ప్రగ్యా నయన్
స్వరూపం
ప్రగ్యా నయన్ | |
---|---|
జననం | జార్ఖండ్ | 1998 ఆగస్టు 17
జాతీయత | ఇండియన్ |
ఇతర పేర్లు | ప్రజ్ఞా |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2018 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
ప్రగ్యా నయన్ (జననం 1998 ఆగస్టు 17) భారతీయ మోడల్, నటి. ఆమె కన్నడ, తెలుగు చలనచిత్రాలలో ప్రధానంగా నటిస్తుంది.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆమె 1998 ఆగస్టు 17న జార్ఖండ్‌లోని గిరిదిహ్లో జన్మించింది. అయినా ఆమె బెంగళూరులో పెరిగింది. తన పాఠశాల విద్య బి.ఎన్.ఎస్ డిఏవి స్కూల్ లో కొనసాగింది. పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి తన బ్యాచిలర్స్ అలాగే మాస్టర్స్ డిగ్రీని పొందింది.
కెరీర్
[మార్చు]చదువు పూర్తికాగానే ఒక ఐటీ సంస్థలో పని చేసేది, కానీ ఆమె దృష్టి మోడలింగ్‌పై మళ్ళింది. అలాగే తక్కువకాలంలోనే నటనపై ఆసక్తిచూపింది. ఆమె 2018 కన్నడ చిత్రం ఎస్కేప్‌తో అరంగేట్రం చేసింది.[1] ఆమె ఒడియా. హిందీ వంటి ఇతర భాషా చిత్రాలలో కూడా నటించింది.
తెలుగులో 2022లో వచ్చిన సురాపానం, సమరం (2019), ఇన్ సెక్యూర్, మ్యాచ్ ఫిక్సింగ్, కళింగ తదితర చిత్రాలలో నటించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Pragya Nayan Says I Want To Act With Vijay Deverakonda - Sakshi". web.archive.org. 2023-05-07. Archived from the original on 2023-05-07. Retrieved 2023-05-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ఈటీవీ విన్లో మ్యాచ్ ఫిక్సింగ్ |". web.archive.org. 2023-05-07. Archived from the original on 2023-05-07. Retrieved 2023-05-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)