Jump to content

ప్రభల తీర్థం (ఆంధ్రప్రదేశ్ శకటం)

వికీపీడియా నుండి
పొలాలమద్యలో నుండి ప్రభలను భక్తులు భుజాలపై మోసుకొనుచూ వెళ్లిన దృశ్యచిత్రం

ప్రభల తీర్థం (ఆంధ్రప్రదేశ్ శకటం), 2023 జనవరి 26న న్యూడిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ఉత్సవ శకటం. జగ్గన్నతోట ప్రభల తీర్థం అనే పేరుతో ఈ ఉత్సవాలు కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్న కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం అత్యంత ప్రాచీనమైంది.కోనసీమ చుట్టుపక్కనున్న 90 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు. జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు.[1]

చరిత్ర

[మార్చు]
పొలాలమద్యలో నుండి కాలువలో ప్రభలను భక్తులు భుజాలపై జగ్గన్నతోటకు తీసుకువెల్ళుచున్న దృశ్య చిత్రం.

ఇవి 2020 నాటికి సుమారు 400 ఏళ్లకు పైనుండి కొనసాగుతున్నాయి.[2] ప్రభల తీర్థంలో భక్తులు లక్షలాదిగా చుట్టుపక్కల గ్రామాల నుండి పాల్గొంటారు. ఈ ఉత్సవంలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసుల భారీ బందోబస్తు నిర్వహిస్తారు. 11 గ్రామాల భక్తులు భారీ ప్రభలను భుజాలపై మోసుకువస్తారు. ఏకాదశ రుద్రుల కొలువైన ప్రదేశంగా జగ్గన్నతోట ప్రసిద్ధి చెందింది. కౌశిక నదిని దాటి గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు వస్తాయి.

అరుదైన గుర్తింపు

[మార్చు]

2022 జనవరి 26న ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరుపున మొదటిసారిగా పాల్గొన్న శకటం అందరిని దృష్టిని ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఎర్రకోట వరకు సాగిన త్రివిద దళాల సైనిక కవాతులు, కేంద్ర, రాష్ట్ర శకటాల ప్రదర్శనలు, వైమానిక విన్యాసాలు ఉత్సవంలో 17 రాష్ట్రాలు, 6 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించారు. దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశాలు దక్కాయి. ప్రభల తీర్థం సంస్కృతితో ఏపీ శకటాన్ని తీర్చి దిద్దారు. ప్రభల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడంపై కోనసీమ జిల్లా, అంబాజిపేట మండలం గంగకులకూరు అగ్రహారం గ్రామస్తులు ఆనందం వ్యక్తపరచారు.ఈ సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞత తెలిపారు. [3]

మూలాలు

[మార్చు]
  1. "అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం". Sakshi. 2020-01-17. Archived from the original on 2020-01-17. Retrieved 2020-01-18.
  2. Garimella, Kesavudu (2023-01-16). "Prabhala Teertham celebrates in Konaseema". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-26.
  3. https://web.archive.org/web/20230126154751/https://www.sakshi.com/telugu-news/sakshi-special/story-konaseema-prabhala-theertham-selected-republic-day-parade-delhi

వెలుపలి లంకెలు

[మార్చు]