhu (2019-08-06). "JD Chakravarthy Premaku Velayera Finishes 20 Years | Telugu Filmnagar". Thetelugufilmnagar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-07.