ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం | |
---|---|
Location | తెలంగాణ, భారతదేశం |
Nearest city | మంచిర్యాల |
Coordinates | 19°01′32″N 79°54′19″E / 19.0256091°N 79.9053466°E[1] |
Area | 136.2 కి.మీ2 (52.6 చ. మై.) |
Established | 1980 |
ఆధికారిక వెబ్సైటు |
ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది పక్కన ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మంచిర్యాల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది.[2]
చరిత్ర
[మార్చు]దక్కన్ పీఠభూమి లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నిదర్శనంగా ఉన్న ఈ అభయారణ్యం 1980, మార్చి 13న ప్రారంభించబడింది. ఇది 136.02 కిమీ విస్తీర్ణంతో దక్షిణ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, పొడి గడ్డి భూములతో కూడి ఉంది. టేకు చెట్లతో కూడిన కొండలు, పచ్చిక బయళ్ళు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్ళుగా ఉన్నాయి.[3]
వృక్షాలు
[మార్చు]ఈ అభయారణ్యం సహజ వృక్షసంపదతో సమృద్ధిగా ఉంది. డాల్బెర్జియా పానికులాటా, స్టెరోకార్పస్ మార్సుపియం, ఫికస్ ఎస్పిపి, డాల్బెర్జియా లాటిఫోలియా, డాల్బెర్జియా సిస్సో మొదలైన వివిధ రకాల మొక్కలను, చెట్లను ఇక్కడ చూడవచ్చు.
జంతువులు
[మార్చు]ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం వివిధ రకాల అడవి జాతులకు, ముఖ్యంగా చిరుతపులులు, రీసస్, పులులు, లాంగర్లు, హైనాలు, ఎలుగుబంటి, అడవి కుక్కలు, అటవీ పిల్లి, మరెన్నో క్షీరదాలకు సహజ నివాస స్థలంగా ఉంది.
పక్షులు
[మార్చు]బ్రాహ్మిని బాతులు, అడవి బాతులు, స్ట్రోక్స్, కొంగలు వంటి సముద్ర పక్షులను కూడా ఇక్కడ ఉంటాయి.
ఇతర వివరాలు
[మార్చు]- ఇక్కడ వివిధ శిలాజాలు ఉన్నాయి. ఇక్కడి 15 నుండి 40 డిగ్రీల వరకు ఉంటుంది.[4]
- నవంబరు - ఏప్రిల్ నెలల మధ్య సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది.
- మంచిర్యాల, చెన్నూర్ లలో అటవీశాఖ విశ్రాంతి గృహాలు (హరిత హోటల్స్) ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Pranahita Sanctuary". protectedplanet.net. Archived from the original on 2015-02-21. Retrieved 2020-04-22.
- ↑ ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
- ↑ నవ తెలంగాణ, జరదేఖో (12 May 2015). "ప్రకృతి ఒడిలో వినోద జడి". m.navatelangana.com. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.