Jump to content

ప్రత్యూష్, మిహిర్

వికీపీడియా నుండి

 

ప్రత్యూష్, మిహిర్
క్రియాశీలకమైన తేదీ2018 జనవరి 8
ప్రదేశంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, పుణే
నేషనల్ సెంటర్ ఫర్ మీడీయం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్, నోయిడా
వేగం6.8 పెటాఫ్లాప్స్[1]
ఖర్చురూ. 438.9 కోట్లు
ప్రయోజనంవాతావరణ అంచనా, శీటోష్ణస్థితి పరిశోధన

ప్రత్యూష్, మిహిర్ అనేవి పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM), నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (NCMRWF)లో స్థాపించబడిన సూపర్ కంప్యూటర్‌లు. 438.9 కోట్ల ఖర్చైన ప్రత్యూష్, మిహిర్‌లు 2018 జనవరి నాటికి 6.8 పెటాఫ్లాప్‌ల గరిష్ట వేగంతో, భారతదేశంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు. [2] ఈ వ్యవస్థను 2018 జనవరి 8 న కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించాడు.[2] [1] [3] [4]

హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) వ్యవస్థ అయిన ప్రత్యూష్ మిహిర్‌లు సంయుక్తంగా 6.8 పెటాఫ్లాప్స్ గరిష్ట శక్తిని అందించగల అనేక కంప్యూటర్‌ల వ్యవస్థ.[note 1] ప్రత్యూష్ సామర్థ్యం 4 పెటాఫ్లాప్స్ కాగా మిహిర్ సామర్థ్యం 2.8 పెటాఫ్లాప్స్ ఇది భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన మొట్టమొదటి బహుళ-పెటాఫ్లాప్స్ వేగం కలిగిన సూపర్‌కంప్యూటర్.[4]

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (HPC) సామర్థ్యం 2008లో 40 టెరాఫ్లాప్‌లు ఉండగా, అది 2013-14 సంవత్సరానికి 1 పెటాఫ్లాప్‌కు పెరిగింది.[4] అయితే ప్రపంచంలోని HPC మౌలిక సదుపాయాల ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పటికీ తక్కువ స్థానంలోనే ఉంది.[4]

10 పెటాఫ్లాప్‌ల కంప్యూటింగ్ సామర్థ్యంతో సూపర్‌కంప్యూటర్‌ను రూపొందించడానికి భారత ప్రభుత్వం 2017లో 400 కోట్ల రూపాయల బడ్జెట్టును ఆమోదించింది.[1] పూణేలోని IITM ఇంజనీర్లు సూర్యచంద్ర ఎ రావు నాయకత్వంలో పనిచేసి 2018లో ప్రత్యూషను నిర్మించారు.[5] మొత్తం ఖర్చు సుమారు 450 కోట్ల రూపాయలు.[4]

ప్రత్యూష్, మిహిర్‌లను ప్రవేశపెట్టడంతో, ప్రపంచంలోని టాప్ 500 సూపర్ కంప్యూటర్‌ల జాబితాలో 165వ స్థానం నుండి టాప్ 30ల లోకి ఎదగాలని భారతదేశం భావిస్తోంది. [6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. PetaFlops is a measure of computing capacity of a system. One PetaFlops is 1000 trillion floating point operations per second.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "India unveils Pratyush, its fastest supercomputer yet". The Hindu. 2018-01-08. Archived from the original on 2018-01-26. Retrieved 2018-01-26.
  2. 2.0 2.1 "High Performance Computing (HPC) Systems Pratyush and Mihir". pib.nic.in. Retrieved 2018-06-27.
  3. "India's fastest supercomputer 'Pratyush' established at Pune's IITM". The Indian Express. 2018-01-09. Archived from the original on 2018-01-26. Retrieved 2018-01-26.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Pratyush launched as India's fastest supercomputer yet". The Financial Express (India). 2018-01-09. Archived from the original on 2018-01-26. Retrieved 2018-01-26.
  5. "Supercomputer Pratyush HPC to boost India's rankings, forecast weather faster". The Hindustan Times. 2018-01-08. Archived from the original on 2018-01-26. Retrieved 2018-01-26.
  6. "India sets up its fastest supercomputer Pratyush at Pune's IITM". India Today. 2018-01-09. Archived from the original on 2018-01-26. Retrieved 2018-01-26.