ప్రధానమంత్రి ముద్రా యోజన
స్వరూపం
తుట్ట తుది మైలులో ఉన్న ఫైనాన్సర్లకు తిరిగి రిఫైనల్స్ చేసేందుకు మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రిఫైనల్స్ ఏజెన్సీ (MUDRA) ని 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో భర్త కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది[1]. దీనికి అనుగుణంగా 2015 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం రూ. 10 లక్షల వరకు గల రుణ అవసరాల కోసం రీ ఫైనాన్స్ ఉత్పత్తులను అందజేస్తుంది[2]. ప్రీ ఫైనాన్స ద్వారా మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సహకారం అందిస్తుంది. పీఎంఎంవై పథకం ద్వారా రూపొందించిన ఉత్పత్తులను సూక్ష్మ వ్యాపార యూనిట్ల వృద్ధి/ అభివృద్ధి దశల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు[3].
- శిశు ( రూ.50,000 వరకు రుణం)
- కిశోర్ ( రూ.50,000 నుండి రూ. 5 లక్షల వరకు రుణం)
- తరుణ్ ( రూ. 5 లక్షల నుండి రూ. పదిలక్షల వరకు)
- ఈ పథకం కింద కేటాయించే నిధుల్లో సుమారు 60 శాతం శిశు రుణాల కింద ఇవ్వడం జరుగుతుంది. దేశంలో సంప్రదాయ రంగంలో ఉన్న సూక్ష్మ పరిశ్రమకవేత్తలకు, వర్తమాన సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు బ్యాంకు పరపతిని అందించడమే ప్రధానమంత్రి ముద్ర యోజన లక్ష్యం. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద గత ఎనిమిది సంవత్సరాల్లో 40.2 కోట్ల ఖాతాలకు రూ. 23.2 లక్షల కోట్లు హామీలని రుణాలు అందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది[4]. ఈ పథకం ప్రకారం 40.82 కోట్ల రుణ ఖాతాల్లో 60 శాతం మహిళలవే. అందులోనూ 51% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలవారు. దీన్నిబట్టి అట్టడుగు వర్గాలకు బ్యాంకుల ద్వారా సంస్థ గత రుణాలు సులభంగా అందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది.
- ఈ పథకం కింద కేటాయించే నిధులలో సుమారు 60 శాతం శిశు రుణాల కింద ఇవ్వడం జరుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ Lenkala, Praveen Kumar. "PM Mudra Yojana | ముద్ర యోజన రుణం ఎంతిస్తారు? ఎలా పొందాలి? ఎవరు అర్హులు?". Hindustantimes Telugu. Retrieved 2024-01-22.
- ↑ "పీఎం ముద్రా స్కీమ్.. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం.. ఇలా అప్లై చేసుకోండి.. అర్హతలివే!". Samayam Telugu. Retrieved 2024-01-22.
- ↑ "PMMY:వ్యాపారం చేసుకునేందుకు లోన్ కావాలా? ప్రధాన మంత్రి ముద్రా యోజన వివరాలు మీకోసం." News18 తెలుగు. 2023-12-15. Retrieved 2024-01-22.
- ↑ "PM Mudra Yojana : ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 23.2 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసిన బ్యాంకులు." The Economic Times Telugu. Retrieved 2024-01-22.