ప్రజామిత్ర
సంపాదకులు | గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
తరచుదనం | వారపత్రిక |
మొదటి సంచిక | 1933 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
ప్రజామిత్ర గూడవల్లి రామబ్రహ్మం సంపాదకత్వంలో వెలువడిన సచిత్రవారపత్రిక. మొదట ఇది విజయవాడలో ప్రారంభమై కొద్ది రోజులకే మద్రాసుకు తరలి వెళ్ళింది. 1933లో స్థాపించబడింది. సాలు చందా 3 రూపాయలు.
విశేషాలు
[మార్చు]ఈ పత్రిక సుమారు పది సంవత్సరాలు నడిచింది. దీనిలో సముద్రాల రాఘవాచార్య, ముద్దా విశ్వనాథం, ఏడిద కామేశ్వరరావు మొదలైనవారు పనిచేశారు. ఈ పత్రికలో రచనలు చేసిన వారిలో బుక్కపట్నం రాఘవాచార్యులు, గుత్తికొండ నరహరి, నందగిరి ఇందిరాదేవి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, నార్ల వెంకటేశ్వరరావు, దిగవల్లి వేంకటశివరావు, తాపీ ధర్మారావు, కపిల కాశీపతి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, బి.టి.రాఘవాచార్యులు, కొసరాజు రాఘవయ్య చౌదరి, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఏజెళ్ళ శ్రీరాములు చౌదరి, ఏటుకూరి వెంకట నరసయ్య, వేలూరి శివరామశాస్త్రి, పట్టాభి సీతారామయ్య వంటి ప్రముఖ రచయితలున్నారు.
అభిప్రాయాలు
[మార్చు]ప్రజామిత్ర వారపత్రిక గురించి ఆంధ్రభూమి మాసపత్రిక ఈ క్రింది విధంగా సమీక్షించింది.[1]
తెలుగువారి తిలకనగరమగు బెజవాడలో పుట్టువు గన్నది. మండల ప్రజలను మహనీయముగ సేవించినది. రాజధాని తిలకనగరమగు చెన్నపురి జేరినది. ఆకృతిని విస్తరించినది; ఆశయములను విశాలపఱచినది. రాజుగారి ధనమునకు; రామబ్రహ్మముగారి సామర్థ్యమునకు; ఆంగ్ల విద్యాధికులు, జర్నలిజములో జానైన అనుభవమును సంపాదించిన ఆంధ్ర యువకులు అగు లక్ష్మీనరసయ్యగారి ఆలోచనా బలమును తోడుచేసికొని ప్రజామిత్ర పరిపుష్టినొంది ఆంధ్రులకు సచిత్రవారపత్రిక లేని లోపమును దీర్చివైచినది. అంతర్జాతీయ విషయములకు ప్రాధాన్యమిచ్చుచు ఈ పత్రిక తెలుగువారిలో విశేష విజ్ఞానవ్యాప్తికి తోడుపడుచున్నది. వయస్సున పిన్నయే యయ్యును ప్రజామిత్రతో దొరయుసాటి వారపత్రిక తెలుగున మఱియొకటి లేదనుట పొగడిచెప్పుట గాదు. రుచి విస్తృతిగల ఇట్టి పత్రికలవలన తెలుగువారిలో పత్రికాపఠాభిలాష పెంపొందగలదు. మహరాష్ట్రులకు 'కేసరి' వలె, అరవవారికి 'ఆనంద బోధిని'వలె ఆంధ్రులకు 'ప్రజామిత్ర' గర్వించదగిన పత్రిక కాగలదు.
మూలాలు
[మార్చు]- ↑ ఆండ్ర శేషగిరిరావు (1 March 1934). "ఆంధ్రభూమి పుస్తకపీఠము". ఆంధ్రభూమి మాసపత్రిక. 1 (10): 365-366. Retrieved 28 February 2025.