పొటాషియం క్లోరెట్
| |||
పేర్లు | |||
---|---|---|---|
ఇతర పేర్లు
Potassium chlorate(V), Potcrate
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [3811-04-9] | ||
పబ్ కెమ్ | 6426889 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 223-289-7 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | FO0350000 | ||
SMILES | [K+].[O-]Cl(=O)=O | ||
| |||
ధర్మములు | |||
ClKO3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 122.55 g·mol−1 | ||
స్వరూపం | white crystals or powder | ||
సాంద్రత | 2.32 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 356 °C (673 °F; 629 K) | ||
బాష్పీభవన స్థానం | 400 °C (752 °F; 673 K) | ||
3.13 g/100 mL (0 °C) 4.46 g/100 mL (10 °C) 8.15 g/100 mL (25 °C) 13.21 g/100 mL (40 °C) 53.51 g/100 mL (100 °C) 183 g/100 g (190 °C) 2930 g/100 g (330 °C)[1] | |||
ద్రావణీయత | soluble in glycerol negliglble in acetone, liquid ammonia[2] | ||
ద్రావణీయత in glycerol | 1 g/100 g (20 °C)[2] | ||
వక్రీభవన గుణకం (nD) | 1.40835 | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం
|
monoclinic | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−391.2 kJ/mol[2][3] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
142.97 J/mol·K[2][3] | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 100.25 J/mol·K[2] | ||
ప్రమాదాలు | |||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [4] | ||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H271, H302, H332, H411[4] | ||
GHS precautionary statements | P220, P273[4] | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | మూస:R9, మూస:R20/22, మూస:R51/53 | ||
S-పదబంధాలు | (S2), మూస:S13, S16, మూస:S27, S61 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
1870 mg/kg (oral, rat)[5] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతరఅయాన్లు | {{{value}}} | ||
ఇతర కాటయాన్లు
|
Ammonium chlorate Sodium chlorate Barium chlorate | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
పొటాషియం క్లోరెట్ ఒకరసాయన సమ్మేళనం. అకర్బన రసాయనిక సమ్మేళన పదార్థం. రసాయన పరిశ్రమలలో సాధారణంగా తరచుగా వాడు రసాయన పదార్థం పొటాషియం క్లోరేట్.పరిశ్రమలలో పొటాషియం క్లోరెట్ను ఆక్సీకరణ కారకం గాను, ఆక్సిజన్ ఉత్పత్తి చెయ్యుటకు ఉపయోగిస్తారు.
భౌతిక ధర్మాలు
[మార్చు]ఈ సమ్మేళనం పోటాషియం, క్లోరిన్.ఆక్సిజన్ పరమాణువుల సంయోజనం వలన ఏర్పడినది.ఈ సమ్మేళనం యొక్క అణు ఫార్ములా KClO3.శుద్ధమైన సమ్మేళనం తెల్లటి స్పటిక నిర్మాణం కలిగియుండును. సాంద్రత:2.32గ్రాములు/లీటరుకు.మోలార్ భారం:122.55 గ్రామ/మోల్-1.ద్రవీభవన ఉష్ణోగ్రత:356 °C.బాష్పిభావన ఉష్ణోగ్రత 400 °C.
ఉత్పత్తి
[మార్చు]వ్యాపారస్థాయిలో పొటాషియం క్లోరెట్ ను లీబిగ్ విధానంలో ఉత్పత్తి చెయ్యుదురు. వేడిగా ఉన్న కాల్షియం క్లోరైడ్ పదార్థం లోకి క్లోరిన్ వాయువును ప్రసరింపచేసి, ఆపిమ్మట పొటాషియం క్లోరైడ్ ను కలపడం వలన పొటాషియం క్లోరైట్ ఏర్పడును.
- 6Ca(OH)2 + 6Cl2 -> Ca(ClO3)2 + 5CaCl2 + 6H2O
- Ca(ClO3)2 + 2KCl -> 2KClO3 + CaCl2
పొటాషియం క్లోరైడ్ సజల ద్రవాణాన్ని విద్యుత్ విశ్లేషణ చెయ్యడం ద్వారా కుడా పోటాషియం క్లోరైట్ ను ఉత్పత్తి చేయ్యుదురు. ఈ విధానంలో ఆనోడ్ వద్ద ఏర్పడిన క్లోరిన్ అయానులు, యథావిధిగా పొటాషియం హైడ్రోక్సైడ్తో ప్రతిచర్య జరపడం వలన పొటాషియం క్లోరెట్ ఏర్పడును. ఏర్పడిన పొటాషియం క్లోరైడ్ నీటిలో తక్కువ ద్రావణియత కలిగి ఉండటం వలన చర్యా మిశ్రమ ద్రావణంనుండి తనకుతానుగా అవక్షేపంగా వేరుపడును.
