Jump to content

ప్రతిమా బాగ్రి

వికీపీడియా నుండి
ప్రతిమా బాగ్రి

పదవీ కాలం
2023 డిసెంబరు 25 – ప్రస్తుతం

పదవీ కాలం
2023 డిసెంబరు 3 – ప్రస్తుతం
ముందు కల్పన వర్మ
నియోజకవర్గం రాయగావ్

వ్యక్తిగత వివరాలు

జననం 1988
నాగోడ్, మధ్యప్రదేశ్
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జై ప్రతాప్ బాగ్రి
నివాసం మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి బ్యాచిలర్ ఆఫ్ లాస్, అవధేష్ ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకురాలు

ప్రతిమా బాగ్రి (జననం 1988) మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు 2023 శాసనసభ ఎన్నికలలో రాయగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[1] 2023 డిసెంబరు 25న మోహన్ యాదవ్ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతిమా బాగ్రి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2017 నుండి 2020 వరకు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ తర్వాత బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2021లో రాయ్‌గావ్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కల్పన వర్మ చేతిలో 12,290 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[2][3][4]

ప్రతిమా బాగ్రి 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాయగావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కల్పన వర్మపై 36,060 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5] ఆమె 77,626 ఓట్లతో విజేతగా నిలవగా, కల్పన వర్మ 41,566 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది.[6][7] ప్రతిమా బాగ్రి 2023 డిసెంబరు 25న మోహన్ యాదవ్ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[8][9]

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. "Raigaon assembly bypoll Result 2021". Election Commission of India. 2 November 2021. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  3. "Madhya Pradesh by-election results 2021: BJP wins Khandwa LS seat, Jobat, Prithvipur Assembly seats; Raigaon goes to Congress" (in ఇంగ్లీష్). Times Now. 2 November 2021. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  4. "Madhya Pradesh: BJP retains Khandwa LS seat with low margin, wrests 2 assembly segments; Congress wins 1" (in ఇంగ్లీష్). The New Indian Express. 2 November 2021. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  5. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  6. "MadhyaPradesh Assembly Election Results 2023 - Raigaon". Election Commission of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  7. "Raigaon Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  8. "जानिए कौन हैं MP की नई राज्यमंत्री प्रतिमा बागरी? दिलचस्प है इनकी सियासी कहानी". NDTV. 25 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.
  9. "Madhya Pradesh Chief Minister allocates portfolios, keeps Home | Full list here" (in ఇంగ్లీష్). India Today. 31 December 2023. Archived from the original on 5 March 2025. Retrieved 5 March 2025.