Jump to content

ప్రపంచ నిద్ర దినోత్సవం

వికీపీడియా నుండి
ప్రపంచ నిద్ర దినోత్సవం
యితర పేర్లునిద్ర దినోత్సవం
జరుపుకొనేవారువరల్డ్ స్లీప్ డే కమిటీ
ప్రారంభం2008; 16 సంవత్సరాల క్రితం (2008)
జరుపుకొనే రోజుమార్చి 3వ శుక్రవారం
ఉత్సవాలుప్రపంచవ్యాప్తంగా
ఆవృత్తివార్షికం
చిన్న పిల్లవాడు నిద్ర పోవడం

ప్రపంచ నిద్ర దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి నెల మాడవ శుక్రవారం నాడు జరుపబడుతోంది. వరల్డ్ స్లీప్ సొసైటీకి చెందిన వరల్డ్ స్లీప్ డే కమిటీ (వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ స్లీప్ మెడిసిన్)[1] ఆధ్వర్యంలో 2008 నుండి ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపడం, నిద్ర సమస్యల భారం, వైద్య, విద్యా, సామాజిక అంశాలపై సమాజం దృష్టిని ఆకర్షించడం, నిద్ర రుగ్మతల నివారణ, నిర్వహణను ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

విమర్శ

[మార్చు]
పెంపుడు జంతువు నిద్ర పోవడం

2017, మార్చి 17న ఈ ప్రపంచ నిద్ర దినోత్సవం గురించి ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అయ్యింది. భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ 'రేపు, మార్చి 17న ప్రపంచ నిద్ర దినోత్సవం' అని ట్వీట్ చేశాడు.[2] నిద్ర అవసరం గురించి తెలియజేయడానికి ఇది సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ఒకే నిద్రను ఆశించాలనే ఆలోచనను ముందుకు తెస్తున్నారని విమర్శించారు. ఈ ఆలోచన ఇటీవలి ఆవిష్కరణ అని చరిత్రకారులు చెబుతున్నారు.[3]

వార్షిక వేడుక

[మార్చు]

ప్రతి సంవత్సరం మార్చి ఈక్వినాక్స్ కి ముందువచ్చే (మూడవ) శుక్రవారం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.[4] 2008, మార్చి 14న మొదటి ప్రపంచ నిద్ర దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలు, సమావేశాలు, ప్రదర్శనలు, ఆన్‌లైన్‌ కార్యక్రమాలు జరుగుతాయి.

సంవత్సరం తేదీ నినాదం
2008 14 మార్చి 'బాగా నిద్రపోండి, పూర్తిగా మేల్కొని జీవించండి'
2009 20 మార్చి 'డ్రైవ్ హెచ్చరిక, సురక్షితంగా చేరుకోండి'[5]
2010 19 మార్చి 'బాగా నిద్రపోండి, ఆరోగ్యంగా ఉండండి'[6]
2011 18 మార్చి 'బాగా నిద్రపోండి, ఆరోగ్యంగా పెరగండి'[7]
2012 16 మార్చి 'సులభంగా ఊపిరి పీల్చండి, బాగా నిద్రపోండి'[8]
2013 15 మార్చి 'మంచి నిద్ర, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం'
2014 14 మార్చి 'రెస్ట్‌ఫుల్ స్లీప్, ఈజీ బ్రీతింగ్, హెల్తీ బాడీ'
2015 13 మార్చి 'నిద్ర బాగా ఉన్నప్పుడే, ఆరోగ్యం, ఆనందం పుష్కలంగా ఉంటాయి'
2016 18 మార్చి 'మంచి నిద్ర అనేది చేరుకోగల కల'
2017 17 మార్చి 'బాగా నిద్రపోండి, జీవితాన్ని పెంచుకోండి'
2018 16 మార్చి 'స్లీప్ వరల్డ్‌లో చేరండి, జీవితాన్ని ఆస్వాదించడానికి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి'
2019 15 మార్చి 'ఆరోగ్యకరమైన నిద్ర, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం'
2020 13 మార్చి 'బెటర్ స్లీప్, బెటర్ లైఫ్, బెటర్ ప్లానెట్'[9]
2021 19 మార్చి 'రెగ్యులర్ స్లీప్, హెల్తీ ఫ్యూచర్'
2022 18 మార్చి 'క్వాలిటీ స్లీప్, సౌండ్ మైండ్, హ్యాపీ వరల్డ్'
2023 17 మార్చి ' ఆరోగ్యానికి నిద్ర చాల అవసరం ' (స్లీప్ ఈస్ ఎసెన్సియల్ ఫార్ హెల్త్)