- 3 NaClO → 2NaCl + NaClO3
- KCl + NaClO3 → NaCl + KClO3
క్లోరిన్ వాయువును వేడి దాహకపొటాస్ (caustic potash) ద్రావణంలోకి పంపడం ద్వారా కుడా పొటాషియం క్లోరైట్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.
- 3 Cl2(g) + 6 KOH(aq) → KClO3(aq) + 5 KCl(aq) + 3 H2O(l)
రసాయనిక చర్యలు
[మార్చు]పొటాషియం క్లోరెట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరపడం వలన రసాయనికంగా అత్యంత చర్యాసిలత కలిగిన క్లోరిక్ ఆమ్లం (ద్రవం), పొటాషియం సల్ఫేట్ ఏర్పరచును.
- 2 KClO3 + H2SO4 → 2 HClO3 + K2SO4
పై చర్య ఫలితంగా ఏర్పడిన క్లోరిక్ ఆమ్లం అత్యంత చురుకైన చర్య గుణం కలిగి, చక్కెర, కాగితం వంటివాటితో తనకు తానుగా తక్షణమే చర్యకు లోనయ్యి మండును.రసాయన ప్రయోగ శాలలో హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఆక్సికరించి, క్లోరిన్ వాయువును ఉత్పత్తి చేయ్యుటకై వాడెదరు.
ఉపయోగాలు
[మార్చు]మందువలన కాల్చెడు తుపాకి కనుగొన్న తొలినాళ్ళలో తుపాకిమందులో ఉపయోగించు మందులో టాషిపోయంక్లోరేట్ ను ప్రముఖంగా వాడేవారు. ఆయుధమురాగిగొట్టాలలో వాడేవారు. క్లోరేట్ ఆధారిత చోదక, చాలకలలో ( propellants) పొటాషియం క్లోరెట్ ను వాడెదరు. సాధారణ ఆయుధ మందులు నీటివలన పాడైపోవు అవకాశంమెండు. కాని క్లోరేట్ కలిగిన మందుగుండు సామాగ్రి అంత త్వరగా పాడై పోయే అవకాశం తక్కువ.అయితే క్లోరేట్ ఉపయోగించిన మందుగుండు సల్ఫర్, భాస్వరం ల సమక్షలో అంత స్థిరమైనది కాదు. తగిన ప్రమాణంలో సరైయన ఇంధన పదార్థాన్ని జోడించిన ఇది ప్రేలుడుపదార్థంగా పనిచేయును.
పొగ బాంబులలో పొగను ఎక్కువ మోతాదులో వెలువడునట్లు చేయుటకు ఉపయోగిస్తారు. 2005 నుండి పొటాషియంక్లోరెట్, లాక్టోస్, రోసిన్ లమిశ్రంతో తెల్లపోగ వెలువరించు కార్ట్రిడ్జిలను తయారు చేస్తున్నారు.అయితే ఈ బాంబులను కొత్త పోప్ ను ఎన్నుకోన్నప్పుడు సంకేతంగా వెలిగించుటకు మాత్రమేఉపయోగిస్తున్నారు.
పాఠశాలల్లో, కళాశాలలలోని ప్రయోగ శాలలో ఆక్సిజన్ వాయువును ఉత్పత్తిచేయ్యుటకు ఉపయోగిస్తారు.ఇది సిలెండరులలోవత్తిడితో నిల్వ వుంచిన, అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలోట్యాంకులో ఉంచిన ఆక్సిజన్ కన్నా చౌకైనది. పొటాషియం క్లోరేట్ ను మాంగనీస్ (IV) వంటి ఉత్ప్రేరకం సమక్షములో వేడిచేసిన, అది వియోగం చెందటం వలన ఆక్సిజన్ వాయువు ఉత్పన్నం అగును.పొటాషియం క్లోరెట్ ను ఒక పరీక్షనాళికలో తీసుకుని బర్నరుమీద వేడిచేసిన ఆక్సిజన్ వాయువు వెలువడును.పరీక్షనాళిక మూతికి ఒంటిరంధ్రమున్న బిరడాబిగించి, దానికి ఒక రబ్బరు గొట్టం బిగించిన, ఆగొట్టం ద్వారా వాయువు బయటకు వచ్చును.
- 2 KClO3(s) → 3 O2(g) + 2 KCl(s)
పొటాషియం క్లోరెట్ ను ఉత్ప్రేరకంలేకుండా వేడిచేసిన మొదట పొటాషియం పేర్ క్లోరేట్ గా మారుతుంది.
