Jump to content

ప్రబంధ కల్పవల్లి

వికీపీడియా నుండి

ప్రబంధ కల్పవల్లి 1880 - 1882 మధ్యకాలంలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి ప్రకటింపబడిన మాస పత్రిక.[1] దీనికి గురజాడ శ్రీరామమూర్తి సంపాదకుడు. ఆయన కాకినాడ నుంచి రాజయోగి పత్రికను ప్రారంభించాడు.

వీరేశలింగం కంటే ముందే గురుజాడ శ్రీరామమూర్తి, ఆంధ్రకవుల జీవితాల్ని రచించి 1876 వ సంవత్సరంలోనే ప్రచురించారు. పెద్దాపురంనుండి ప్రకటింపబడే " శ్రీ ప్రబంధ కల్పవల్లి " అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. కవుల జీవితరచనలో ఆయన కాలక్రమాన్ని పాటించలేదు. భారతాంధ్ర కవులు-రామాయణాంధ్రకవులు-ఆంధ్రపంచకావ్యకవులు- ఇత్యాదిగా విభాగించి రచించారు. ఆ కవుల జీవితరచన సమగ్రంగా లేక జనశ్రుతిలోని కధలతో గాథలతో నిండి ఉంది. అయినా గురజాడ శ్రీరామమూర్తి కవి జీవితాలు శ్రీవీరేశలింగంగారి కవులచరిత్ర రచనకు ప్రేరకమని చెప్పవచ్చు.

ఈ పత్రిక ప్రధాన లక్ష్యం ప్రాచీన ప్రబంధాల్ని ప్రచురించడం. మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌ వంటి ఇంగ్లీషు నాటకాల్ని తెలుగులోకి అనువాదం చేసి ఈ పత్రికలో ప్రచురించారు. సకలవిద్యాభివర్ధని లోను, సుజనరంజని లోనూ కవిజీవితాలు ప్రారంభమైనప్పటికీ, అవి రెండు మూడిటి తోనే ఆగిపోయాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. Mitchell, Lisa (2009). Language, Emotion, and Politics in South India: The Making of a Mother Tongue. Indiana University Press. ISBN 0253353017.
  2. వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 22.