ప్రజా శక్తి (సినిమా)
స్వరూపం
ప్రజా శక్తి (1983 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | మాదాల రంగారావు |
తారాగణం | మాదాల రంగారావు, కె.విజయ |
నిర్మాణ సంస్థ | నవతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
ప్రజాశక్తి 1983 మార్చి 18న విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను మాదాల రంగారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. మాదాల రంగారావు, కె.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
కథ
[మార్చు]ఇతివృత్తం నిరుపేద రైతు కూలీలకు సంబంధించినది. దేవుడు మామయ్య ఆ ఊరికి పెత్తందారీ. ఆ ఊరి దేవాలయం ధర్మకర్త. ఆ ఆలయానికున్న వెయ్యి ఎకరాల పొలాన్ని ఏళ్ళ తరబడిగా అనుభవిస్తుంటాడు. రైతు కూలీలను అజ్ఞానాంధకారంలో బంధించి వారి శ్రమను దోచుకుంటూంటాడు. ఆ ఊళ్ళో చదువుకున్న ఒకే ఒక యువకుడిని (మాదాల రంగారావు) పిచ్చివాడుగా ముద్రవేసి తన పబ్బం గడుపుకుంటాడు. ఐతే ఆ యువకుడికి ప్రజావైద్య శాలను తెరచిన ఒక డాక్టరు, ఆ ఊరికి బదిలీపై వచ్చిన గ్రామసేవిక తోడై రైతు కూలీల కళ్ళు తెరిపించడం.. అన్యాయాలకు, అక్రమాలకు భరతం పట్టించడం తక్కిన కథా సారాంశం.
నటీనటులు
[మార్చు]- మాదాల రంగారావు
- కె.విజయ
- సురేఖ
- నర్రా వెంకటేశ్వరరావు
- చలపతిరావు
- పి.జె.శర్మ
- బీరం నవీన లక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ : మాదాల రంగారావు
- మాటలు: యం.జి.రామారావు
- పాటలు: శ్రీశ్రీ, శ్రీకాంత్, గజ్జెల మల్లారెడ్డి, అదృష్ట దీపక్, జి.యస్.జుబ్బారావు
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఆర్. రామారావు
- నిర్మాణం: మాదాల రంగారావు
- దర్శకత్వం: నవతరం
పాటలు
[మార్చు]- అంబ రావే జగదంబ రావే అంబ రావే - ఎస్.పి. బాలు
- దేవుడంట దేవుడంట దేవుడంటరో వాడున్న - ఎస్.పి. బాలు
- పిలిచింది నేలతల్లి చల్లని కన్నతల్లి - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం
- ప్రజాశక్తి ప్రజాశక్తి ప్రజాశక్తి కదిలింది దగాపడిన - ఎస్.పి. బాలు బృందం
- మారిపోతుందోయి కాలం మారిపోతుంది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ
- మాలన్న మాదిగన్న కుమ్మరన్న కమ్మరన్న - ఎస్.పి. బాలు
మూలాలు
[మార్చు]- ↑ "Praja Shakthi (1983)". Indiancine.ma. Retrieved 2021-05-31.