ప్రపంచ మత్స్య దినోత్సవం
స్వరూపం
ప్రపంచ మత్స్య దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | నవంబరు 21 |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదేరోజు |
ప్రపంచ మత్స్య దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా జరుపబడుతోంది.[1] మత్స్యకారులకు గుర్తింపును అందించడంకోసం, మత్స్య పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతో ఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియపరచడానికి మత్స్యకార సంఘాలు ఈ దినోత్సవం నిర్వహిస్తాయి.[2]
ప్రారంభం
[మార్చు]1997లో న్యూఢిల్లీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్య్సకారులు, వ్యాపారస్తులు సమవేశమై దీనిపై సుదీర్షంగా చర్చించారు. 1998లో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో పాల్గొన్న అన్ని దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రతి సంవత్సం నవంబరు 21ని ప్రపంచ మత్య్స దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆ సదస్సు వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలుపునిచ్చాడు. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఆమోదించి, నవంబరు 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.[3]
కార్యకలాపాలు
[మార్చు]- ఈ రోజున బైక్ ర్యాలీలు, కార్ల మార్చిల నిర్వహిస్తారు.
- మత్స్యకారులు వారి స్వంత ప్రత్యేకమైన, విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి నృత్యం, పాటల, నాటక ప్రదర్శనలు చేస్తారు.
- సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి ఓవర్ ఫిషింగ్, యాంత్రీకరణ వంటి సమస్యలను హైలైట్ చేయడంతోపాటు ప్రపంచంలోని మత్స్య సంపదను కాపాడుకునే విధంగా తీసుకోవలసిన చర్యల గురించి, ప్రపంచ పర్యావరణం ఎదుర్కొంటున్న, వాతారవణంలో పెరుగుతున్న సమస్యల మీద ఈ చర్చలు జరుపుతారు.
మూలాలు
[మార్చు]- ↑ "మత్స్యజాతులకు కాలుష్యం కాటు". EENADU. 2022-11-21. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
- ↑ ABN (2022-11-21). "World Fisheries Day: భారత్ ప్రస్తుతం చేపల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉందంటే..." Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.
- ↑ "ఇవాళ ప్రపంచ మత్య్స దినోత్సవం". Samayam Telugu. 2015-11-25. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.