ప్రపంచ రక్త దాతల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ రక్త దాతల దినోత్సవం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం
రక్తదానం చేస్తున్న దాతలు
జరుపుకొనే రోజుజూన్ 14
ఆవృత్తివార్షికం
అనుకూలనం14 జూన్ 2020

ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌14న నిర్వహిస్తున్నారు.[1]

చరిత్ర

[మార్చు]

1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్‌ విజేత కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించాయి.

ర‌క్త‌దానం

[మార్చు]

రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదు. అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. 18 సంవత్సరాలు నుండి 55ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ‘ఓ’ గ్రూప్‌రక్తం కలిగిన వారిని విశ్వదాత అని, ‘ఏబీ’. గ్రూపుల రక్తం కలిగినవారిని విశ్వగ్రహీత అని అంటారు.

రక్తదానం అపోహలు-వాస్తవాలు

[మార్చు]
  • రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు.ఎప్పటిలా ఆరోగ్యంగా ఉంటారు.
  • శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత యధావిధిగా అన్నిరకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.
  • రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు.
  • రక్తదానం వల్ల ఎయిడ్స్‌ సంక్రమించవచ్చు అని ఒక అపోహ ఉంది. వాస్తవానికి రక్తదానం పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన పద్దతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా జరుగుతుంది.

ఇంకా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "World Blood Donor Day 2020". www.who.int (in ఇంగ్లీష్). Retrieved 2020-06-14.