ప్రవీణ్ సూద్
ప్రవీణ్ సూద్ | |
---|---|
జననం | కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ | 1964 మే 22
జాతీయత | భారతదేశం |
విద్య | ఎలక్ట్రిల్ ఇంజనీరింగ్ (ఐఐటీ-ఢిల్లీ) ఎంబీఏ |
వృత్తి | డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ |
కర్ణాటక పోలీస్ | |
పురస్కారాలు | ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఉత్తమ సేవలకు గాను, 2011 |
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇతను ప్రస్తుతం కర్ణాటక డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.[1] ఇతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు కొత్త డైరెక్టర్‌గా నియమించబడ్డాడు.[2] ప్రవీణ్ 25 మే 2023న సీబీఐ కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు.[3] ఇతను ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నాడు. సుబోధ్ జైస్వాల్ తర్వాత దేశంలో ఇతను అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రవీణ్ సూద్ 1964లో హిమాచల్ ప్రదేశ్ లో జన్మించాడు.[4] అతని తండ్రి, దివంగత ఓం ప్రకాష్ సూద్, ఢిల్లీలో ప్రభుత్వ గుమాస్తా పనిచేసేవాడు. అతని తల్లి, దివంగత కమలేష్ సూద్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ప్రవీణ్ పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఐఐటీ - ఢిల్లీలో ప్రవేశం పొందాడు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తరువాత అతను మొదటి ప్రయత్నంలోనే యూపిఎస్సి (సివిల్స్) పరీక్షలో ర్యాంక్ సాధించాడు. ప్రవీణ్ సూద్ 1989లో మైసూరులో తన మొదటి పోస్టింగ్ పొందాడు. మైసూరులో అతను వినూత్నమైన, నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు పొందాడు. అతను ఐఐఎం- అహ్మదాబాద్ నుండి పబ్లిక్ పోలీస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కూడా చేసాడు. ప్రవీణ్ సూద్ మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా కూడా పనిచేశాడు, [5]మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ప్రవీణ్ సూద్ భార్య వినీతా సూద్ సామాజిక వ్యాపారవేత్త. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది.[6]
నిర్వహించిన భాద్యతలు
[మార్చు]- పోలీసు సూపరింటెండెంట్, మైసూర్-1989
- మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారు-1999
- మైసూర్ పోలీస్ కమిషనర్- 2004 నుండి 2007 వరకు
- కమీషనర్ ఆఫ్ పోలీస్, బెంగుళూరు - ఫిబ్రవరి 2008లో, సెప్టెంబరు 2011
- అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంప్యూటర్ వింగ్
- కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ - 2013 నుండి 2014 వరకు
- హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
- డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్
బెంగుళూరు నగర పోలీసు కమిషనర్‌గా, ఆపదలో ఉన్న పౌరుల కోసం “అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ”ని “ నమ్మ 100 ” ప్రారంభించాడు. బహుభాషా "కమ్యూనికేషన్ ఆఫీసర్లు" 24 X 7 ద్వారా నిర్వహించబడే 100 హెల్ప్ లైన్, 276 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ (హొయసల) మద్దతుతో బెంగళూరు నగరం అంతటా వ్యాపించింది. ప్రతి కాల్‌ను 15 సెకన్లలో పికప్ చేస్తానని, 15 నిమిషాల్లో " హొయసల " సందర్శిస్తానని వాగ్దానం చేశాడు. "నమ్మ-100" లేదా "మై-100" ప్రారంభించిన 3 నెలల్లోనే సగటున 5 సెకన్లు, సగటు ప్రతిస్పందన సమయం 17 నిమిషాలతో సగటున రోజుకు 6000 కాల్‌లను స్వీకరిస్తోంది.
ముఖ్యంగా ఆపదలో ఉన్న మహిళలు, పిల్లల కోసం మహిళా పోలీసులచే నిర్వహించబడే “ సురక్ష ” యాప్ , “ పింక్ హొయసలా ” ప్రారంభించడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
- ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ & ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, (పోలీస్ ఫోర్స్ హెడ్) కర్ణాటకగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అవార్డులు
[మార్చు]- 1996లో సేవలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు చీఫ్ మినిస్టర్స్ గోల్డ్ మెడల్
- 2002లో మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీస్ మెడల్
- 2011లో విశిష్ట సేవకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్[7]
- 2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు
- నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ Bureau, The Hindu (2023-05-14). "Karnataka DGP Praveen Sood appointed as CBI Director". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-05-15.
- ↑ "Who is new CBI chief Praveen Sood and what's his history with DK Shivakumar?". Business Today. 2023-05-14. Retrieved 2023-05-15.
- ↑ "Praveen Sood takes over as new CBI Director". www.thehindubusinessline.com. 2023-05-25. Retrieved 2023-05-25.
- ↑ "Praveen Sood, DG & IGP: Profile and Wiki". trendyprofile.blogspot.com. Retrieved 2023-05-15.[permanent dead link]
- ↑ "About ← Praveen Sood". Retrieved 2023-05-15.
- ↑ "Meet Mayank Agarwal's wife Aashita Sood; daughter of Karnataka DGP Praveen Sood". DNA India. Retrieved 2023-05-15.
- ↑ "About ← Praveen Sood". Retrieved 2023-05-15.