Jump to content

ప్రియాంక జ‌వాల్క‌ర్

వికీపీడియా నుండి
ప్రియాంక జ‌వాల్క‌ర్
ప్రియాంక జ‌వాల్క‌ర్


వ్యక్తిగత వివరాలు

జననం 12 నవంబరు 1992
అనంతపురం, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయురాలు
నివాసం అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
మతం హిందూ

ప్రియాంక జ‌వాల్క‌ర్ (జననం 1992 నవంబరు 12) ఒక భారతీయ తెలుగు సినిమా నటి. 2017లో తెలుగులో వచ్చిన కల వరం ఆయే సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా 2018లో వచ్చిన టాక్సీవాలా చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.[1][2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ప్రియాంక జ‌వాల్క‌ర్ 1992 నవంబరు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో జన్మించింది. ఈమె పూర్వీకులు మరాఠీ కుటుంబానికి చెందినవారు, వాళ్ళు అనంతపురంలో స్థిరపడ్డారు. పదవతరగతి వరకు అనంతపురంలోని ఎల్.ఆర్.జి. హైస్కూల్ లో చదివిన ప్రియాంక, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

సినిమారంగం

[మార్చు]

నటనలో ఆసక్తి ఉన్న ప్రియాంక, ఎన్.జె. బిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. 2017లో కల వరం ఆయే, 2018లో టాక్సీవాలా సినిమాలలో నటించింది.[4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడి పేరు మూలాలు
2017 కల వరం ఆయే సంపత్ వి. కుమార్
2018 టాక్సీవాలా రాహుల్ సంక్రిత్యన్
2021 గమనం జారా సుజనారావు [5]
2021 ఎస్ఆర్ కల్యాణమండపం శ్రీధర్ గదె
2021 తిమ్మ‌రుసు శరణ్‌ కొప్పిశెట్టి [6]

మూలాలు

[మార్చు]
  1. Telangana Today, Telangana Today (11 Nov 2019). "Priyanka Jawalkar shares about being a celebrity". Telangana Today. Archived from the original on 31 March 2021. Retrieved 31 March 2021.
  2. "Priyanka Jawalkar on 'Taxiwala'". The Hindu. Retrieved 31 March 2021.
  3. EENADU (12 July 2021). "అప్పుడు చాలా భయపడ్డా". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  4. "Priyanka Jawalkar". wikistarr.com. 2019-07-30. Retrieved 2021-03-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Sakshi (6 October 2020). "ముచ్చటైన ప్రేమ". Sakshi. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  6. Andrajyothy (11 August 2021). "తెలుగమ్మాయిలు ఎక్కడైనా సత్తా చాటగలరు!". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.