అక్షాంశ రేఖాంశాలు: 18°13′59″N 78°14′31″E / 18.233°N 78.242°E / 18.233; 78.242

పోచారం అభయారణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోచారం అభయారణ్యం
IUCN category IV (habitat/species management area)
A view from Pocharam Lake with Herons, Egrets, Openbills
ప్రదేశంతెలంగాణ, భారత దేశము
సమీప నగరంమెదక్
భౌగోళికాంశాలు18°13′59″N 78°14′31″E / 18.233°N 78.242°E / 18.233; 78.242[1]
విస్తీర్ణం130 కి.మీ2 (50 చ. మై.)
స్థాపితం1952
http://forest.ap.nic.in/WL%20POCHARAM.htm

పోచారం వన్యప్రాణుల అభయారణ్యం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 115 కి.మీ. (71 మై.) దూరంలోనూ, మెదక్ నుండి 15 కి.మీ. (9.3 మై.) దూరంలోనూ గల అభయారణ్యం. ఇది 130 చదరపు కి.మీ పరిధిలో వ్యాపించి ఉంది. ఇది హైదరాబాదు నగర పాలకుడు నిజాం యొక్క వేటాడే స్థలం ఆ ఉండేది. అది 20 వ శతాబ్ద ప్రారంభంలో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది.1916 నుండి 1922 వరకు అల్లయిర్ గట్లు పోచారం సరస్సుకు యేర్పడిన తరువాత ఈ అభయారణ్యానికి "పోచారం అభయారణ్యం" అని నామకరణం చేశారు.ఇది సందర్శకులకు జీవావరణ కేంద్రంగా ఆకర్షిస్తుంది. ఇది అనేక క్షీరదాలకు, పక్షులకు ముఖ్య ఆవాసంగా నిలిచింది.[2] మెదక్‌ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విహారకేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

చరిత్ర

[మార్చు]

1916-27 ప్రాంతంలో నిజాం ప్రభువు తీరిక సమ యంలో జంతువులను వేటాడేందుకు ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా, మెదక్‌ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టు చూట్టూరా వున్న అటవీ ప్రాంతాన్ని షికార్‌ ఘర్‌ పేరుతో అభివృద్ధి పరిచారు. నిజాం పరిపాలన అంతరించి స్వాతంత్య్రం సిద్దించాక 1952 లో పోచారం అభయారణ్యం ఏర్పడిన తర్వాతకూ డా నవాబులు, ఉన్నతాధికారులు సైతం 1990 వరకు పోచారం అభయారణ్యంలో వేటాడటం కోసం అత్యాధునిక ఆయుధాలతో పోచారం అతిథి గృహంలో నివాసం వుంటూ వేటాడేవారు. దీంతో మెదక్‌ జిల్లా అటవీ శాఖ వన్య ప్రాణి విభాగం పరిధిలో మెదక్‌లో డివిజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పోచారం అభయారణ్యం 13 వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది.ఈ అభయారణ్యం పరిధిలో మెదక్‌ జిల్లాలోని మెదక్‌, రామాయంపేట మండలాలు, నిజామాబాద్‌ జిల్లాలో లింగంపేట, తాడ్వాయి, బిక్కనూర్‌, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. "Pocharam Sanctuary". protectedplanet.net. Archived from the original on 2014-11-29. Retrieved 2014-10-07.
  2. Gupta, Om (2006). Encyclopaedia of India, Pakistan and Bangladesh. Gyan Publishing House.
  3. Namasthe Telangana (27 February 2022). "న‌గ‌ర‌వాసుల మ‌న‌సు దోచేస్తున్న ఈ ప్రాంతం గురించి తెలుసా". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.

ఇతర లింకులు

[మార్చు]