ప్రియాంక గోస్వామి
స్వరూపం
ప్రియాంక గోస్వామి (జననం 10 మార్చి 1996) 20 కిలోమీటర్ల వాకింగ్ పోటీల్లో పోటీపడే ఒక భారతీయ క్రీడాకారిణి. ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 17వ స్థానంలో నిలిచింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె 10000 మీటర్ల నడకలో రజత పతకాన్ని గెలుచుకుంది.[1][2]
జీవిత చరిత్ర
[మార్చు]గోస్వామి అథ్లెటిక్స్‌కు మారడానికి ముందు కొన్ని నెలల పాటు పాఠశాలలో జిమ్నాస్టిక్స్ సాధన చేసింది. విజయవంతమైన పోటీదారులకు లభించే బహుమతులను చూసి ఆమె క్రీడల వైపు ఆకర్షితురాలైంది.
ఫిబ్రవరి 2021లో, ఆమె 20 కి.మీ రేసులో ఇండియన్ రేస్‌వాకింగ్ ఛాంపియన్‌షిప్‌ను 1:28.45 కొత్త భారతీయ రికార్డుతో గెలుచుకుంది. 2020 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె గతంలో 2017లో ఇండియన్ రేస్‌వాకింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[3] [4]
ఆమె భారతీయ రైల్వేలకు OSగా పని చేస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "India's Bhawna Jat makes the Olympic cut in 20km race walk". India Today (in ఇంగ్లీష్). February 15, 2020. Retrieved 2021-07-26.
- ↑ Mondal, Aratrick (6 August 2021). "Tokyo Olympics Priyanka Goswami 17th, Bhawna Jat 32nd in women's 20km race walk, Gurpreet fails to finish in men's event". www.indiatvnews.com. Retrieved 7 August 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Women's 10,000m Race Walk - Final". Birmingham2022.com (in ఇంగ్లీష్). 2022-08-06. Retrieved 2022-08-06.
- ↑ "CWG 2022: Priyanka Goswami bags silver medal in women's 10,000m race walk". dnaindia.com (in ఇంగ్లీష్). 2022-08-06. Retrieved 2022-08-06.