అక్షాంశ రేఖాంశాలు: 34°12′21″N 43°52′47″E / 34.20583°N 43.87972°E / 34.20583; 43.87972

ప్రసిద్ధ సమర్రా మస్జిద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసిద్ధ సమర్రా మసీదు
గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా మినారెట్
ప్రదేశంసమర్రా, ఇరాక్
భౌగోళికాంశాలు34°12′21″N 43°52′47″E / 34.20583°N 43.87972°E / 34.20583; 43.87972
స్థాపితం848

ప్రసిద్ధ సమర్రా మసీదు లేదా గ్రేట్ మాస్క్ ఆఫ్ సమర్రా ఇరాక్ దేశంలో ఉన్న ఒక అద్భుత మసీదు. ఈ కట్టడాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కట్టడం గా ప్రకటించారు.

విశేశాలు

[మార్చు]
  • దూరం నుంచి చూడ్డానికి భారీ స్తంభంలా కనిపిస్తుంది. దగ్గరికెళ్లి చూస్తే మెలికలు తిరిగిన మేడలా నిర్మాణం ఎంతో అబ్బురపరుస్తుంది. ఇక పైకెళితే కానీ తెలీదు అదో మసీదు అని.
  • దీనిని 9వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటి పాలకుడు అబ్బాసిద్ కలీఫ్ ఆల్ ముతవక్కీ హయాంలో కట్టించారు. క్రీ||శ 848లో మసీదు నిర్మాణం మొదలెడితే 851లో పూర్తయ్యింది. అప్పట్లో ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు గా ఇది కీర్తించబడినది.
  • స్తంభంలా కనిపించే దీని ఎత్తు 170 అడుగులు. అంటే సుమారు 15 అంతస్తుల భవనమంత. ఇక చుట్టు కొలత 100 అడుగుల పైనే!
  • భవనం పై భాగంలో మసీదును నిర్మించారు. అయితే పైకెళ్లడానికి ప్రత్యేకంగా మెట్లేమీ ఉండవు. భవనం గోడలనే ర్యాంప్‌లా కట్టడంతో దానిపై నుంచే నడుచుకుంటూ వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత.
  • మసీదు లోపలికి వెళ్లడానికి సుమారు 17 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. లోపల కూడా చక్కని ఇస్లామిక్ నిర్మాణశైలితో ప్రాచీన కళాకృతులు, చెక్కుళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
  • మసీదుపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. 2005లో దీనిపై ఒక బాంబు కూడా పడింది. మళ్లీ మరమ్మతులు చేసి పూర్వవైభవం తీసుకొచ్చారు.
  • ఈ మసీదును అనుకరిస్తూ ఈజిప్టుతోపాటు ఎన్నో ప్రాంతాల్లో దీని నమూనాల్లో మసీదులు కట్టారు.

బయటి లంకెలు

[మార్చు]