పొన్నలూరి హనుమద్దాసు
స్వరూపం
పొన్నలూరి హనుమద్దాసు | |
---|---|
జననం | 1911 ఆమనగల్, ఆమనగల్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ |
మరణం | 1986 |
తండ్రి | రామయ్య పంతులు |
తల్లి | సరసమాంబ |
పొన్నలూరి హనుమద్దాసు తెలంగాణ రాష్ట్రంకు చెందిన వాగ్గేయకారుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]హనుమద్దాసు 1911లో రామయ్య పంతులు, సరసమాంబ దంపతులకు రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మండలం, ఆమనగల్ గ్రామంలో జన్మించాడు.[2]
సాహిత్య ప్రస్థానం
[మార్చు]చిన్నప్పటినుండి సాహిత్యం అభిమానం పెంచుకున్న హనుమద్దాసు భగవద్గీత, రామాయణంలను చదువుకున్నాడు. ఈయన తన తండ్రి నుండి శ్రీరామ తారక మంత్ర ఉపదేశం అందుకున్నాడు. నిరంతరం దైవధ్యానం చేసే హనుమద్దాసు మధురంగా కీర్తనలను ఆలపించేవాడు. శ్రీరాముడుని కీర్తిస్తూ శ్రీ హనుమంతరాజ సంగీత కీర్తనలు పేర గ్రంథాన్ని రచించి, శిష్యులకు వాటిని అందించాడు.
మరణం
[మార్చు]ఈయన 1986 సంవత్సర చైత్ర శుద్ధ తదియ రోజున మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (15 September 2019). "వాగ్గేయ వైభవం". www.ntnews.com. మామిడి హరికృష్ణ. Archived from the original on 16 సెప్టెంబరు 2019. Retrieved 25 November 2019.
- ↑ పొన్నలూరి హనుమద్దాసు, తెలంగాణ వాగ్గేయ వైభవం (పుస్తకం), తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, అక్టోబరు 2017, పుట. 48