ప్రపంచ హృదయ దినోత్సవం
Jump to navigation
Jump to search
ప్రపంచ హృదయ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | అంతర్జాతీయంగా |
ప్రారంభం | సెప్టెంబరు 29 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవమును ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొంటారు.[1]
చరిత్ర
[మార్చు]గుండెపోటు, గుండె జబ్బులను నివారించడంకోసం 1946లో జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపాడు. అలా 2000 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది.[2] 2010 వరకు సెప్టెంబరు నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ఈ దినోత్సవం, 2011వ సంవత్సరం నుంచి సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించబడుతోంది.[3]
కార్యక్రమాలు
[మార్చు]- గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన కలిగించడం మొదలైన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రచారం చేస్తారు.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ,వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా దాదాపు 100 దేశాలలో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటుచేసి వాటిద్వారా ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం, నడక పరుగులకు సందబంధించిన ఆటలు ఆడించడం, బహిరంగ చర్చలు సైన్స్ ఫోరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు మొదలైనవి గుండె ఆరోగ్యం, ఇతరుల బాధ్యతలను స్వీకరించే కార్యకలాపాల్లో పాల్గొంటాయి. ఈ ప్రచారం ద్వారా అన్ని దేశాల ప్రజలను ఏకంచేసి, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కార్యక్రమాలను నడిపిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, వార్తలు (27 September 2019). "గుండె జబ్బులు పై అవగహన అవసరం". www.prajasakti.com. Archived from the original on 28 సెప్టెంబరు 2019. Retrieved 7 July 2020.
- ↑ "World heart day 2014: salt reduction saves lives". Central European Journal of Public Health. 22 (3): 206. September 2014. PMID 25438401.
- ↑ వార్త, చెలి (28 September 2019). "వరల్డ్ హార్ట్ డే: గుండె పనితీరు పదిలం". Vaartha. Archived from the original on 3 October 2019. Retrieved 7 July 2020.