- 4 KClO3 → 3 KClO4 + KCl
వేడి చేయ్యుటను ఇంకను కొనసాగించిన పొటాషియం పేర్ క్లోరేట్ వియోగం చెందటంవలన పొటాషియం క్లోరైడ్, ఆక్సిజన్ వాయువు ఏర్పడును.
- KClO4 → KCl + 2O2
పై విధమైన పద్ధతిలో ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయ్యునప్పుడు తగు రక్షణ జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంది.ఉపయోగించు పొటాషియం క్లోరెట్ ఎటువంటి మలినాలు లేకుండా శుద్ధమైనది అయ్యిఉండాలి. అలాగే రసాయన పదార్థాన్ని వేడిచేయ్యునప్పుడు ఉష్ణోగ్రతను కావల్ససిన స్థాయిలో నియంత్రణలో ఉంచాలి.పోటాషియం క్లోరెట్ శక్తివంతమైన అక్సీకరణి.తనతకు తానుగా చక్కెర వంటి సాధారణ రసాయనాలలో చర్య జరుపు సామార్థ్యము కలిగినటువంటి సమ్మెళన పదార్థం పోటాషియం క్లోరెట్.క్లోరెట్ లోని మలినాల వలన రసాయన చర్య జరుగునప్పుడు ప్రేలి ప్రమాదం సంభవించు అవకాశంఉన్నది.అందు వలన పరీక్ష చెయ్యునప్పుడు, ముందుగా తక్కువ మోతాదులో పొటాషియం క్లోరెట్ ను తెరచిఉన్న గాజు ప్లేటులో తీసుకోని వేడిచెయ్యవలెను.ప్రేలుడుఏర్పడిన ఆ రసాయానాన్నిఆక్సిజన్ ఉత్పత్తి చెయ్యుటకు వాడరాదు.
పొటాషియం క్లోరెట్ను రసాయనిక ఆక్సిజన్ వాయు జనకాలలో (chemical oxygen generators ) ఉపయోగిస్తారు.వీటినిక్లోరెట్ క్రోవ్వోత్తులు, లేదా ఆక్సిజన్ కొవ్వొత్తులు అనికూడా అంటారు.విమానాలలో, అంతరిక్షపరిశోధన కేంద్రాలలో, సబ్ మేరైను లలో ఆక్సిజను జనకంగా పొటాషియం క్లోరెట్ ను వాడెదరు.ఈ రసాయనం కారణంగా ఒక విమాన ప్రమాదం జరిగినట్లు తెలియ కాచ్చుచున్నది.అలాగే మీర్ స్పేస్ స్టేషనులో కుడా ఈ రసాయనంవలన అగ్ని ప్రమాదం జరిగింది.
పొటాషియం క్లోరెట్ను క్రిమినాశిని మందుగా కుడా ఉపయోగిస్తారు.ఫిన్లాండ్ దేశంలో దీనిని ఫెగాబిట్ పేరుతొ అమ్మకంలో ఉంది.అగ్గిపుల్లలలలో తయారీలో ఉపయోగిస్తారు.ప్రేలుడుపదార్థాలు, (including IEDs[6], బాణాసంచా ( fireworks) తయారీలో వాడెదరు. వ్యవసాయంలో లోంగాన్ (longan) చెట్టుయొక్క పూలు త్వరగా వికసించుటకై (వెచ్చని వాతావరణం ఉండగానే వికసించుటకై) పొటాషియం క్లోరెట్ ను ఉపయోగిస్తారు
భద్రత
[మార్చు]పొటాషియం క్లోరెట్ ఉపయోగించునప్పుడు చాలాజాగ్రత్తగా ఉండాలి.అన్ని రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని సందర్భాలలో మండే లక్షణాలున్న పదార్థాలలో కలియడం వలన చాలావేగంగా, తీవ్రంగా తనకుతాను హఠాత్తుగా మండటం కాని ప్రేలడం కాని జరుగును.పొటాషియం క్లోరెట్, మండేగుణమున్న (దహనశీల) వస్తువుల మిశ్రమం సల్ఫ్యూరిక్ అమ్ల్లం టో సంపర్కం వలన వెంటనే మండే అవకాసమున్నందున, ఈ ఆమ్లంతో పొటాషియ క్లోరెట్, మండే వస్తువుల మిశ్రమాన్ని దూరంగా ఉంచాలి.
మూలాలు
[మార్చు]- ↑ Seidell, Atherton; Linke, William F. (1952). Solubilities of Inorganic and Organic Compounds. Van Nostrand. Retrieved 2014-05-29.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 http://chemister.ru/Database/properties-en.php?dbid=1&id=331
- ↑ 3.0 3.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A22. ISBN 0-618-94690-X.
- ↑ 4.0 4.1 4.2 Potassium chlorate
- ↑ http://chem.sis.nlm.nih.gov/chemidplus/rn/3811-04-9