అవసరం

[మార్చు]

మనిషికి సుఖ వంత మైన నిద్ర అంటే ప్రశాంతముగా కనీసం 7 గంటలు  నిద్ర లేకుంటే ప్రశాంతంగా ఉండక పోవడం, శరీర ఆనారోగ్యం కావడం, చికాకుగా ఉండటం, గుండె జబ్బులు, ఊబకాయాన్ని మనిషి దగ్గర అవుతాడు అని పరిశోధకులు పేర్కొంటారు. నిద్ర అవసరం, ప్రాముఖ్యత గురించి కొంత మంది మహనీయులైన వారు చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి[10].

  • "మనిషి నిద్రపోయే ముందు తన కోపాన్ని మరచిపోవాలి." - మహాత్మా గాంధీ
  • 'నిద్ర ఉత్తమ ధ్యానం'- దలైలామా
  • "మీ భవిష్యత్తు మీ కలలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి నిద్రపోండి." - మెసుట్ బరాజానీ
  • "నిద్రలో మునిగిపోయిన ఆత్మ కూడా పనిలో కష్టపడి పనిచేస్తుంది,ప్రపంచంలో ఏదో చేయడానికి సహాయపడుతుంది." - హెరాక్లిటస్


2023 ప్రపంచ నిద్ర దినోత్సవం నినాదం లో 'ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం'. నిద్ర ఒక్కటే గాక ప్రజలు మంచి ఆరోగ్యకరమైన పదార్థాలను తినడం, వ్యాయామం చేయడం వంటి శారీరక, మానసిక,సామాజిక శ్రేయస్సు కొరకు నిద్ర ప్రాముఖ్యతను ఈ నినాదం చెబుతుంది. ప్రజలకు నిద్ర,ఆరోగ్యం , ప్రశాంతత అవగాహన పెంచడానికి అనేక మంది నిద్ర ఆరోగ్య నిపుణులు, మేధావులు వారి అభిప్రాయాలు తెలియచేయడానికి ఈ రోజు ఒక వేదిక గా నిలుస్తుంది అని చెప్పవచ్చు [11].


మూలాలు

[మార్చు]
  1. World Sleep Day, accessed 19 March 2011
  2. Twitter @SrBachchan
  3. "Why the sleep industry is keeping us awake at night". Guardian. 9 March 2019. Retrieved 21 April 2019.
  4. "Good Sleep is a Reachable Dream". Retrieved 2016-03-17.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-22. Retrieved 2021-03-19.
  6. "March 19 2010 is Third Annual World Sleep Day". Thaindian News. Archived from the original on 2019-02-26. Retrieved 2021-03-19.
  7. "Philips official sponsor of World Sleep Day 2011". March 18, 2011. Archived from the original on 2021-04-22. Retrieved 2021-03-19.
  8. "World Sleep Day® is March 15, 2019".
  9. "World Sleep Day 2015 toolkit" (PDF). Retrieved 2020-03-12.
  10. Singh, Shivangani (2022-03-17). "World Sleep Day 2022: Theme, Quotes, and Posters". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2023-03-16.
  11. "World Sleep Day 2023: Theme, History, Significance and Quotes to Share". News18 (in ఇంగ్లీష్). 2023-03-16. Retrieved 2023-03-16.