ప్రకృతి - వికృతి
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది.
ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది.
- గ్రామ్యములు (ఇవి అచ్చ తెలుగు పదములు)
- ప్రాకృత పదములు (ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు)
- వికృత పదములు (ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదాలు)
- అరువు పదములు (ఇవి ఉర్దూ, ఆంగ్లం మొదలగు భాషల నుండి అరువు తెచ్చుకున్న పదాలు)
ఉదాహరణ:
Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
గ్రామ్య పదం ( అచ్చ తెలుగు పదం) - " అలరాటం "
ప్రాకృత పదం ( సంస్కృతం ) - " సంతోషం"
వికృత పదం - " సంతసం "
అరువు పదం - " ఖుషి "
ఈ మాదిరిగా మన తెలుగు భాష లో పదాలను విభజన చెందాయి.
ఈ ప్రకృతి - వికృతి అంశం లో మనం కేవలం ప్రాకృత, వికృత శబ్దములను గూర్చి మాత్రమే మాట్లాడతాం.
చెప్పు-సెప్ప
- ముఖము - మొగము, మోము
- రూపము - రూపు
- వీధి - వీది
- శాల - సాల
- సందేహము - సందియము
- సపత్ని - సవతి
- యువతి - ఉవిద
- మతి - మది
- పినాకిని - పెన్న
- పీఠ - పీట
- పిత్తళ - ఇత్తడి
- దృఢము - దిటము
- దేవాలయము - దేవళము
- నిజము - నిక్కము
- కుమారుడు - కొమరుడు
- కావ్యము - కబ్బము
- కుఠారము - గొడ్డలి
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- తెలుగు వ్యాకరణము, వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.