ప్రసన్న ఆచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసన్న ఆచార్య
పార్లమెంట్ సభ్యుడు
రాజ్యసభ [1]
In office
2016 జులై 2 – 2022 జూలై 1
అంతకు ముందు వారుప్రియమోహన్ మహా పాత్ర స్వతంత్ర రాజకీయ నాయకుడు
నియోజకవర్గంఒడిశా
ఒడిశా శాసనసభ సభ్యుడు
In office
2009 – 2014
తరువాత వారురోహిత్ పూజారి
నియోజకవర్గంరైరాఖోల్ శాసనసభ నియోజకవర్గం
పార్లమెంటు సభ్యుడు
లోక్ సభ
In office
1998 – 2009
నియోజకవర్గంసాంబాల్ర్పూర్ పార్లమెంటు నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1949-08-08) 1949 ఆగస్టు 8 (వయసు 74)
ఒడిశా, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీబిజు జనతాదళ్
జీవిత భాగస్వామిచారుశీల
సంతానం2 కూతుళ్లు
నివాసంభువనేశ్వర్, ఒడిశా
కళాశాలపంచాయతీ కాలేజ్

ప్రసన్న ఆచార్య (జననం 1949 ఆగస్ట్ 8) భారతదేశంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయవేత్త. ప్రసన్న ఆచార్యరాజ్యసభ మాజీ సభ్యుడు. .[2] ప్రసన్న ఆచార్య బిజు జనతాదళ్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

ప్రసన్న ఆచార్య బిజు జనతాదళ్ ఒడిశా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రసన్న ఆచార్య ప్రస్తుతం ఒడిశా శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఉన్నాడు. ఆయన సంబల్పూర్ జిల్లాలోని రైరాఖోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

1990 నుండి 1995 వరకు ప్రసన్న ఆచార్య బిజు పట్నాయక్ నేతృత్వంలోని జనతా దళ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అలాగే 2009 నుండి 2014 వరకు బిజు జనతా దళ్ ప్రభుత్వంలో నవీన్ పట్నాయక్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయన భారతదేశపు 13వ 14వ లోక్ సభలలో ఎంపీగా గెలిచి పార్లమెంటు సభ్యుడిగా కమ పనిచేశారు.[3][4] ప్రసన్న ఆచార్యఒడిశా సంబల్పూర్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

2009మేలో ప్రసన్న ఆచార్య ఎంపీ పదవికి రాజీనామా చేసి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించాడు. ప్రసన్న ఆచార్య సుమారు 10,000 ఓట్ల మెజారిటీతో రైరాఖోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 ఒడిశా శాసనసభ ఎన్నికలలో ప్రసన్న ఆచార్య బీజేపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ చెందిన సుబాల్ సాహు చేతిలో 458 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2019లో ప్రసన్న ఆచార్య బర్గఢ్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సురేష్ పూజారి చేతిలో ఓడిపోయారు.

ప్రసన్న ఆచార్య ఒడిశా ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర శాసనసభలో, పార్లమెంటు ఉభయ సభలలో అంటే లోక్సభ, రాజ్యసభలలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించిన అతి కొద్ది మంది నాయకులలో ఆయన ఒకరు.

మూలాలు

[మార్చు]
  1. "26 Rajya Sabha members elected unopposed in six states (Roundup) - Times of India". The Times of India. Archived from the original on 16 June 2016. Retrieved 4 June 2016.
  2. "Assembly Member's Information System". ws.ori.nic.in. Archived from the original on 19 June 2009. Retrieved 2010-11-19.
  3. "Acharya Member of The 13th Lok Sabha". parliamentofindia.nic.in. Retrieved 2010-11-19.
  4. "Acharya Member of The 14th Lok Sabha". 164.100.47.132. Retrieved 2010-11-20.