పొన్నాల రామసుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొన్నాల రామసుబ్బారెడ్డి, "హంస" అవార్డు గ్రహీత 1932 జూలై 1న న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలం, పొట్టేపాలెం గ్రామంలో పొన్నాల వీరారెడ్డి, సంజీవమ్మ దంపతులకు జన్మించాడు.1950-52 మధ్యకాలంలో నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో చదివాడు. రెవెన్యూ డిపార్టుమెంటులో పలు కీలక బాధ్యతలు నిర్వహించి డిప్యూటీ తహసీల్దారుగా 1990లో పదవీ విరమణ చేసారు. తన 10 ఏళ్ళ వయసులో బాలపాత్రల్లో (లవుడు, కుశుడు, మార్కండేయుడు, లోహితాస్యుడు) పాత్రలలో నటించి మెప్పించారు.కళాశాల చదువులో మనసు కవి ఆచార్య ఆత్రేయ రచించిన "పరివర్తన" సాంఘిక నాటకంలోలో రంగడి పాత్రలో నటించాడ. తన 21 ఏళ్ళ వయసులో శ్రీ రామకృష్ణ నాట్యమండలి సంస్థకు కార్యదర్శిగా పలు పౌరాణిక నాటకాలు అన్ని రాష్ట్రాల్లో తన టీంతో ప్రదర్శించాడు. సత్య హరిశ్చంద్ర నాటకంలో "హరిశ్చంద్రుడు"గా, చిత్రనళీయం నాటకంలో "నలుడు", "బాహుకుడు"గా, భక్తరామదాసు నాటకంలో "రామదాసు"గా, పాదుకాపట్టాభిషేకం నాటకంలో "దశరథుడు"గా ఇంకా అనేక నాటకాల్లో వైవిధ్య భరిత పాత్రలు పోషించి మెప్పించాడు.అనేక కళా సంస్థల ద్వారా సన్మానాలు, సత్కారాలు అందుకున్నాడు.సినీ నటులు నందమూరి తారక రామారావు, గుమ్మడి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తదితరుల ప్రశంసలు పొందాడు. సుప్రసిద్ధ నటులు, హరికథ కళాకారులు, భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ కమిటీ స్థాపకులు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శిష్యుడుగా గుర్తింపబడ్డాడు. సాంబమూర్తి కూడా రామసుబ్బారెడ్డి నాటకాల్లో ముఖ్య పాత్రల్లో నటించడం విశేషం., సురభి నాటక కళాకారిణి వనారస కోటేశ్వరిదేవి, వల్లకవి సుబ్బారావు, పోలవరపు నాగరాజారావు, ధూళిపాళ్ళ శ్రీనివాసరావు తదితరులు ఇతని నాటకాలకు సహకరించగా, దోర్నాల హరిబాబు (ప్రస్తుత సినీ, టివి హాస్య నటుడు), బొగ్గల శేషయ్య, మాచవోలు సీతాపతి, వి. లక్ష్మీకాంత్ బాబు తదితరులు ఇతని శిష్యులుగా ప్రస్తుత నటులుగా పేరు తెచ్చుకున్నారు.[1]

అవార్డులు

[మార్చు]

రంగస్థలంలో విశేష సేవలు అందించించినందుకు గాను 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ అందుకున్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "రాష్ట్రం గర్వించదగ్గ కళాకారుడు పొన్నాల". andhrajyothy. Retrieved 2022-03-12.
  2. telugu, 10tv (2021-07-07). "AP Government : వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌, ఎచీవ్‌మెంట్‌ అవార్డులు | The AP Government announced YSR Lifetime Achievement and YSR Achievement Awards". 10TV. Retrieved 2022-03-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

వెలుపలి లంకెలు

[మార్చు]